సామాజిక రంగ వ్యయంలో ఏపీ టాప్
ఏప్రిల్ నుంచి జూన్ వరకు రూ.37,699.55 కోట్లు
దేశంలో మరే రాష్ట్రమూ ఇంత వ్యయం చేయలేదు
వైద్యం, విద్య, సంక్షేమంపై జగన్ ప్రభుత్వం అత్యధిక వ్యయం
కాగ్ వెల్లడి
సాక్షి, అమరావతి: ఎన్నికల సమయంలో కూడా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ద్వారా పేదల సంక్షేమానికి, వారి అభివృద్ధికే వైఎస్ జగన్ ప్రభుత్వం ఎంతగానో కృషి చేసింది. ఈ విషయాన్ని కం్రప్టోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా(కాగ్) స్పష్టం చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి మూడు నెలలకు సంబంధించి వివిధ రాష్ట్రాల వ్యయాలను కాగ్ వెల్లడించింది. సామాజిక రంగ వ్యయంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. సామాజిక రంగానికి రూ.37, 699.55 కోట్ల వ్యయం చేసి టాప్‌లో నిలవగా.. ఉత్తరప్రదేశ్ రూ.32,800.46 కోట్ల వ్యయం చేసి రెండో స్థానంలో నిలిచింది.
సామాజిక రంగ వ్యయం అంటే..
సామాజిక రంగ వ్యయం అంటే విద్య, వైద్య, గ్రామీణాభివృద్ధి, పట్టణాభివృద్ధి, పౌష్టికాహారం, సంక్షేమం, పారిశుద్ధ్యం, మంచి నీటి సరఫరాపై చేసిన వ్యయంగా పరిగణిస్తారు. ఈ వ్యయాన్ని మానవ వనరుల అభివృద్ధితో పాటు ప్రజలకు అవసరమైన కనీస మౌలిక సదుపాయాల కల్పనకు కొలబద్దగా కాగ్, ఆర్‌బీఐ పరిగణిస్తాయి.
ఎన్నికల నోటిఫికేషన్ వెలువడటానికి ముందుగానే.. ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌లో నవరత్నాల సంక్షేమ పథకాలకు ఎలాంటి లోటు లేకుండా గత వైఎస్ జగన్ ప్రభుత్వం నిధులను కేటాయించింది. ఎన్నికల సమయంలో సైతం పేదలు నష్టపోకుండా పథకాల ఫలాలు అందించేందుకు కృషి చేసింది.
Comments
Please login to add a commentAdd a comment