అనంత్‌-రాధిక ప్రీ వెడ్డింగ్‌ : భారీ ఏర్పాట్లు, మొత్తం ఖర్చు ఎంతంటే..! | Anant Ambani And Radhika Merchant Pre Wedding: Do You Know The Total Expenditure, Details Inside - Sakshi
Sakshi News home page

Anant Ambani Pre Wedding Expenditure: భారీ ఏర్పాట్లు, మొత్తం ఖర్చు ఎంతంటే..!

Published Tue, Mar 5 2024 11:27 AM | Last Updated on Tue, Mar 5 2024 1:11 PM

Anant Radhika pre wedding Do you know the totoal Expenditure - Sakshi

 కళ్లు  చెదిరే వసతులు,  రికార్డ్‌ స్థాయిలో ఖర్చు 

 కనివినీ ఎరుగని రీతిలో ఏర్పాట్లు

అతిధులకోసం ప్రత్యేక విమానాలు

బిలియనీర్‌ ముఖేష్‌ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్‌ వేడుకలు ఘనంగా జరిగాయి. గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో అనంత్‌-రాధికా మర్చంట్‌ ప్రీ వెడ్డింగ్ వేడుకలకు  పలువురు ‍రాజకీయ, క్రీడా, సినీ రంగ ప్రముఖులతోపాటు, గ్లోబల్ టెక్ సీఈఓలు, పాప్ ఐకాన్‌లు  హాజరు కావడం విశేషంగా నిలిచింది. మూడు రోజుల పాటు అత్యంత వైభవంగా జరిగిన  ఈ ఈవెంట్‌ యావత్‌ ప్రపంచం దృష్టిని ఆకర్షించడం విశేషం.

ప్రీ వెడ్డింగ్ సందడే ఇంత ఘనంగా జరుగుతోంటే, అదీ ముఖేష్‌ అంబానీ సంతానంలో జరుగుతున్న చివరి పెళ్లి వేడుక కావడంతో అనంత్‌ అంబానీ పెళ్లి తంతు ఇంకెంత ఘనంగా ఉంటుందో అనే చర్చ మొదలైంది. అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ బాష్‌కు రూ.1260 కోట్లు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. తద్వారా ప్రపంచంలో అత్యంత విలాసవంతమైన వేడుకగా ఇది నిలిచింది. 

మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, మెటా హెడ్ మార్క్ జుకర్‌బర్గ్, ఇవాంకా ట్రంప్, ఇలా డజన్ల కొద్దీ ఇతర ప్రముఖులు బసకోసమే ఏకంగా సుమారు రూ. 52 కోట్లు  ఖర్చు పెట్టారట. పాప్ ఐకాన్ రిహన్నా సహా, వీరందరికోసం  విలాసవంతమైన వసతి గృహాన్ని ఏర్పాటు చేశారు. అంతేకాదు, దేశ, విదేశీ భారతీయ అతిథుల కోసం ముఖేష్ అంబానీ ప్రైవేట్ విమానాలను కూడా ఏర్పాటు చేశారు.

కేటరింగ్ కాంట్రాక్టుకే రూ.200 కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు సమాచారం. మూడు రోజుల పాటు అద్భుతమైన పూలకోసం కూడా భారీగానే  వెచ్చించారట. ఫ్యాషన్ డిజైనర్ మనీష్‌ మల్హోత్రా ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ ప్రకారం అమెరికన్ పూల డిజైనర్ జెఫ్ లీథమ్‌ అదిరిపోయే కలర్‌ఫుల్‌ ఫ్లవర్‌ సెట్టింగ్స్‌ తీర్చిదిద్దాడు. కాగా 2023, జనవరిలో  నిశ్చితార్థం చేసుకున్న అనంత్ -రాధికా మర్చంట్ఈ  ఏడాది జూలైలో పెళ్లి పీటలెక్కేందుకు సిద్ధమవుతున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement