సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో బొగ్గు సంక్షోభం ఆందోళన కలిగిస్తోన్న సంగతి తెలిసిందే. కరోనా సెకండ్ వేవ్ తదనంతరం పారిశ్రామిక రంగంలో విద్యుత్ డిమాండ్ ఒక్కసారిగా పెరగడంతో డిమాండ్‌కు తగ్గట్లుగా బొగ్గు సరఫరా లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ సమస్య గురించి ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. తాజాగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా ప్రధానికి లేఖ రాసినట్లు తెలిపారు.
(చదవండి: విద్యుత్ సంక్షోభంపై తక్షణం స్పందించండి)
ఈ సందర్భంగా సీఎం అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ.. ‘‘ఢిల్లీలో విద్యుత్ సంక్షోభం ఏర్పడే అవకాశం ఉంది. విద్యుత్ కేంద్రాలలో ఒక రోజుకు సరిపడా మాత్రమే బొగ్గు నిల్వ ఉంది. తక్షణమే బొగ్గు సరఫరా, గ్యాస్ సరఫరాను అందించాలి. లేదంటే రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం ఏర్పడే అవకాశం ఉంది. ఇప్పటికే బహిరంగ మార్కెట్లో యూనిట్ విద్యుత్ ధర 20 రూపాయలకు పెంచారు. దీన్ని నియంత్రించాలి. విద్యుత్తు కొరతను అధిగమించేందుకు అవకాశాన్ని వ్యక్తిగతంగా పరిశీలిస్తున్నాను. సంక్షోభాన్ని అధిగమించేందుకు సాధ్యమైనంత మేర పని చేస్తున్నాం. అంతేకాక ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని ప్రధానమంత్రికి లేఖ రాశాను’’ అని తెలిపారు.
(చదవండి: బొగ్గు సంక్షోభంలో భారత్ )
ఈ క్రమంలో టాటా పవర్ ఆర్మ్ టాటా పవర్ ఢిల్లీ డిస్ట్రిబ్యూషన్ లిమిటెడ్ విద్యుత్ కొరత గురించి వినియోగదారులకు ఎస్‌ఎమ్‌ఎస్ ద్వారా సమాచారం ఇచ్చింది. శనివారం పంపిన ఎస్‌ఎమ్‌ఎస్‌లో ‘‘ఉత్తర జనరేషన్ ప్లాంట్లలో బొగ్గు లభ్యత తక్కువగా ఉన్నందున, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటల మధ్య విద్యుత్ సరఫరా క్లిష్ట స్థాయిలో ఉంటుంది. విద్యుత్‌ని తెలివిగా వినియోగించుకోండి. బాధ్యతాయుతమైన పౌరుడిగా ఉండండి. అసౌకర్యానికి చింతిస్తున్నాము’’ అంటూ- టాటా పవర్ డీడీఎల్ మెసేజ్ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment