Union account Number
-
విశాఖలో ఇక గుర్రం స్వారీ
తాటిచెట్లపాలెం (విశాఖ ఉత్తర): విశాఖ నగర వాసులకు ఇక ఎంచక్కా గుర్రపు స్వారీ చేసే అవకాశం వచ్చింది. ఈస్ట్ కోస్ట్ రైల్వే స్పోర్ట్స్ అసోసియేషన్.. వాల్తేర్ ఆధ్వర్యంలో వాల్తేర్ రైల్వే ఫుట్ బాల్ స్టేడియం(పాత ఎగ్జిబిషన్ గ్రౌండ్స్)లో హార్స్ రైడింగ్ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. దేశ రైల్వే స్పోర్ట్స్ చరిత్రలోనే ఇలాంటి సదుపాయాన్ని మొదటిగా తామే అందుబాటులోకి తెచ్చినట్టు వాల్తేర్ డివిజన్ డీఆర్ఎం అనూప్‌కుమార్ సత్పతి తెలిపారు. వాల్తేర్ డివిజన్ ఇప్పటికే స్విమ్మింగ్, టేబుల్ టెన్నిస్ వంటి పలు ప్రత్యేక క్రీడాంశాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. వీటికి ఇప్పుడు హార్స్ రైడింగ్ కూడా తోడవడంతో రైల్వే ఉద్యోగులు, నగరవాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పిల్లలకు, పెద్దలకు గుర్రపు స్వారీ చేయాలనే ఆసక్తి ఉంటుంది. అలాంటి వారి కల నెరవేరింది. రైల్వే ఉద్యోగులు, అధికారులు, వారి పిల్లలు, కుటుంబ సభ్యులతో పాటు నగరవాసులు కూడా రుసుము చెల్లించి ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. మరిన్ని వివరాలకు 98124 89786, 98485 92625 నంబర్లలో సంప్రదించాలని నిర్వాహకులు సూచిస్తున్నారు. రోజూ ఉదయం 6 గంటల నుంచి 9 వరకు, సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు శిక్షణ ఇస్తున్నట్టు తేజ్ హార్స్ రైడింగ్ స్కూల్ నిర్వాహకుడు షరీఫ్ చెప్పారు. సాధారణంగా పదేళ్ల వయస్సు నుంచి ఎవరైనా గుర్రపు స్వారీలో శిక్షణ తీసుకోవచ్చని, ఆసక్తి, ఆరోగ్యవంతులైన పిల్లలైతే ఆరేళ్ల నుంచే శిక్షణ తీసుకోవచ్చన్నారు. ప్రస్తుతం ఇక్కడ 8 గుర్రాలను శిక్షణ కోసం సిద్ధం చేసినట్టు తెలిపారు. రోజూ అరగంట పాటు శిక్షణ ఉంటుందని కోచ్ అబ్బాస్ చెప్పారు. ఇదీ చదవండి: సహృదయులైన మీరు మమ్మల్ని ఆశీర్వదించాలి.. ఏపీని ఆదుకోవాలి: వైజాగ్ బహిరంగ సభలో సీఎం జగన్ -
Femina Miss India 2022: మిస్ ఇండియా కిరీటం.. 21 ఏళ్ల అందం సొంతం
Karnataka Sini Shetty Crowned Femina Miss India World 2022: మగువల అందాన్ని నిర్వచించలేం. కానీ వారి కురులను కారు మబ్బులుగా, మోమును చంద్రబింబంలా, కళ్లను కలువపూలుగా ఇలా వివిధ రకాలుగా పోల్చగలరు, అభివర్ణించగలరు కవులు. అయితే ఫ్యాషన్ రంగంలో మాత్రం అందాన్ని వివిధ రౌండ్స్ వారీగా అంచనా వేస్తారు. ఈ విభాగాలకు రకరకాల పేర్లు పెట్టి ఒకర్ని మిస్ ఇండియా, మిస్ వరల్డ్‌గా ఎంపిక చేస్తారు. అలాంటి ఈ ఫ్యాషన్ రంగంలో ప్రతిష్టాత్మకంగా భావించేది 'ఫెమినా మిస్ ఇండియా' పోటీలు. ఈ ఏడాది ఫెమినా మిస్ ఇండియా కిరీటాన్ని కర్ణాటకకు చెందిన సినీ శెట్టి కైవసం చేసుకుంది. అన్నీ పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన సినీ శెట్టి అందంలో విజేతగా నిలిచింది. గత కొన్ని రోజులుగా జరుగుతున్న ఫెమినా మిస్ ఇండియా 2022 పోటీలు ఆదివారం (జులై 3) అట్టహాసంగా ముగిసాయి. ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో మిస్ ఇండియా గ్రాండ్ ఫినాలే కనులవిందుగా జరిగింది. ఈ వేడుకల్లో బాలీవుడ్ బ్యూటీఫుల్ స్టార్స్ నేహా ధూపియా, మలైకా అరోరా, డినో మోరియా, డిజైనర్లు రోహిత్ గాంధీ, రాహుల్ ఖన్నా, కొరియోగ్రాఫర్ శియామక్ దావర్, మాజీ క్రికేటర్ మిథాలీ రాజ్ జ్యూరీ ప్యానెల్‌గా వ్యవహరించారు. ఈ మిస్ ఇండియా పోటీల్లో సినీ శెట్టి విజేత కాగా, రాజస్థాన్‌కు చెందిన రూబల్ శెఖావత్ మొదటి రన్నరప్‌గా, ఉత్తరప్రదేశ్ యువతి షినాటా చౌహాన్ రెండో రన్నరప్‌గా ఎంపికయ్యారు. విజేతగా ఎంపికైన తర్వాత 21 ఏళ్ల సినీ శెట్టి మాట్లాడుతూ.. 'ఈ జర్నీని నేనేప్పటికీ మర్చిపోలేను. ఇందులో భాగమై నాకు అడుగడుగునా సహకారం అందించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు' అని తెలిపింది. సినీ శెట్టి కిరీటాన్ని సోంతం చేసుకోవడం పట్ల ఆమె కుటుంబసభ్యులు, సన్నిహితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. శుభాకాంక్షలతో సోషల్ మీడియా వేదికగా వరుస పోస్టులు పెడుతున్నారు. When dreams turned into reality 👑 . . . . .#SiniShetty #MissIndiaFinale2022 #MissIndia2022 #FeminaMissIndia2022 #MissIndia pic.twitter.com/VmXwWjN7Uz — Sini Shetty (@sini_shetty) July 4, 2022 Danced for Thalapathy's Vaathi Coming during the DANCES OF INDIA segment in the Miss India Competition last night 🔥💥 . . .#SiniShetty #MissIndiaFinale2022 #ThalapathyVijay𓃵 #Varisu #MissIndia2022 #Thalapathy67 #FeminaMissIndia2022 #Thalapathy66 #LokeshKanagaraj #VaathiComing pic.twitter.com/ZYexh43Qtc — Sini Shetty (@sini_shetty) July 4, 2022 Thanks for all your lovely wishes 🥺🙏🏼 I hope I made Karnataka proud. Can't wait to start this new journey and make India proud 🇮🇳🤞🏼 Keep showering all your love and blessings and I love y'all ❤️#SiniShetty #MissIndiaFinale2022 #MissIndia2022 #FeminaMissIndia2022 #MissIndia pic.twitter.com/x3oRvXdBa0 — Sini Shetty (@sini_shetty) July 4, 2022 -
విద్యుత్ సంక్షోభం.. జనాలకు ఢిల్లీ ప్రభుత్వం వింత రిక్వెస్ట్
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో బొగ్గు సంక్షోభం ఆందోళన కలిగిస్తోన్న సంగతి తెలిసిందే. కరోనా సెకండ్ వేవ్ తదనంతరం పారిశ్రామిక రంగంలో విద్యుత్ డిమాండ్ ఒక్కసారిగా పెరగడంతో డిమాండ్‌కు తగ్గట్లుగా బొగ్గు సరఫరా లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ సమస్య గురించి ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. తాజాగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా ప్రధానికి లేఖ రాసినట్లు తెలిపారు. (చదవండి: విద్యుత్ సంక్షోభంపై తక్షణం స్పందించండి) ఈ సందర్భంగా సీఎం అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ.. ‘‘ఢిల్లీలో విద్యుత్ సంక్షోభం ఏర్పడే అవకాశం ఉంది. విద్యుత్ కేంద్రాలలో ఒక రోజుకు సరిపడా మాత్రమే బొగ్గు నిల్వ ఉంది. తక్షణమే బొగ్గు సరఫరా, గ్యాస్ సరఫరాను అందించాలి. లేదంటే రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం ఏర్పడే అవకాశం ఉంది. ఇప్పటికే బహిరంగ మార్కెట్లో యూనిట్ విద్యుత్ ధర 20 రూపాయలకు పెంచారు. దీన్ని నియంత్రించాలి. విద్యుత్తు కొరతను అధిగమించేందుకు అవకాశాన్ని వ్యక్తిగతంగా పరిశీలిస్తున్నాను. సంక్షోభాన్ని అధిగమించేందుకు సాధ్యమైనంత మేర పని చేస్తున్నాం. అంతేకాక ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని ప్రధానమంత్రికి లేఖ రాశాను’’ అని తెలిపారు. (చదవండి: బొగ్గు సంక్షోభంలో భారత్ ) ఈ క్రమంలో టాటా పవర్ ఆర్మ్ టాటా పవర్ ఢిల్లీ డిస్ట్రిబ్యూషన్ లిమిటెడ్ విద్యుత్ కొరత గురించి వినియోగదారులకు ఎస్ఎమ్ఎస్ ద్వారా సమాచారం ఇచ్చింది. శనివారం పంపిన ఎస్ఎమ్ఎస్లో ‘‘ఉత్తర జనరేషన్ ప్లాంట్లలో బొగ్గు లభ్యత తక్కువగా ఉన్నందున, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటల మధ్య విద్యుత్ సరఫరా క్లిష్ట స్థాయిలో ఉంటుంది. విద్యుత్‌ని తెలివిగా వినియోగించుకోండి. బాధ్యతాయుతమైన పౌరుడిగా ఉండండి. అసౌకర్యానికి చింతిస్తున్నాము’’ అంటూ- టాటా పవర్ డీడీఎల్ మెసేజ్ చేసింది. చదవండి: అడుగేస్తేనే కరెంట్ పుడుతుంది మరి! -
పదేళ్ల పనులు నాలుగేళ్లలో అవుతాయా?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనలో భాగంగా విభజన చట్టంలోనూ ఆనాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ప్రకటనలోనూ ఆంధ్రప్ర దేశ్ రాష్ట్రానికి కొన్ని వాగ్దా నాలు చేయడమైనది. విద్య మౌలిక సదుపాయాల సంస్థల ఏర్పాటు గురించి ఆంధ్రప్రదేశ్ పునర్ విభజన చట్టంలోని 93 సెక్షన్లో ప్రస్తావించారు. రెండు రాష్ట్రాల స్థిరమైన అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని షెడ్యూల్ 13లో పేర్కొన్న చర్యలను కేంద్ర ప్రభుత్వం పదేళ్ల కాలపరిమితిలో చేపట్టాలని పేర్కొన్నారు. తదనుగుణంగా 13వ షెడ్యూల్లో విద్యాపరమైన కొన్ని సంస్థలను మౌలిక సదుపాయాలకు సంబంధించి మరికొన్ని సంస్థలను ప్రస్తావించటం జరిగింది. విద్యాపరమైన సంస్థలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐఐఎం, ఐఐటీ, ఎన్.ఐ.టి, ఐసీఆర్, ఐఐఐటీ, గిరిజన విశ్వవిద్యాలయం, కేంద్రీయ విశ్వవిద్యాలయం, ఎయిమ్స్, ఎన్.ఐ.డి.ఎం, పెట్రోలియం విశ్వవిద్యాలయం, వ్యవసాయ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయడానికి 13వ షెడ్యూల్లో పొందుపరచడమైనది. దీనికి అనుగుణంగా వేగవంతంగా ఈ సంస్థలో చాలా వాటిని ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ సంస్థలన్నీ 2015–16 విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించాలని గట్టిగా ప్రయత్నం చేసినప్పటికీ, అధికారిక స్థాయిలో కేంద్ర ప్రభుత్వంలో మాత్రం పూర్తి మౌలిక సౌకర్యాలు ఏర్పడిన తర్వాతనే అంటే నాలుగు లేక అయిదేళ్ల తర్వాత ఏర్పాటు చేయడానికి మొగ్గుచూపారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం రాజకీయపరంగా గట్టి ప్రయత్నం జరిపి తాత్కాలిక భవనాల్లోనైనా పర్వాలేదు త్వరగా ప్రారంభించండి అని అభ్యర్థించి ఈ సంస్థలను అనతికాలంలో సాధించుకున్నది. ఇతర రాష్ట్రాలలో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసి ఈ సంస్థలను స్థాపించడానికి గణనీయమైన సమయమే పట్టింది. కానీ సంస్థలు ఏర్పడిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ప్రవర్తించిన తీరు గర్హనీయం. ఆరోజు తాత్కాలికమైన భవనాల్లో వెంటనే సంస్థలను ప్రారంభించమని ప్రాధేయపడి ఈరోజు అవి తాత్కాలిక భవనాల్లో నడుస్తున్నాయని అపవాదు వేయటం దురదృష్టకరం. అదే విధంగా ఈ సంస్థలన్నిటికీ 10 వేల కోట్ల రూపాయలు కావాల్సి ఉంటాయని ఇప్పుడున్న విధంగా బడ్జెట్ కేటాయింపులు జరిగితే పదిహేనేళ్లు పడుతుందని రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న వాదన సహేతుకం కాదు. పూర్తిగా వాస్తవాలను వక్రీకరించి చేస్తున్న ఆరోపణ. ఏ సంస్థ అయినా ప్రారంభించిన మొదటి సంవత్సరంలో ఎక్కువ నిధులను ఖర్చు పెట్టలేదు. క్రమేణా పనులు వేగం పుంజుకుని నిర్ణీత కాలంలో పూర్తయ్యే క్రమంలో అన్ని సదుపాయాలు ఏర్పడతాయి. జాతీయ విద్యా సంస్థలను కేంద్రం అనేక ఇతర రాష్ట్రాలలో కూడా ఏర్పాటు చేసింది. ప్రతి సంస్థకు ఒక డైరెక్టర్ ఉంటాడు. సదుపాయాల ఏర్పాటు పురోగతి తాను చూసుకుంటాడు. ఇటువంటి విధి విధానాలు ఉన్నప్పుడు తనకు సంబంధించని అంశాల్లో వాస్తవాన్ని వక్రీకరించి చూపెడుతూ ఈ సంస్థలు పూర్తవటానికి 15 ఏళ్లు పడుతుందని అసత్య ప్రచారం చేయటం రాష్ట్ర ప్రభుత్వానికి తగదు. ఇతర రాష్ట్రాల్లో పూర్తయిన విధంగానే నిర్ణీత కాలంలో ఈ సంస్థలన్నీ పూర్తిస్థాయి మౌలిక సదుపాయాలతో పని చేయడం జరుగుతుంది. ఇక రెండవ అంశం, 13వ షెడ్యూల్లోని మౌలిక సదుపాయాలకు సంబంధించిన సంస్థలు. వీటిలో ప్రధానంగా విమానాశ్రయాల ఆధునీకరణ, వైజాగ్ చెన్నై పారిశ్రామిక కారిడార్ పనులు సంతృప్తికరంగా జరుగుతున్నాయని నాకు అందిన సమాచారం. ఇక దుగరాజపట్నం నౌకాశ్రయం పర్యావరణ సమస్యల మూలంగా ముందుకు పోవటం లేదు. మిగిలిన అన్ని మౌలిక సదుపాయాల సంస్థల విషయంలో చట్టంలో సాధ్యాసాధ్యాల పరిశీలన గురించి ప్రస్తావించడం జరిగింది గానీ వీటిని ఇదమిత్థంగా నెలకొల్పాలని పేర్కొనలేదు. ఈ సంస్థలన్నీ వాణిజ్యపరమైన సంస్థలు. ఎక్కువ మొత్తంలో పెట్టుబడి కావాల్సిన వ్యవస్థలు. ఈ విషయం తెలిసి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం చట్టంలో వీటి సాధ్యాసాధ్యాల పరిశీలనను ప్రస్తావించి వదిలేసింది కానీ ఏర్పాటు చేయాలని స్పష్టంగా పేర్కొనలేదు. పైపెచ్చు వీటిని ఏర్పాటు చేయడానికి పది సంవత్సరాల సమయాన్ని కూడా పేర్కొనడం జరిగింది. ఈ అంశాలన్నీ వివిధ దశల పురోగతిలో ఉన్నాయి. చట్టంలో అంశాలు పై విధంగా ఉండగా, 10 సంవత్సరాలు ఏర్పాటు చేయడానికి అవకాశం ఉన్న చాలా సంస్థలను రికార్డు స్థాయిలో మొదటి సంవత్సరంలోనే కేంద్ర ప్రభుత్వం నెలకొల్పినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం పని కట్టుకుని ఈ వాస్తవాలన్నీ మరుగున పరుస్తూ ఏర్పాటు చేయడానికి ఇంకా సమయం ఉన్న కొన్ని అంశాలను మాత్రమే భూతద్దంలో చూపెట్టి కేంద్ర ప్రభుత్వాన్ని ఒక దోషి లాగా చూపెట్టాలనే ప్రయత్నాన్ని చేయడం దురదృష్టకరం. వ్యాసకర్త: ఐవైఆర్ కృష్ణారావు, ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి iyrk45@gmail.com -
న్యాయం గుడ్డిదేగానీ మరీ ఇంతగా......
-
న్యాయం గుడ్డిదేగానీ మరీ ఇంతా......
సాక్షి, బెంగళూరు: మంగళూరులోని ఓ పబ్‌లో ఓ యువకుల బృందం దౌర్జన్యంగా యువతుల జుట్టు పట్టుకొని కొట్టడం, వారు కింద పడిపోవడం, పారిపోయేందుకు ప్రయత్నించడం లాంటి దశ్యాలు 2009, జనవరి 24వ తేదీన దేశవ్యాప్తంగా టీవీ ఛానళ్లలో విస్తృతంగా ప్రసారం అయ్యాయి. దెబ్బలు తిన్న మహిళలు పబ్‌కు మద్యం సేవించేందుకు వచ్చిన వినియోగదారులని, దౌర్జన్యంగా దెబ్బలు కొట్టిన వారంతా కర్ణాటకలో హిందూ సంస్థగా పేరుపొందిన ‘శ్రీరామ్ సేన’ సభ్యులని పోలీసులతోపాటు సమాజమూ గుర్తించింది. మహిళలు పబ్‌లకు వెళ్లడమంటే సంస్కృతిపై దాడి చేయడమేనని, అందుకనే వారికి తగిన శాస్తి జరిగిందంటూ శ్రీరామ్ సేన చీఫ్ ప్రమోద్ ముతాలిక్ నాడు సంఘటనను సమర్థిస్తూ వ్యాఖ్యానించారు. ఈ దాడికి పాల్పడిందీ తామేనంటూ ఇటు శ్రీరామ్ సేన, అంటూ భజరంగ్ దళ్ సంస్థలు పోటా పోటీగా ప్రకటించుకున్నాయి. తమ కార్యకర్తలే ఈ దాడికి పాల్పడ్డారని, ఇందులో భజరంగ్ దళ్‌కు ఎలాంటి సంబంధం లేదంటూ శ్రీరామ్ సేన జిల్లా కన్వీనర్ కుమార్ మాలేమర్ బహిరంగ ప్రకటన చేశారు. ఈ సంఘటనను జాతీయ మహిళా కమిషన్‌కు కూడా తీవ్రంగా పరిగణించడంతో పోలీసులు కేసు నమోదు చేసి 30 మంది నిందితులను అరెస్ట్ చేశారు. అరెస్టయిన వారిలో ప్రమోద్ ముతాలిక్ కూడా ఉన్నారు. ఆయన 2014 పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా భారతీయ జనతా పార్టీలో చేరారు. క్రిమినల్ కేసు పెండింగ్‌లో ఉన్నప్పుడు ఆయన్ని పార్టీలోకి ఎలా తీసుకుంటారని బీజేపీ జాతీయ నాయకత్వం ప్రశ్నించడంతో బీజేపీ కర్ణాటక శాఖ వెంటనే ఆయన్ని పార్టీ నుంచి తొలగించింది. దాదాపు 9 ఏళ్ల అనంతరం ఈ సంఘటనపై మంగళూరులోని ఫస్ట్‌క్లాస్ కోర్టుకు చెందిన థర్డ్ జుడీషియల్ మేజిస్ట్రేట్ (12.03.18) సోమవారం నాడు తీర్పు చెప్పారు. నిందితులు నిర్దోషులంటూ 30 పేజీల తీర్పును చదివారు. ‘ఈ కేసులో నిందితుల నేరాన్ని రుజువు చేసేందుకు దర్యాప్తు అధికారులు మహిళా వినియోగదారులను కోర్టు ముందు ప్రవేశపెట్టలేక పోయారు. చార్జిషీటులో వారిని సాక్షులుగా చూపలేదు. ఈ కేసులో మహిళా వినియోగదారులే బాధితులు. వారే మంచి సాక్షులు కూడా అవుతారు. వారిని దర్యాప్తు అధికారులు విచారించి ఉంటే నిజం బయటకు వచ్చేది. ఈ కేసులో ఫొటోలు, వీడియోలు చాలా ముఖ్యమైన సాక్ష్యాధారాలు. వాటిని దర్యాప్తు అధికారులు సేకరించి కోర్టులో ప్రవేశపెట్టలేక పోయారు. ఇలాంటి సాక్ష్యాధారలు చూపక పోవడం ఈ కేసుకు ప్రాణాంతకంగా మారింది. ఈ కేసులో ఎఫ్ఐఆర్ దాఖలు చేయడంలో చాలా జాప్యం జరిగింది. జాప్యానికి కారణాలు కూడా వివరించలేదు. ఓ కేసులో సుప్రీం కోర్టు ఇచ్చిన ఓ జడ్జిమెంట్ ప్రకారం ఎఫ్ఐఆర్ దాఖలు చేయడంలో జరిగే జాప్యం కూడా కేసు మరణానికి కారణం అవుతుంది. నేరం రుజువు కానందున ఈ కేసులో నిందితులంతా నిర్ధోషులే’ అంటూ కోర్టు తీర్పు చెప్పింది. ‘మమ్మల్ని వ్యతిరేకించిన వారికి, మమ్మల్ని గూండాలని దూషించిన వారికి ఈ తీర్పు ఓ సమాధానం’ అని తీర్పు పట్ల ప్రమాద్ ముతాలిక్ వ్యాఖ్యానించగా, న్యాయం గుడ్డిదని తెలుసుకానీ, మరింత గుడ్డిదని తెలియదని కొందర సామాజిక కార్యకర్తలు వ్యాఖ్యానించారు. కోర్టు తీర్పు పాఠం చదివితే చాలు, ఎవరూ ఎలాంటి వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం లేకుండానే న్యాయం ఏమిటో పాఠకులకు బోధపడుతుంది. దర్యాప్తులో ఘోరంగా విఫలమైన దర్యాప్తు అధికారులను దోషిగా ఎందుకు ప్రకటించలేదో ఎందరికి అర్థం అవుతుంది? -
‘రాజమహేంద్రవరం అడ్డా’లో ‘భాగమతి’
-
'పీఎఫ్'కు యూఏఎన్ తప్పనిసరి!
కేంద్ర ప్రభుత్వం యోచన న్యూఢిల్లీ: ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) చందాదారులందరికీ సార్వత్రిక ఖాతా సంఖ్య(యూఏఎన్) తప్పనిసరి చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇటీవల జరిగిన సమావేశంలో సంస్థ ఉన్నతాధికారులకు కేంద్ర భవిష్యనిధి కమిషనర్ కేకే జలాన్ ఈ మేరకు తెలిపారు. చందాదారులకు సంస్థ సేవలు, పథకాలు సమర్థంగా అందజేసేందుకు యూఏఎన్ తప్పనిసరి చేయాలని కేంద్రం ఆలోచిస్తున్నట్లు వివరిం చారు. ఉద్యోగులు ఒక సంస్థ నుంచి మరో సంస్థకు మారినప్పుడు పీఎఫ్ ఖాతాలు మార్చుకోవాల్సిన అవసరం లేకుండా రిటైర్ అయ్యేంతవరకు ఒకే సంఖ్య(యూఏఎన్) కేటాయించే విధానాన్ని కిందటేడాది అక్టోబర్‌లో ప్రారంభించిన సంగతి తెలిసిందే.