'దేశంలో కరెంట్ కొరతను నివారించాం' | surplus current in country, says piyush goyal | Sakshi
Sakshi News home page

'దేశంలో కరెంట్ కొరతను నివారించాం'

Published Wed, Jul 13 2016 4:30 PM | Last Updated on Mon, Sep 4 2017 4:47 AM

surplus current in country, says piyush goyal

న్యూఢిల్లీ: దేశంలో కరెంట్ కొరతను నివారించామని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. బుధవారం న్యూఢిల్లీలో పీయూష్ గోయల్ మాట్లాడుతూ... థర్మల్ పవర్ ప్లాంట్కు 51 రోజులకు సరిపడే బొగ్గు నిల్వలు అందుబాటులో ఉంచామని ఆయన తెలిపారు.

అలాగే విద్యుత్ ట్రాన్స్మిషన్ సామర్థ్యాన్ని 70 శాతానికి పెంచగలిగామన్నారు. తెలంగాణలో 2,400 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ల ప్రారంభంపై పునరాలోచించాలన్నారు. ప్రస్తుతం యూనిట్ కరెంట్ ధర రూ. 2.20 పైసలకు అందుబాటులో ఉందని పీయూష్ గోయల్ చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement