
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ రంగంలో కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలతో రానున్న రోజుల్లో తీవ్ర విద్యుత్ సంక్షోభం వచ్చే అవకాశముందని రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి స్పష్టం చేశారు. విద్యుత్ రంగంలో సంస్కరణల పేరుతో కేంద్ర ప్ర భుత్వం తీసుకొస్తున్న విద్యుత్ చట్ట సవరణతో భవి ష్యత్తులో రాష్ట్రంలో సైతం విద్యుత్ కోతలు తప్పకపోవచ్చని తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం విద్యుత్ కోతలు లేవన్నారు.
దేశవ్యాప్తంగా బొగ్గు సంక్షోభం నెలకొన్న నేపథ్యంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విద్యుత్ సంస్థలను ప్రైవేటు కంపెనీలకు ధారాదత్తం చేసేందుకే కృత్రిమ కొరత సృష్టించారని నిపుణులు అంటుంటే నిజమే అనిపిస్తోందని వ్యాఖ్యానించారు. దేశవ్యాప్తంగా బొగ్గు ఉత్పత్తిపై నీలినీడలు కమ్ముకుంటు న్నాయని, దీనికి కేంద్రప్రభుత్వ నిర్ణయాలే కారణమని మండిపడ్డారు. కేంద్రం నిర్ణయాలతోనే దేశంలో మళ్లీ విద్యుత్ కోతలు ప్రారంభమయ్యాయని విమర్శించారు. ఇప్పటికైనా కేంద్రం రాష్ట్రాల హక్కులను కాలరాయవద్దని డిమాండ్ చేశారు. రెండు వందల ఏళ్లకు సరిపడా బొగ్గు నిక్షేపాలు తెలంగాణలో ఉన్నాయని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment