కేంద్ర ప్రభుత్వం మూడు కంపెనీలకు బొగ్గు గనులకు కేటాయిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. బొగ్గు మంత్రిత్వ శాఖ ఒడిశాలోని వివిధ ప్రాంతాల్లో ఎన్‌ఎల్‌సీ ఇండియా లిమిటెడ్, గుజరాత్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్, టాన్‌జెడ్కోలకు గనులు కేటాయిస్తున్నట్లు ప్రకటించింది. దీనివల్ల 40,560 మందికి ఉపాధి లభిస్తుందని తెలిపింది.
ఎన్‌ఎల్‌సీ ఇండియా లిమిటెడ్‌కు ఒడిశాలోని ముచ్చకట, గుజరాత్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్, టాన్‌జెడ్కో కంపెనీలకు వరుగా ఒడిశాలోని అంగుల్ జిల్లా పరిధిలోని కుదనాలి లూబ్రి, సఖిగోపాల్-బి కకుర్హి బొగ్గు గనులను కేంద్రం కేటాయించింది. ఈ మూడు బొగ్గు గనుల సంచిత పీక్ రేటెడ్ కెపాసిటీ (పీఆర్‌సీ) 30 ఎంటీపీఏ(మిలియన్ టన్స్ పర్ యానమ్)గా నిర్ణయించారు. అయితే ఈ గనుల మొత్తం కెపాసిటీ 2,194.10 మిలియన్ టన్నులుగా అంచనా వేశారు. వీటి ద్వారా వార్షిక ఆదాయం రూ.2,991.20 కోట్లు ఉంటుందని ప్రభుత్వం తెలిపింది. కంపెనీలకు కేటాయించిన పీఆర్‌సీ ఆధారంగా రూ.4,500 కోట్ల పెట్టుబడి సమకూరే అవకాశం ఉంటుందని పేర్కొంది. అందువల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా 40,560 మందికి ఉపాధి లభిస్తుందని వివరించింది.
ఇదీ చదవండి: ఆరోగ్య బీమా తిరస్కరించకూడదంటే..
ఇటీవల జారీ అయిన బొగ్గు గనుల కేటాయింపు ఉత్తర్వులతో కలిపి మొత్తం 95 గనుల నుంచి బొగ్గు వెలికి తీస్తున్నారు. వాటి మొత్తం పీఆర్‌సీ సామర్థ్యం 202.50 ఎంటీపీఏగా ఉంది. దీనివల్ల రూ.29,516.84 కోట్ల వార్షిక ఆదాయం సమకూరుతుంది. ఈ గనుల ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 2,73,773 మందికి ఉపాధి లభిస్తుందని ప్రభుత్వం తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment