Social sector
-
ఎన్నికల వేళాపేదల సంక్షేమం
సాక్షి, అమరావతి: ఎన్నికల సమయంలో కూడా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ద్వారా పేదల సంక్షేమానికి, వారి అభివృద్ధికే వైఎస్ జగన్ ప్రభుత్వం ఎంతగానో కృషి చేసింది. ఈ విషయాన్ని కం్రప్టోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా(కాగ్) స్పష్టం చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి మూడు నెలలకు సంబంధించి వివిధ రాష్ట్రాల వ్యయాలను కాగ్ వెల్లడించింది. సామాజిక రంగ వ్యయంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. సామాజిక రంగానికి రూ.37, 699.55 కోట్ల వ్యయం చేసి టాప్‌లో నిలవగా.. ఉత్తరప్రదేశ్ రూ.32,800.46 కోట్ల వ్యయం చేసి రెండో స్థానంలో నిలిచింది. సామాజిక రంగ వ్యయం అంటే.. సామాజిక రంగ వ్యయం అంటే విద్య, వైద్య, గ్రామీణాభివృద్ధి, పట్టణాభివృద్ధి, పౌష్టికాహారం, సంక్షేమం, పారిశుద్ధ్యం, మంచి నీటి సరఫరాపై చేసిన వ్యయంగా పరిగణిస్తారు. ఈ వ్యయాన్ని మానవ వనరుల అభివృద్ధితో పాటు ప్రజలకు అవసరమైన కనీస మౌలిక సదుపాయాల కల్పనకు కొలబద్దగా కాగ్, ఆర్బీఐ పరిగణిస్తాయి. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడటానికి ముందుగానే.. ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో నవరత్నాల సంక్షేమ పథకాలకు ఎలాంటి లోటు లేకుండా గత వైఎస్ జగన్ ప్రభుత్వం నిధులను కేటాయించింది. ఎన్నికల సమయంలో సైతం పేదలు నష్టపోకుండా పథకాల ఫలాలు అందించేందుకు కృషి చేసింది. -
సామాజిక రంగ వ్యయంలో దక్షణాదిలో ఏపీనే టాప్
సాక్షి, అమరావతి: పేదలను విద్యావంతులు, ఆరోగ్యవంతులుగా చేస్తే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. అందుకే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్య, వైద్య రంగాలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు నవరత్నాలు, ఇతర సంక్షేమ పథకాలపై అత్యధిక వ్యయం చేస్తున్నారు. పేదల అభ్యన్నతి కోసం నిరంతరం కృషి చేస్తున్నారు. ప్రభుత్వ రంగ విద్య అభివృద్ధికి పలు కార్యక్రమాలు చేపట్టారు. ప్రతి పేదింటి పిల్లవాడూ లేదా అమ్మాయి చదువు మధ్యలో ఆపేయకుండా అమ్మ ఒడి, జగనన్న విద్యా దీవెన వంటి అనేక ప్రోత్సాహకాలు అందిస్తున్నారు. ప్రతి ప్రభుత్వ పాఠశాలనూ అత్యాధునికంగా తీర్చిదిద్దుతున్నారు. అంతర్జాతీయ స్థాయి సిలబస్‌ను పిల్లలకు అందిస్తున్నారు. అదే విధంగా ఆరోగ్య శ్రీ పథకం ద్వారా పేదలకు కార్పొరేట్ వైద్యాన్ని అందిస్తున్నారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు ప్రభుత్వ ఆసుపత్రులను ఆధునీకరించి, అత్యాధునిక సౌకర్యాలు కల్పిస్తున్నారు. పేదల ఇంటి వద్దకే వైద్యాన్ని చేరుస్తున్నారు. గ్రామీణ, పట్టణాభివృద్ధిపైనా దృష్టి కేంద్రీకరించారు. బడి పిల్లలు, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారాన్ని అందిస్తున్నారు. గ్రామాలు, నగరాల్లో పారిశుద్ధ్యాన్ని పెంపొందిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా రక్షిత మంచి నీరు అందిస్తున్నారు. ఇలా సామాజిక రంగానికి సీఎం వైఎస్ జగన్ పెద్ద పీట వేస్తున్నారు. తద్వారా గత ఐదేళ్లుగా సామాజిక రంగ కేటాయింపులు, వ్యయంలో మన రాష్ట్రం ముందుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023–24) తొలి పది నెలల్లోనూ (ఏప్రిల్ నుంచి జనవరి వరకు) సామాజిక రంగ కేటాయింపులతో పాటు వ్యయంలోనూ దక్షిణాది రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది. ఈ విషయాన్ని కాగ్ గణాంకాలు వెల్లడించాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రాల బడ్జెట్ కేటాయింపులు, నెలవారీ వివిధ రంగాలకు చేసిన వ్యయాలపై కాగ్ గణాంకాలను వెల్లడించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రాష్ట్ర బడ్జెట్లో వైఎస్ జగన్ ప్రభుత్వం సామాజిక రంగానికి రూ.1,30,366 కోట్లు కేటాయించింది. ఇందులో పది నెలల్లోనే రూ.1,07,610 కోట్లు ఖర్చు చేసినట్లు కాగ్ తెలిపింది. ఇది ఏకంగా 82.54 శాతం. సామాజిక రంగానికి ఇంత పెద్ద ఎత్తున కేటాయింపులు, ఆ నిధులను సమర్ధంగా వినియోగించడంలో దక్షిణాదిలో మిగతా రాష్ట్రాలు వెనకబడ్డాయని కాగ్ గణాంకాలు వెల్లడించాయి. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ తరువాత స్థానంలో తమిళనాడు రాష్ట్రం ఉంది. మూడో స్థానంలో కర్నాటక,, నాలుగో స్థానంలో తెలంగాణ,, ఐదో స్థానంలో కేరళ రాష్ట్రాలు ఉన్నట్లు కాగ్ గణాంకాలు స్పష్టం చేశాయి. సామాజిక రంగ వ్యయం అంటే.. సామాజిక రంగ వ్యయం అంటే విద్య, వైద్య, గ్రామీణాభివృద్ధి, పట్టణాభివృద్ధి, పౌష్టికాహారం, సంక్షేమం, పారిశుద్ధ్యం, మంచి నీటి సరఫరాపై చేసిన వ్యయంగా పరిగణిస్తారు. సామాజిక రంగ వ్యయాన్ని మానవ వనరుల అభివృద్ధితో పాటు ప్రజలకు అవసరమైన కనీస మౌలిక సదుపాయాల కల్పనకు కొలబద్దగా కాగ్, ఆర్బీఐ పరిగణిస్తాయి. -
సామాజికరంగ వ్యయం రూ.3.06 లక్షల కోట్లు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం సామాజిక రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు కం్రప్టోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా (కాగ్) అకౌంట్స్ నివేదిక–2022–23 స్పష్టం చేసింది. గత నాలుగేళ్ల నుంచి ఏటా సామాజిక రంగ వ్యయం పెరుగుతుండటమే ఇందుకు నిదర్శనమని వెల్లడించింది. గత నాలుగేళ్లలో సామాజిక రంగానికి రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా రూ.3.06 లక్షల కోట్లు వ్యయం చేసినట్లు పేర్కొంది. విద్య, వైద్య ఆరోగ్య– కుటుంబ సంక్షేమం, తాగునీరు, పారిశుధ్యం, గృహనిర్మాణం, పట్టణాభివృద్ది, కార్మిక ఉపాధి, సంక్షేమం, సామాజిక భద్రతలను సామాజిక రంగంగా పరిగణిస్తారు. విద్య, వైద్య రంగాలకు, పౌష్టికాహారానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుండటంతో ఆ రంగాలపై ఎక్కువ ఖర్చు చేసినట్టు కాగ్ అకౌంట్స్ నివేదిక తెలిపింది. మరోవైపు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలతో పాటు ఇతర వర్గాల్లోని పేదల సంక్షేమానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోంది. దీంతో సామాజిక రంగం వ్యయం ఏటా పెరుగుతున్నట్లు నివేదిక వెల్లడించింది. అలాగే కార్మికుల సంక్షేమంతో పాటు తాగునీటి సరఫరాకు గత నాలుగేళ్లుగా ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోంది. -
సామాజిక రంగ వ్యయంలో ఏపీనే టాప్
సాక్షి, అమరావతి: సామాజిక రంగ వ్యయంలో ఆంధ్రప్రదేశ్ మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే అగ్రభాగాన నిలిచింది. ఆ తర్వాత గుజరాత్ రెండో స్థానంలో ఉందని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ గణాంకాలు (కాగ్) పేర్కొన్నాయి. బడ్జెట్ కేటాయింపుల్లో ఈ ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలలైన ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు వివిధ రాష్ట్రాల వ్యయాలను కాగ్ వెల్లడించింది. సామాజిక రంగ వ్యయం అంటే విద్య, వైద్య, వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, పట్టణాభివృద్ధి, పౌష్టికాహారం, పారిశుధ్యం, మంచినీటి సరఫరాపై చేసిన వ్యయంగా పరిగణిస్తారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్య రంగాలతో పాటు సంక్షేమం పథకాలపై ఇతర రాష్ట్రాలు కన్నా అత్యధికంగా వ్యయం చేసినట్లు కాగ్ పేర్కొంది. బడ్జెట్ కేటాయింపులు జరిగిన తొలి ఆరు నెలల్లోనే ఈ రంగంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 55.71 శాతం వ్యయం చేసినట్లు స్పష్టంచేసింది. ఈ వ్యయాన్ని మానవ వనరుల అభివృద్ధితో పాటు ప్రజలకు అవసరమైన కనీస మౌలిక సదుపాయాల కల్పనగా పేర్కొంటారు. ఇక కాగ్‌తో పాటు ఆర్బీఐ కూడా సామాజిక రంగ వ్యయాన్ని కొలమానంగా విశ్లేషిస్తాయి. ఈ రంగంపై మరే ఇతర రాష్ట్రం ఇంత పెద్దఎత్తున వ్యయం చేయలేదు. ఆంధ్రప్రదేశ్ తరువాత సామాజిక రంగ కేటాయింపుల్లో గుజరాత్ 42.83 శాతంతో రెండో స్థానంలో ఉందని కాగ్ తెలిపింది. మరోవైపు.. ఆస్తుల కల్పనకు చేసిన బడ్జెట్ కేటాయింపుల్లో.. తెలంగాణ మొదటి స్థానంలో ఉండగా ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో ఉంది. ఇందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తొలి ఆరు నెలల్లో 53.37 శాతం నిధులు వ్యయం చేయగా.. తెలంగాణ తన బడ్జెట్ కేటాయింపుల్లో 60.86 శాతం ఖర్చుపెట్టి మొదటి స్థానంలో నిలిచింది. -
డబ్బుంది.. కళ్ల జబ్బుందా?
సాక్షి, అమరావతి: ప్రభుత్వాలు సామాజిక దృక్పథంతో బాధ్యతగా వ్యవహరించినప్పుడే సమాజం అభివృద్ధి చెందుతుంది! విద్య, వైద్యం, బడుగు–బలహీన వర్గాల సంక్షేమం కోసం వెచ్చించే వ్యయం ఈ కోవలోకే వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం సామాజిక రంగానికి పెద్దపీట వేస్తుంటే ఈనాడు రామోజీకి రుచించడం లేదు! కాగ్ ప్రొవిజనల్ గణాంకాల్లోనే ఈ వివరాలన్నీ ఉన్నా ఆ డబ్బంతా ఏమైందోనంటూ యథాప్రకారం మరో తప్పుడు కథనాన్ని భుజానికెత్తుకున్నారు!! అనుబంధ సంస్థల్లోకి మళ్లించేందుకు ప్రభుత్వమేమీ మార్గదర్శి చిట్‌ఫండ్స్ సంస్థ కాదు కదా! కాగ్ ప్రొవిజనల్ గణాంకాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఏ రంగానికి ఎంత వ్యయం చేసిందో స్పష్టంగా పేర్కొంది. రైతులు, అక్క చెల్లెమ్మలు, విద్యార్ధులు, పెద్దలు, వితంతువులు, పౌష్టికాహార లోపం కలిగిన చిన్నారులు, బాలింతలతోపాటు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగుల ఖాతాల్లోకి రూ.రెండు లక్షల కోట్లకుపైగా ప్రభుత్వం జమ చేసినట్లు తెలుస్తున్నా కబోదుల్లా నటించే వారిని ఏమనుకోవాలి? కాగ్ ప్రొవిజనల్ గణాంకాల ప్రకారం ముగిసిన ఆర్ధిక సంవత్సరంలో మూలధన వ్యయం రూ.7,581.58 కోట్లు కాగా రామోజీ మాత్రం రూ.6,916 కోట్లు అంటూ సొంత లెక్కలు చెప్పారు మరి! సామాజిక వ్యయంలో సరితూగగలవా? ఏ ప్రభుత్వానికైనా కొన్ని ప్రాధాన్యతలుంటాయి. వాటి మేరకు వ్యయం చేస్తాయి. మూలధన వ్యయానికి కూడా ప్రభుత్వాలు ప్రాధాన్యం ఇస్తాయి. అయితే ప్రభుత్వాలు తప్పసరిగా నెరవేర్చాల్సిన సామాజిక బాధ్యతలూ ఉంటాయి. వాటికి ఎక్కువ నిధులు అవసరమైనప్పుడు మూలధన వ్యయం తగ్గుతుందని, ఇందులో కొంపలు కొల్లేరయిపోయే ప్రమాదం ఏమీ లేదని ఆర్ధిక శాఖ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. 17 కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటు, ఆస్పత్రుల అభివృద్ధి, స్కూళ్లు బాగు చేయడం, వ్యవసాయం, పారిశ్రామిక రంగాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు వెచ్చిస్తున్న డబ్బు పెట్టుబడి వ్యయం కాదా? రాష్ట్ర ప్రభుత్వం సామాజిక రంగానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తుండటంతో గత నాలుగేళ్లుగా ఆ వ్యయం పెరుగుతోంది. మిగతా రాష్ట్రాలేవీ సామాజిక రంగంపై మన రాష్ట్రం చేస్తున్నంత వ్యయం చేయడం లేదని ఆర్థిక శాఖ వర్గాలు గుర్తు చేస్తున్నాయి. అలాంటప్పుడు మూలధన వ్యయంలో వెనుకబడ్డామంటూ ఈశాన్య రాష్ట్రాలతో మనకు పోలిక ఎందుకు? ► 2022–23కి సంబంధించి కాగ్ ప్రొవిజనల్ గణాంకాలను మాత్రమే వెల్లడించింది. సాధారణ, సామాజిక, ఆర్థిక రంగాల వారీగా ప్రభుత్వ వ్యయం ఉంటుంది. జీతాలు, వడ్డీ చెల్లింపులు, పెన్షన్లు, సబ్సిడీ కోసం చేసిన ఖర్చులుంటాయి. సమాచారాన్ని దాచి పెట్టాల్సిన అవసరం ప్రభుత్వానికి ఏమాత్రం లేదు. ► మూలధన వ్యయం తక్కువగా ఉందని, రాష్ట్రం పరిస్థితి అధ్వానంగా ఉందన్న రామోజీ రాతల్లో నిజం లేదు. ప్రభుత్వాలు తమ ప్రాథమిక బాధ్యతలో భాగంగా కొన్నింటికి ప్రాధాన్యం ఇవ్వడం వల్ల వాటిని రెవెన్యూ వ్యయం కింద పరిగణిస్తారు. ఆరోగ్యం, విద్యలో అసమానతలు రూపుమాపడం, గ్రామీణ – పట్టణ అసమాన తలను తగ్గించడం తదితర లక్ష్యాల సాధనకు సహజంగానే అధిక వ్యయం చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ రెవెన్యూ వ్యయంగా వర్గీకరించడం వల్ల మూలధన వ్యయం తగ్గినట్లు కనిపిస్తుంది. నిజానికి మానవ వనరుల అభివృద్ధి, సామాజిక ఆస్తుల కల్పనకు ఈ వ్యయం ఎంతో అవసరం. ► గత సర్కారు 2014–19 మధ్య కాలంలో విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలతో పాటు పేదల అభ్యున్నతిని విస్మరించింది. వాటిని మెరుగుపరిచేందుకు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోంది. గత ప్రభుత్వ హయాంలో ప్రాథమిక విద్యలో స్థూల నమోదు (జీఈఆర్) జాతీయ సగటు 99 కాగా మన రాష్ట్రంలో దేశంలోనే అతి తక్కువగా 84.48 ఉంది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం విద్యా రంగ సంస్కరణల కోసం నాలుగేళ్లలో దాదాపు రూ.67 వేల కోట్లను వెచ్చించి చదువులను గాడిన పెట్టింది. నాడు–నేడుతో సర్కారు స్కూళ్లను కార్పొరేట్‌కు ఏమాత్రం తీసిపోకుండా తీర్చిదిద్దింది. నిజానికి ఇప్పుడు ప్రైవేట్ స్కూళ్లే ప్రభుత్వ విద్యాసంస్థలతో పోటీ పడాల్సిన పరిస్థితికి వచ్చాయి. అమ్మ ఒడి నుంచి విద్యాదీవెన, వసతి దీవెన, విద్యా కానుక, విదేశీ విద్యా దీవెన.. ఇలా ఎన్నో పథకాలను తీసుకొచ్చి పిల్లలు చదువుకునేలా ప్రభుత్వం అండగా నిలిచింది. ఇంగ్లీషు మీడియం, సీబీఎస్ఈ విధానంతోపాటు నాణ్యమైన విద్య అందించేలా బైజూస్ కంటెంట్‌ను సమకూర్చింది. డిజిటల్ తరగతి గదులను ఆరు, ఆపై తరగతుల నుంచి అందుబాటులోకి తెచ్చింది. ఇలాంటి చర్యల వల్ల ప్రాథమిక విద్యలో జీఈఆర్ 2021–22లో జాతీయ స్థాయిని మించి ఏపీలో 100.7కు పెరిగింది. ఇది రాష్ట్ర ఉజ్వల భవిష్యత్తుకు దోహదం చేస్తుంది. ఇది రెవెన్యూ వ్యయం కిందకు వస్తుంది. మరి ఈ వ్యయాన్ని వృథా అని రామోజీ గగ్గోలు పెడుతుంటే ఏం చెప్పాలి? ► మూలధన వ్యయం చూసినా గతంలో కంటే ఇప్పుడే మెరుగ్గా ఉంది. టీడీపీ హయాంలో సగటున ఏడాదికి రూ.15,277.80 కోట్లు మూలధన వ్యయం కాగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం సగటున ఏడాదికి రూ.16,095.90 కోట్లు మూలధన వ్యయం కింద వెచ్చించింది. రూ.15,000 కోట్లతో ఒకేసారి నాలుగు కొత్త పోర్టుల నిర్మాణాన్ని చేపడుతోంది. ఇది మూలధన వ్యయం కిందకే వస్తుంది. ‘ఎస్పీవీ’ ద్వారా చేపడుతున్నందున దీన్ని మూలధన వ్యయంగా గుర్తించకున్నా ఇది కచ్చితంగా ఆస్తుల కల్పన వ్యయమే. ► రాష్ట్రంలో 20 – 59 ఏళ్ల వయసున్న వారు ఉపాధి కోసం వలస వెళ్తున్నట్లు ఈనాడు అవాస్తవాలు ప్రచురించింది. రాష్ట్రంలో ఆ వయసు వారు 2014తో పోల్చితే పెరిగారే కానీ తగ్గలేదు. 0 – 14 ఏళ్ల లోపు జనాభా ఆంధ్రప్రదేశ్‌లోనే కాకుండా దేశమంతా తగ్గుతోంది. జననాలు తక్కువ ఉన్నప్పుడు యువత ఎలా వస్తారు? వలసలు ఎలా పెరిగాయో రామోజీకే తెలియాలి. ► ఐరాస నిర్దేశించిన సుస్థిర లక్ష్యాల సాధనకు సామాజిక రంగంపై వ్యయం పెరుగుదల సముచితమేనని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే కూడా చెబుతోంది. సామాజిక రంగంపై వ్యయం పెంచాలని రాష్ట్రాలకు సూచిస్తోంది. సామాజిక రంగంపై వెచ్చించే వ్యయం వ్యక్తులు, సమాజ అభివృద్ధికి దోహదం చేస్తుందని పేర్కొంది. ► పాఠశాలలు, ఆస్పత్రులు నిర్మించాలంటూ రిటైర్డ్ అధికారి పీవీ రమేష్ సూచించినట్లు ఈనాడు తన కథనంలో పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం చేస్తోంది కూడా అదే కదా? సామాజిక రంగాలు అంటే? విద్య, వైద్యం, కుటుంబ సంక్షేమం, గృహ నిర్మాణం, తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం, గృహ నిర్మాణం, పట్టణాభివృద్ధి, ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమం, కార్మిక సంక్షేమం, పౌష్టికాహారం, విపత్తుల సహాయం తదితరాలు ఇందులోకి వస్తాయి. సాధారణ రంగాలు.. జీతభత్యాలు, పెన్షన్లు, వడ్డీలు, అప్పులు, చెల్లింపులు, పరిపాలన, నిర్వహణకు వ్యయం తదితరాలు. ఆర్థిక రంగాలు.. వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, ఇరిగేషన్, విద్యుత్, పరిశ్రమలు, రవాణా వ్యయం, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం, పర్యావరణ రంగాలు. అప్పులపై తప్పుడు రాతలు.. గత ఆర్థిక సంవత్సరంలో రూ.51,453.22 కోట్లు అప్పులు చేసినట్లు కాగ్ ప్రొవిజనల్ గణాంకాల్లో పేర్కొంది. ఈనాడు రామోజీ మాత్రం బడ్జెట్, బడ్జెట్ బయట రూ.90 వేల కోట్లు అప్పు చేసినట్లు పచ్చి అవాస్తవాలను ప్రచురించారు. అప్పులు ఎంత చేశారో కాగ్ నిర్థారిస్తుంది కానీ రామోజీ ఊహాగానాలు కాదు! -
సామాజిక రంగంపై వ్యయంలో సౌత్ లో ఏపీ నెం.1
-
సామాజిక రంగంపై వ్యయం.. అభివృద్ధికి సంకేతం
సాక్షి, అమరావతి: సామాజిక రంగంపై వెచ్చించే వ్యయం అభివృద్ధికి తార్కాణంగా నిలుస్తుంది. సామాజిక బాధ్యతను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధిగా నిర్వహించాలి. మొక్కుబడిగా కాకుండా ఎంత బాగా నెరవేరుస్తున్నారో చెప్పేందుకు సామాజిక రంగంపై వెచ్చించే వ్యయమే కొలమానం. సామాజిక రంగంపై వ్యయంలో దక్షిణాదిలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలవడం ప్రభుత్వ దృక్పథానికి నిదర్శనంగా నిలుస్తోంది. 2022 –23 ఆర్థిక ఏడాదికి సంబంధించి జనవరి వరకు రాష్ట్రాల వారీగా సామాజిక రంగంలో వ్యయాలపై కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) గణాంకాలను రూపొందించింది. వాస్తవ వ్యయాలను కాగ్ ప్రతి నెలా గణాంకాల రూపంలో పొందుపరుస్తుంది. విద్య, వైద్యం, పట్టణ, గ్రామీణాభివృద్ధి, పౌష్టికాహారం, నీటి సరఫరా, పారిశుద్ధ్యం నిర్వహణకు చేసే ఖర్చును సామాజిక రంగాలపై వ్యయంగా పరిగణిస్తారు. ఆ మేరకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జనవరి వరకు సామాజిక రంగంపై రూ.82,229.70 కోట్లను ఏపీ ప్రభుత్వం వ్యయం చేసింది. ► ప్రజారోగ్యం, విద్యకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తున్న విషయం తెలిసిందే. నాడు–నేడు ద్వారా ప్రభుత్వ ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలను గణనీయంగా మెరుగుపరచడంతోపాటు రికార్డు స్థాయిలో వైద్య పోస్టులను భర్తీ చేసి ప్రజలకు మెరుగైన చికిత్సను అందిస్తున్న విషయం తెలిసిందే. కొత్త మెడికల్ కాలేజీలతో పాటు ప్రస్తుతం ఉన్న కాలేజీలు, ఆస్పత్రుల రూపు రేఖలు మార్చేందుకు రూ.16,222.85 కోట్లను వెచ్చిస్తోంది. వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ద్వారా ఖరీదైన చికిత్సలు ఉచితంగా అందించడంతోపాటు కొత్త వాహనాలను సమకూర్చడం ద్వారా 108, 104 వ్యవస్థను బలోపేతం చేసింది. ► ప్రాథమిక విద్యతో పాటు సెకండరీ, ఉన్నత విద్యకు ప్రభుత్వం పెద్దపీట వేసింది. మన బడి నాడు–నేడు ద్వారా ప్రభుత్వ స్కూళ్ల రూపురేఖలను మార్చేసి ఇంగ్లిష్ మీడియంలో చక్కగా చదువుకునే వాతావరణాన్ని కల్పిస్తోంది. ప్రభుత్వ విద్యా సంస్థల్లో 11 రకాల వసతుల కల్పనకు రూ.16,450 కోట్లను వ్యయం చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే తొలిదశ కింద 15,715 స్కూళ్లలో మౌలిక వసతుల కల్పనను పూర్తి చేయడమే కాకుండా రెండో దశలో మరో 22,344 స్కూళ్లలో పనులను చేపట్టింది. మరోపక్క పిల్లలకు జగనన్న గోరుముద్ద కింద పౌష్టికాహారం అందిస్తున్న విషయం తెలిసిందే. మధ్యాహ్న భోజనానికి గత టీడీపీ హయాంలో బడ్జెట్లో రూ.600 కోట్లు కేటాయిస్తే ఇప్పుడు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం రూ.1908 కోట్లు వ్యయం చేస్తోంది. గర్భిణులు, పిల్లలకు అంగన్ వాడీల్లో పౌష్టికాహారం సరఫరాకు ప్రాధాన్యం ఇస్తూ వ్యయాన్ని భారీగా పెంచింది. వైఎస్సార్ సంపూర్ణ పోషణ, సంపూర్ణ పోషణ ప్లస్ అమలు చేస్తోంది. పట్టణాలు, గ్రామాల అభివృద్ధితో పాటు ప్రజలకు సురక్షిత మంచినీటి సరఫరాకు పెద్ద ఎత్తున వ్యయం చేస్తోంది. పారిశుధ్య నిర్వహణకు ప్రాధాన్యత ఇస్తోంది. ► వేతన సవరణను అమలు చేయడంతో పాటు అవసరమైన రంగాల్లో కొత్త పోస్టులను భర్తీ చేయడంతో ఉద్యోగుల జీతాల వ్యయం భారీగా పెరిగింది. గత ఆర్థిక ఏడాదిలో జనవరి వరకు ఉద్యోగుల వేతనాల రూపంలో రూ.34,593 కోట్లు చెల్లించగా ప్రస్తుత ఆర్థిక ఏడాది జనవరి వరకు రూ.41,270 కోట్లు వ్యయం చేసినట్లు కాగ్ గణాంకాలు వెల్లడించాయి. -
బడ్జెట్.. డిమాండ్‌ను పెంచాలి
న్యూఢిల్లీ: డిమాండ్‌ను పెంచడంపై రానున్న బడ్జెట్లో ప్రధానంగా దృష్టి సారించాలని దేశీయ పరిశ్రమల అభిప్రాయంగా ఉంది. అంతేకాదు మౌలిక సదుపాయాలు, సామాజిక రంగంపైనా వ్యయాలను ప్రోత్సహించాలని ఆశిస్తోంది. ఫిక్కీ, ధ్రువ అడ్వైజర్స్ సంయుక్తంగా ఒక సర్వే నిర్వహించి.. పారిశ్రామికవేత్తల అభిప్రాయాలతో కూడిన నివేదికను బుధవారం విడుదల చేసింది. దేశంలో తయారీ వ్యవస్థ బలోపేతంపై ప్రభుత్వం విధానపరమైన దృష్టి సారించాలని కోరింది. పరిశోధన, అభివృద్ధికి మద్దతుగా నిలవాలని.. భవిష్యత్తు టెక్నాలజీలకు ప్రోత్సాహకాలు అందించాలని కోరుతున్నట్టు సర్వే నివేదిక తెలిపింది. ప్రపంచంలోనే అతిపెద్ద టీకాల కార్యక్రమం దేశీయంగా కొనసాగుతున్న తరుణంలో ఆర్థిక వ్యవస్థకు పునరుజ్జీవాన్ని అందించే చర్యలను వేగవంతం చేయాలని కోరింది. వృద్ధి క్రమం సానుకూలంగా మారినందున.. ప్రభుత్వం నుంచి నిరంతర మద్దతు అవసరమని.. కొన్ని రంగాల్లో డిమాండ్ మెరుగుపడగా, ఇది స్థిరంగా కొనసాగుతుందా అన్నది చూడాల్సి ఉంటుందని అభిప్రాయపడింది. డిమాండ్‌ను పెంచేందుకు పన్నుల విధానాన్ని ఉపయోగించుకోవాలని సూచించింది. పన్నుల ఉపశమనం అవసరం.. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌కు బడ్జెట్‌ను సమర్పించనున్న విషయం తెలిసిందే. ఈ విడత బడ్జెట్లో వ్యక్తిగత పన్ను ఉపశమనానికి తప్పకుండా చోటు ఉండాలని సర్వేలో 40 శాతం మంది పారిశ్రామిక వేత్తలు అభిప్రాయపడ్డారు. ప్రత్యక్ష పన్నుల విధానంలో పన్ను శ్లాబులను మరింత విస్తృతం చేయాలని 47 శాతం మంది కోరారు. ఉపాధి అవకాశాల కల్పనకు ప్రభుత్వం పన్ను రాయితీలు, ఉపసంహరణలు కల్పించాలని 75 శాతం మంది కోరడం గమనార్హం. ముఖ్యంగా ఆవిష్కరణలు, ఎగుమతులకు పన్ను రాయితీలు ఇవ్వాలని ఎక్కువ మంది కోరినట్టు ఈ సర్వే నివేదిక తెలియజేసింది. -
బడ్జెట్ అంచనాలన్నీ అవాస్తవికం
రాష్ట్ర ప్రభుత్వానికి కాగ్ అక్షింతలు ♦ బలహీనంగా తెలంగాణ బడ్జెట్.. నిర్వహణలో లోపాలు ♦ భారీ మిగులు, అక్కర్లేని అనుబంధ కేటాయింపులు ♦ మిగతా రాష్ట్రాల కంటే విద్య, సామాజిక రంగానికి తక్కువగా బడ్జెట్ ♦ ‘పే అండ్ అకౌంట్స్’లో బిల్లులకు మించి రూ.81.07 కోట్ల చెల్లింపులు సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర బడ్జెట్ అంచనాలు అవాస్తవికంగా ఉన్నాయని... వ్యయ పర్యవేక్షణ, నియంత్రణ బలహీనంగా ఉన్నాయని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) రాష్ట్ర ప్రభుత్వానికి అక్షింతలు వేసింది. అవాస్తవికమైన బడ్జెట్ కారణంగా భారీ మిగులు, అవసరం లేని అనుబంధ కేటాయింపులు, అసలు కేటాయింపులు లేకుండా చేసిన ఖర్చులు వంటివి పెరిగిపోయాయని ఎత్తిచూపింది. ఈ అంశాలన్నీ బడ్జెట్ నిర్వహణ లోపాలను సూచిస్తున్నాయని ఎత్తిచూపింది. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని విశ్లేషించిన కాగ్... తొలి (2014-15) ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన నివేదికలను వెల్లడించింది. ఈ నివేదికలను రాష్ట్ర ప్రభుత్వం బుధవారం శాసనసభకు సమర్పించింది. బడ్జెట్ నిర్వహణ లోపభూయిష్టం అవాస్తవికమైన బడ్జెట్ పర్యవసానంగా భారీ మిగులు, అవసరం లేని అనుబంధ కేటాయింపులు, కేటాయింపులు లేకుండా చేసిన ఖర్చులు, అధిక రీ అప్రోప్రియేషన్లతో ఏర్పడిన అదనపు కేటాయింపులన్నీ బడ్జెట్ నిర్వహణ లోపాలు సూచిస్తున్నాయని తమ నివేదికలో కాగ్ వేలెత్తి చూపింది. తొలి కేటాయింపులతో పోలిస్తే వాస్తవంగా జరిగిన ఖర్చు తక్కువగా ఉందని... అలాంటప్పుడు అనుబంధ కేటాయింపులు అనవసరమని స్పష్టం చేసింది. రూ.1.01 లక్షల కోట్ల కేటాయింపుల్లో వాస్తవ ఖర్చు (రూ.64,097 కోట్లు) తక్కువగా ఉన్నందున రూ.5,359 కోట్ల అనుబంధ కేటాయింపు అనవసరమని పేర్కొంది. వివిధ పథకాలకు విధి విధానాలు ఖరారు కాకపోవడం, పాలనాపరమైన అనుమతి లేక పనులు ప్రారంభం కాకపోవడం, నిధులు విడుదల చేయకపోవడంతో ప్రభుత్వం తీసుకున్న పలు విధాన నిర్ణయాలు నెరవేరలేదని వెల్లడించింది. కొన్ని మాత్రం పాక్షికంగా అమలు జరిగాయని తెలిపింది. సభకు చెప్పని ఖర్చు రూ.304 కోట్లు శాసనపరమైన సాధికారత లేకుండానే 2014-15 సంవత్సరంలో రూ.304 కోట్ల మేరకు అదనపు వ్యయం చేసినట్లు కాగ్ తేల్చింది. నిర్దిష్టమైన ఖర్చుల వివరాలు లేకుండా రూ.2,555 కోట్లను గంపగుత్తగా కేటాయించి, సంవత్సరం చివర్లో తిరిగి అప్పగించిందని తప్పుబట్టింది. ‘‘పీడీ ఖాతాల నగదు పుస్తకాలు, ట్రెజరీ ఖాతా పుస్తకాలు, బ్యాంకు క్యాష్‌బుక్‌ల మధ్య భారీ వ్యత్యాసాలు ఉన్నాయి. పీడీ ఖాతాల్లో నిల్వలు పేరుకుపోయాయి. ఇవన్నీ పీడీ ఖాతాలపై పర్యవేక్షణ, నియంత్రణను మెరుగుపరుచుకోవాల్సిన ఆవశ్యకతను వేలెత్తి చూపిస్తున్నాయి..’’ అని కాగ్ స్పష్టం చేసింది. ఇతర రాష్ట్రాల కంటే తక్కువ తొలి ఏడాదిలో ప్రభుత్వం అభివృద్ధి వ్యయానికి తగిన ప్రాధాన్యత ఇచ్చినా కేటాయించిన నిధులను ఆశించిన ప్రయోజనాలకు పూర్తిగా విడుదలయ్యేలా చూడలేదని కాగ్ ఆక్షేపించింది. విద్యారంగానికి 11.57 శాతం కేటాయించడం మిగతా రాష్ట్రాల సగటు (16.23%) కంటే తక్కువేనని పేర్కొంది. మొత్తం ఖర్చులో సామాజిక రంగంపై 34.42 శాతం వ్యయం చేశారని.. ఇది మిగతా రాష్ట్రాలతో (36.50%) పోలిస్తే తక్కువని తెలిపింది. రాష్ట్రం తీర్చాల్సిన అప్పుల్లో యాభై శాతానికిపైగా వచ్చే ఏడేళ్లలోనే తీర్చాల్సి ఉందని గుర్తుచేసింది. బిల్లులకు మించి చెల్లింపులు ‘పే అండ్ అకౌంట్స్’ కార్యాలయాలపై తనిఖీలు కరువయ్యాయని, ఆర్థిక నియంత్రణలో లోపాలున్నాయని కాగ్ ప్రస్తావించింది. ‘‘బిల్లుల నుంచి వసూలు చేసిన రూ.14.29 కోట్ల భవన, ఇతర నిర్మాణ కూలీల సంక్షేమ శిస్తును సంక్షేమ బోర్డుకు చెల్లించలేదు. విడుదలైన నిధులకు మించి చెల్లింపులు జరగకుండా చూడాల్సిన పే అండ్ అకౌంట్స్ అధికారులు (పీఏవోలు) వివిధ శాఖాధిపతులు జారీ చేసిన లెటర్ ఆఫ్ క్రెడిట్స్ మించి రూ.81.07 కోట్ల బిల్లులు చెల్లించారు. ఖమ్మం, నిజామాబాద్, నిర్మల్, హన్మకొండ పీఏవోల పరిధిలో ఈ చెల్లింపులు జరిగాయి. రూ.50 లక్షలలోపు విలువైన 147 పనులకు ఈఎండీ (ముందస్తు ధరావతు) ఆమోదించడంలో నిబంధనలను ఉల్లంఘించారు. డీడీలకు బదులుగా రూ.99లక్షల విలువైన బ్యాంకు గ్యారంటీలను ఆమోదించారు. వీటిలో 97 కాలం చెల్లినవి ఉన్నాయి. నాణ్యత ధ్రువపత్రాలు లేకుండానే హన్మకొండ, నిజామాబాద్ పీఏవోలు రూ.36.44 కోట్ల విలువైన 18 బిల్లులు ఆమోదించారు. కార్మిక సదుపాయాలు కల్పించినట్లు ధ్రువీకరణ లేకుండానే నిర్మల్ పీఈవో రూ.91.25 లక్షల బిల్లులు చెల్లించారు’’ అని కాగ్ వేలెత్తి చూపింది. రెవెన్యూ మిగులు పెంచి చూపారు 2014-15 బడ్జెట్లో రెవెన్యూ మిగులును ఎక్కువగా చేసి చూపించారని కాగ్ ఆక్షేపించింది. ఆ బడ్జెట్లో ఏకంగా రూ.690.27 కోట్లు మిగులు చూపించారని పేర్కొంది. ప్రభుత్వ పద్దుల నియమాల ప్రకారం చిన్న తరహా పనులపై ఖర్చును రెవెన్యూ పద్దులో నమోదుచేయాలని, కానీ ఆ తరహా పనులకు చెందిన రూ.371.55 కోట్ల మొత్తాన్ని వివిధ క్యాపిటల్ పద్దుల కింద చూపారని తెలిపింది. అలాగే రూ.553కోట్ల విలువైన లావాదేవీలను తనిఖీ చేయగా... రెవెన్యూ రాబడులను అధికం చేసి చూపినట్లు వెల్లడైందని పేర్కొంది. రూ.1.50 కోట్ల సహాయక గ్రాంటును కూడా క్యాపిటల్ పద్దుల కింద నమోదు చేయడాన్ని తప్పుబట్టింది.