సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం సామాజిక రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు కం్రప్టోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా (కాగ్) అకౌంట్స్ నివేదిక–2022–23 స్పష్టం చేసింది. గత నాలుగేళ్ల నుంచి ఏటా సామాజిక రంగ వ్యయం పెరుగుతుండటమే ఇందుకు నిదర్శనమని వెల్లడించింది. గత నాలుగేళ్లలో సామాజిక రంగానికి రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా రూ.3.06 లక్షల కోట్లు వ్యయం చేసినట్లు పేర్కొంది.
విద్య, వైద్య ఆరోగ్య– కుటుంబ సంక్షేమం, తాగునీరు, పారిశుధ్యం, గృహనిర్మాణం, పట్టణాభివృద్ది, కార్మిక ఉపాధి, సంక్షేమం, సామాజిక భద్రతలను సామాజిక రంగంగా పరిగణిస్తారు. విద్య, వైద్య రంగాలకు, పౌష్టికాహారానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుండటంతో ఆ రంగాలపై ఎక్కువ ఖర్చు చేసినట్టు కాగ్ అకౌంట్స్ నివేదిక తెలిపింది.
మరోవైపు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలతో పాటు ఇతర వర్గాల్లోని పేదల సంక్షేమానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోంది. దీంతో సామాజిక రంగం వ్యయం ఏటా పెరుగుతున్నట్లు నివేదిక వెల్లడించింది. అలాగే కార్మికుల సంక్షేమంతో పాటు తాగునీటి సరఫరాకు గత నాలుగేళ్లుగా ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment