న్యూఢిల్లీ: పవర్ ప్లాంట్‌లకు బొగ్గు సరఫరా మెరుగుపడకపోతే రాబోయే రెండు రోజుల్లో దేశ రాజధాని అంధకారంలోకి వెళ్లిపోయే ప్రమాదం ఉందని ఢిల్లీ విద్యుత్ శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ పేర్కొన్నారు. విద్యుత్ ప్లాంట్లలో బొగ్గు కొరత కారణంగా సుదీర్ఘ విద్యుత్ కోతలపై ఆందోళన వ్యక్తం చేసిన తమిళనాడు, ఒడిశా వంటి రాష్ట్రాల జాబితాలోకి ప్రస్తుతం ఢిల్లీ కూడా చేరిపోయిందని అన్నారు.
(చదవండి: "అనుకోని అరుదైన వ్యాధి జీవితాన్నే మార్చేసింది")
అంతేకాదు భారత్‌లోని135 బొగ్గు ఆధారిత విద్యుత్ ప్లాంట్లలో సగానికి పైగా, దేశంలోని మొత్తం విద్యుత్తులో 70 శాతం ఇంధనం నిల్వలు మూడు రోజుల కన్నా తక్కువ ఇంధన నిల్వలను కలిగి ఉన్నాయని సెంట్రల్ గ్రిడ్ ఆపరేటర్ డేటా తెలిపిందన్నారు. ఈ సందర్భంగా ఢిల్లీ విద్యుత్ శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ మాట్లాడుతూ.... "బొగ్గు సరఫరా మెరుగుపడకపోతే, రెండు రోజుల్లో ఢిల్లీలో చీకట్లోకి వెళ్లిపోతుంది. ఢిల్లీకి విద్యుత్ సరఫరా చేసే బొగ్గు ఆధారిత విద్యుత్ ప్లాంట్లు కనీసం ఒక నెల బొగ్గు నిల్వను కలిగి ఉండాలి, కానీ ఇప్పుడు అది ఒక రోజుకి పడిపోయింది" అని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ మేరకు ఢిల్లీ ముఖ్యమంత్రి ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ తక్షణమే బొగ్గు సరఫరా, గ్యాస్ సరఫరాను అందించాలి లేదంటే రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం ఏర్పడే అవకాశం ఉందని కేంద్రానికి విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. కోవిడ్ -19 సెండ్ వేవ్‌లో వైద్య ఆక్సిజన్ సరఫరా సంక్షోభం మాదిరిగా ఈ బొగ్గు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాం అంటూ అభివర్ణించారు. కరోనా మహమ్మారీ కారణంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌తో వినియోగం లేకపోవడం, ధరలు ఒక్కసారిగా పెరగడం, డిమాండ్ , సప్లయ్‌ల మధ్య సమన్యయం లోపించడం తదితర కారణాల వల్ల ఈ సమస్య తలెత్తిందని ఢిల్లీ విద్యుత్ శాఖ మంత్రి జైన్ వెల్లడించారు.
(చదవండి: విద్యుత్ సంక్షోభం.. జనాలకు ఢిల్లీ ప్రభుత్వం వింత రిక్వెస్ట్)
Comments
Please login to add a commentAdd a comment