తొమ్మిది నెలల్లో మూడు యంత్రాలు దగ్ధం
పర్యవేక్షణ లోపమే ప్రధాన కారణం
ఓసీపీ-3లో ఆపరేటర్ల ఆందోళన
యైటింక్లయిన్‌కాలనీ(కరీంనగర్) : బొగ్గు కుప్పలను ఎత్తే భా రీ యంత్రాలు కాలిపోతున్నారుు. సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో కోట్లాది రూపాయల విలువచేసే యంత్రాలు అ గ్నికి ఆహుతవుతున్నారుు. సింగరేణి వ్యాప్తంగా 16 ఓపెన్‌కా స్ట్‌లు ఉన్నా.. ఎక్కడా లేని విధంగా ఆర్జీ-2 ఓసీపీ-3లో ఈ ఘటనలు చోటుచేసుకుంటున్నారుు. ఓసీపీ-3 సీహెచ్‌పీ వద్ద నిల్వ ఉన్న బొగ్గు ఎత్తే క్రమంలో షావల్స్ ఎక్కువగా ప్ర మాదానికి గురవుతున్నట్లు తెలుస్తోంది. మండుతున్న బొగ్గు కుప్పలపైకి ఎక్కి షావల్ యంత్రాలు పనిచేస్తుండగా హోస్‌పైపుల్లో ఆయిల్, డీజిల్ లీకేజీ వల్ల బొగ్గు వేడికి మంటలంటుకుంటున్నాయని కార్మికులు చెబుతున్నారు. తొమ్మిది నెల ల కాలంలో మూడు భారీ యంత్రాలు బుగ్గయ్యూరుు. గత ఏడాది సెప్టెంబర్‌లో సరస్వతి షావల్, డిసెంబర్‌లో ఎల్-7 లోడర్, ఈనెల 18 స్వర్ణముఖి అగ్నికి ఆహుతయ్యూరుు. తాజా ప్రమాదంపై అధికారులు విచారణ చేపట్టారు. ఇవి కాకుండా గతంలో బొగ్గు ఎత్తే ఒక లోడర్ యంత్రం ఇదే విధంగా అగ్ని ప్రమాదానికి గురైంది. సీహెచ్‌పీలో పనిచేసే సరస్వతి యంత్రం సైతం అగ్నిప్రమాదంలో కాలిపోయింది.
ప్రమాదకర పరిస్థితుల్లో విధులు
ఓసీపీ-3 సీహెచ్‌పీ వద్ద ఉన్న బొగ్గు నిల్వలను తరలించే క్రమంలో బొగ్గును షావల్ ద్వారా డంపర్లలో ఎత్తుతున్నారు. కొన్ని సందర్భాల్లో బొగ్గు మంటలను చల్లార్చేందుకు కుప్పలపైకి షావల్‌ను ఎక్కించి బొగ్గును దూరంగా జరుపుతున్నా రు. అయితే బొగ్గు వేడికి షావల్స్ వెనకభాగంలో ఉండే ఆయిల్ పైపులకు మంటలంటుకుంటున్నారుు. అవి పెద్ద ఎత్తున ఎగిసి పడి బయటి వాళ్లు చూసి చెప్పేంత వరకు క్యాబిన్‌లో ఉండే ఆపరేటర్ గమనించడం కష్టంగా మారుతోంది. మంటలను చల్లార్చేందుకు వాటర్ ట్యాంకర్లు సమీపంలో లేకపోవడంతో యంత్రాలు పూర్తిగా కాలిపోతున్నా యి. ఆపరేటర్లు అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడుతున్నారు. ఈనెల 18న అర్ధరాత్రి షావల్ దగ్ధం కాగా మంటలు ఆర్పేందుకు సమీపంలో వాటర్ ట్యాంకర్ అందుబాటులో లేదు. ఫైర్‌ఫైటింగ్ ఎగ్జిస్టింగ్ సిలిండర్లు కూడా పనిచేయలేదని కార్మికులు తెలిపారు.