బొగ్గు టు బుగ్గ | Can not imagine a world that is not current | Sakshi
Sakshi News home page

బొగ్గు టు బుగ్గ

Published Wed, Mar 11 2015 7:04 AM | Last Updated on Sat, Sep 22 2018 7:53 PM

Can not imagine a world that is not current

 కరెంట్ లేని ప్రపంచాన్ని ఊహించలేం.. ఒక్క నిమిషం
 పాటు కరెంట్ పోతే భరించలేం.. ప్రతీది కరెంటుతో ముడిపడి
 ఉంది.. వ్యవసాయం, పరిశ్రమలు, టెక్నాలజీ తదితరాలకు ముఖ్య
 మైనది..! అటువంటి కరెంట్ ఎలా ఉత్పత్తి అవుతుంది.. మనం
 సాధారణంగా బొగ్గు, నీరు, సౌర, గాలి నుంచి ఉత్పత్తి అవుతుందని
 విన్నాం.. మీరు విన్నది నిజమే.. ఇందులో బొగ్గు నుంచి కరెంటు
 ఎలా ఉత్పత్తి అవుతుందనేది తెలుసుకుందాం.. ఇందుకు
 గణపురంలోని కేటీపీపీ వద్దకు వెళ్లాల్సిందే.. బొగ్గు నుంచి కరెంటు
 ఉత్పత్తిపై ‘సాక్షి’ గ్రౌండ్ రిపోర్ట్ మీకోసం..

 
 బుగ్గ వెలగాలంటే స్విచ్చేయూలి.. చాలా సింపుల్!
 మరి విద్యుదుత్పాదన స్విచే ్చసినంత తేలికా..!!
 ఎక్కడో ప్లాంట్లలో ఉత్పత్తయ్యే కరెంటు మన లోగిళ్లలో ఎలా మెరుస్తుంది
 ఇందులో బొగ్గు పాత్ర ఎంత? దీనికి నీటి తోడ్పాటు ఏమిటి?
 అసలింతకూ థర్మల్ విద్యుత్ ఉత్పత్తి జరిగే ప్రక్రియ ఏమిటి?
 నల్లని బొగ్గు నుంచి వెలుగుల బుగ్గ వరకు జరిగే పరిణామం ఏమిటి?
 వీటికి సమాధానాలు జిల్లాలోని కేటీపీపీకి వెళ్తే తెలుస్తాయి..
 వీటినే ‘సాక్షి’ గ్రౌండ్ రిపోర్టు మీ ముందుంచుతోంది.. చదవండిక..
 
వరంగల్ జిల్లాలోని గణపురం మండలం చెల్పూరు శివారులోని కాకతీయ ధర్మల్ విద్యుత్ ప్లాంట్(కేటీపీపీ) సామర్థ్యం 500 మెగావాట్లు. థర్మల్ విద్యుత్ ఉత్పత్తికి బొగ్గు, నీరు ప్రధాన ముడి సరుకులు. కరీంనగర్ జిల్లా కాళేశ్వరం సమీపంలోని గోదావరి నది నుంచి 64 కిలోమీటర్ల పైపులైన్ ద్వారా నీరు తరలించి 25 ఎకరాల్లో నిర్మించిన రిజర్వాయర్‌లో నిల్వ చే స్తారు. భూపాలపల్లి, లాంగ్‌వాల్, గోదావరిఖని నుంచి బొగ్గు ప్లాంట్‌కు చేరుతుంది. కేటీపీపీలో ప్రతీరోజు 7,500మెట్రిక్ టన్నుల బొగ్గు అవసరం. ప్రతి 3.20 నిమిషాలకు లారీబొగ్గు(17టన్నులు) అవసరం. ప్రతి రోజు 480 లారీల బొగ్గు కోల్‌యార్డ్‌కు చేరుతుంది. ప్లాంట్ లో 15 రోజులకు సరిపడే బొగ్గు నిల్వ ఉంచాలి. బొగ్గు కరెంటుగా మారే పరిణా మం.. దీనికి నీరు ప్రేరకంగా పనిచేసే తీరు ఇలా..
 

కన్వేయర్ బెల్ట్‌తో ప్రారంభం..
యార్డు నుంచి బొగ్గును కన్వేయర్‌బెల్ట్ ద్వారా హపర్స్‌కు పంపిస్తారు. కన్వేయర్‌బెల్ట్ అన్నిస్టేజీలను కలిపి 600మీటర్లు ఉంటుంది. యూర్డు నుంచి ఇది బాయిలర్‌లోని మిల్లర్ వరకు ఉంటుంది. దీని ద్వారా కొంచెం తడిబొగ్గు సరఫరా అవుతుండటంతో బెల్ట్‌కు అంటుకోవద్దని నిత్యం శుద్ధి చేస్తారు.  
 

స్ట్రాకర్‌లో 20ఎంఎంగా..  
హపర్స్‌కు చేరిన బొగ్గును డస్ట్ ఎట్రాక్షన్ సిస్టంలోకి వెళ్తుంది. ఇందులో వైబ్రేషన్ జరుగుతుంది. బొగ్గులో ఉండేమట్టి ఇతర డస్ట్ బయటికి వెళ్లి శుద్ధి జరుగుతుంది. అనంతరం కన్వేయర్ బెల్ట్ ద్వారా స్ట్రాకర్‌లోని క్రషర్‌లోకి పంపిస్తారు. అక్కడ బొగ్గును 20ఎంఎం సైజులోకి క్రషర్ చేస్తారు. ఈ బొగ్గు తడిగా ఉంటుంది. కొంచెం హిట్ చేస్తారు.
 

ఫైనల్ సూపర్ హీటర్
ఫ్లాటిన్ సూపర్ హీటర్‌లో కొంత టెంపరేచర్ పెరిగిన ఆవిరిని ఫైనల్ సూపర్ హీటర్‌లోనికి పంపటంతో హై టెంపరేచర్‌కు చేరుతుంది. ఇక్కడ తయారైన ఆవిరి(స్టీమ్) హై ప్రెజర్‌తో మెరుున్ స్ట్రీమ్‌లైన్ ద్వారా టర్బైన్‌కు చేరుతుంది. గంటకు 324 మెట్రిక్ టన్నుల బొగ్గును మండిస్తారు. సుమారుగా 1600 సెంటిగ్రేడ్ టెంపరేచర్ వస్తుంది. 40 నుంచి 45శాతం బూడిద వస్తుంది.
 

బారుులర్‌లో ఏం జరుగుతుందంటే..
బారుులర్లలో మూడు రకాలు ఉంటాయి. కేటీపీపీలో టు పాస్ బారుులర్‌ను వినియోగిస్తున్నారు. ఇందులో ప్రత్యేక పద్ధతిలో అమర్చిన పైపుల ద్వారా నీరు సరఫరా అవుతుంది. అదే సమయంలో బారుులర్ కింద వైపు డ్రమ్ముల్లోని బొగ్గు పొడిని ఆయిల్‌తో మండిస్తారు. బొగ్గుమంట ద్వారా వచ్చే ఉష్ణం (టెంపరేచర్) మూలంగా పైపుల్లోని నీరు వేడి అవుతుంది. ఆ దశలో వేడి నీరు ఆవిరిగా మారి డ్రమ్ములోకి చేరుతుంది. డ్రమ్ములో సగం కంటే తక్కువ నీరు, సగం కంటే ఎక్కువ ఆవిరి ఉంటుంది. డ్రమ్ములోని ఆవిరిని నిర్ణీత టెంపరేచర్‌కు చేరేందుకు ఫ్లాటిన్ సూపర్ హిటర్ లోనికి పంపిస్తారు.

 

మిల్లర్‌లో బొగ్గు పొడిగా..
కన్వేయర్ బెల్ట్ ద్వారా బారుులర్ సమీపంలోని మిల్లర్‌లోకి 20ఎంఎం బొగ్గు వెళ్తుంది. మిల్లర్‌లోకి వెళ్లిన బొగ్గు పూర్తిగా పొడిగా మారుస్తారు. బొగ్గుపెళ్లలు లేకుండా ప్రైమరీ, సెంకడరీ ఫ్యాన్స్ ద్వారా బారుులర్‌లోకి బొగ్గుపొడిని పంపిస్తారు. ఇదే సమయంలో రిజర్వాయర్‌పై ఉన్న రా వాటర్ పంపుహౌస్ నుంచి పైపులైన్ ద్వారా నీటిని డీ మినర్‌లైజ్ ప్లాంట్‌కు పంపిస్తారు. అక్కడ నీటిలోని మినరల్‌ను తొలగించి శుద్ధి చేస్తారు. డీ మినర్‌లైజ్ నీటిని ప్లాంట్ స్టోరేజీలో నిల్వ చేస్తారు. అవసరం మేరకు నీటిని బారుులర్ ఫీడ్‌పంపు ద్వారా ఎకనమైజర్ నుంచి బారుులర్ డ్రమ్‌లోని పైపులకు పంపిస్తారు.
 
యాష్ యార్డ్
బారుులర్‌లో బొగ్గును మండించగా ఏర్పడే బూడిద పైపులైన్ ద్వారా యాష్‌యార్డ్‌లోని సైలో నిర్మాణానికి చేరుతుంది. ఈ బూడిదను సిమెంట్, ఇటుక ఫ్యాక్టరీలకు తరలిస్తున్నారు. మిగిలిన బూడిదను యాష్‌యార్డ్‌కు పంపిస్తారు. సింగరేణిలో బొగ్గు తీసిన బావుల్లో ఇసుకకు బదులు యాష్‌ను వినియోగిస్తున్నారు.
 
 

ట్రాన్స్‌ఫార్మర్స్
జనరేటర్‌లో తయారైన విద్యుత్‌ను ట్రాన్స్‌ఫార్మర్లకు పంపిస్తారు. 500 మెగావాట్ల ప్లాంట్‌కు మూడు ట్రాన్స్‌ఫార్మర్లు ఉన్నారుు. అక్కడి నుంచి హైఓల్టెజీ పవర్ లైన్‌కు అనుసంధానించి గ్రిడ్‌కు పంపిస్తారు.  కేటీపీపీలో ప్రతి రోజు 12 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది.
 

కోల్‌యాష్
బారుులర్‌లో బొగ్గును ఆయిల్‌తో మండించే సమయంలో వెలువడే తేలికపాటి వాయువులు బారుులర్‌కు ఉన్న ప్రత్యేక ఏర్పాటును చిమ్నితో అనుసంధానిస్తారు. చిమ్మి 275 మీటర్లు ఉంటుంది. చిమ్మి ద్వారా బయటకు వచ్చిన వాయువులు తేలిగ్గా ఉండి పైకి మాత్రమే పోతారుు రోజూ బొగ్గును మండించడానికి ఆయిల్‌ను ప్లాంట్‌లో నిల్వ చేస్తారు. బొగ్గు నిల్వలు లేనప్పుడు కూడా ఆయిల్‌ను మండించి విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం కలుగకుండా చూస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement