తెలంగాణలో 5 వేల మెగావాట్ల విద్యుత్
న్యూఢిల్లీ : మూడు, నాలుగేళ్లలో తెలంగాణలో 5 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుందని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పియూష్ గోయల్ వెల్లడించారు. శుక్రవారం న్యూఢిల్లీలో పీయూష్ గోయల్తో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ భేటీ అయ్యారు. ఈ భేటీ అనంతరం పీయూష్ గోయోల్ మాట్లాడుతూ... 2020 నాటికి రామగుండ ఎన్టీపీసీ ద్వారా 4 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తామన్నారు.
అలాగే మణుగూరు ప్లాంట్ ద్వారా 1080 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తామని చెప్పారు. తెలంగాణలో మరిన్ని సోలార్ పార్కులు ఇచ్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని పీయూష్ గోయోల్ స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్లో విద్యుత్ ప్రాజెక్టులపై కేసీఆర్తో చర్చించినట్లు పీయూష్ గోయల్ వెల్లడించారు.