
సింగరేణి.. వెలుగుల బొగ్గు
- మన రాష్ర్టంతో పాటు ఇతర రాష్ట్రాలకూ సరఫరా
- విద్యుత్ ప్లాంట్లు, పరిశ్రమల అవసరాలకు రవాణా
- ఈ ఏడాది నుంచి ఉత్పత్తి లక్ష్యాన్ని పెంచిన యాజమాన్యం
రుద్రంపూర్ : సింగరేణి కార్మికులు ఉత్పత్తి చేస్తున్న బొగ్గు తెలంగాణలోని పరిశ్రమలకే గాక వివిధ రాష్ట్రాల్లో ఉన్న పరిశ్రమలకు సరఫరా అవుతోంది. 2014-15 సంవత్సరంలో 526 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసి వివిధ పరిశ్రమలకు రవాణా చేసింది. ఇందులో 392.6 లక్షల టన్నులు విద్యుత్ కర్మాగారాలకు సరఫరా చేశారు. వీటి లో తెలంగాణలోని విద్యుత్ సంస్థలతో పాటు మహారా ష్ర్ట, కర్ణాటక, తమిళనాడు, హర్యానా, కేరళ రాష్ట్రాల విద్యుత్ సంస్థలు ఉన్నారుు. ఈ బొగ్గుతో సుమారు 9000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అరుు్యంది. ఇక రా ష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల సిమెంట్ కంపెనీలకు దా దాపు 46.40 లక్షల టన్నుల బొగ్గు రవాణా చేశారు.
ఒప్పందాల కన్నా ఎక్కువ సరఫరా
తెలంగాణ రాష్ట్రంలోని జెన్‌కోకు ఎఫ్‌ఎస్‌ఏ(ఫ్యూయల్ సప్లై అగ్రిమెంట్)ప్రకారం 83.60 లక్షల టన్నుల బొగ్గు రవాణా చేయాల్సి ఉండగా 127.89 లక్షల టన్నులు స రఫరా చేశారు. ఇందులో కేటీపీఎస్(పాల్వంచ)కు 59 లక్షల టన్నులకు గాను 93.55 లక్షల టన్నులు, కేటీపీపీ(భూపాలపెల్లి) 21.60 లక్షల టన్నులకు 33.09 లక్షల టన్నులు సరఫరా చేసినట్లు గణాంకాలు తెలుపుతున్నా యి. దీంతో ఎండాకాలంలో కూడా బొగ్గు కొరత తీరి.. విద్యుత్ కర్మాగారాలు సామర్థ్యం మేరకు విద్యుత్ ఉత్ప త్తి చేసి ప్రజలకు అందించినట్లు తెలుస్తోంది.
ఇతర రాష్ట్రాల విద్యుత్ సంస్థలకు..
మహాజెన్‌కో(పర్లి-మహారాష్ట్ర)కు 19.98 లక్షల టన్ను లు, కేపీసీఎల్(రాయచూర్- కర్ణాటక)కు 28.45 లక్షల టన్నులు, ఆంధ్రప్రదేశ్‌లోని జెన్‌కోకు(మద్దనూరు- ఆంధ్రప్రదేశ్)కు 39.38 లక్షల టన్నుల బొగ్గు సరఫరా చేశారు. ఇంకా ఎస్‌ఎస్‌పీసీఎల్(భిలాయ్-చత్తీస్‌గఢ్), కేపీసీఎల్(బల్లారి-కర్ణాటక), మహాజెన్‌కో(చంద్రాపూర్-మహారాష్ట్ర), ఐజీపీపీపీ(ఆరావళి-హర్యానా), డాక్ట ర్ ఎన్‌టీపీపీ(విజయవాడ-ఆంధ్రప్రదేశ్)కి కలిపి సు మారు 51,30 లక్షల టన్నుల బొగ్గును సింగరేణి సంస్థ రవాణా చేసింది.
36 కేటగిరీల పరిశ్రమలకు..
విద్యుత్ పరిశ్రమలతోపాటు మరో 36 కేటగిరీల పరిశ్రమలకు కలిపి సుమారు 750 లక్షల టన్నుల బొగ్గును సింగరేణి సంస్థ సరఫరా చేసింది.వీటిలో ప్రధానంగా పేపర్‌మిల్స్, పల్ప్ పరిశ్రమ, సిరామిక్ పైపులు, మం దుల పరిశ్రమ, ఎరువుల పరిశ్రమ, ఇటుక, సున్నం, పొగాకు, ఆయిల్, వస్త్రపరిశ్రమలతోపాటు మరికొన్ని పరిశ్రమలకు బొగ్గును రవాణా చేయడం ద్వారా వాటి ఉత్పత్తిని కొనసాగించేందుకు దోహదపడింది.
రాబోయే కాలంలో సింగరేణిపై మరింత భారం
తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో సింగరేణి కార్మికు లు కీలకపాత్ర పోషించారు. బంగారు తెలంగాణ నిర్మాణంలో కూడా ప్రధాన పాత్ర సింగరేణి కార్మికులపై ఉం ది. తెలంగాణలో రానున్న పదేళ్ల కాలంలో 24 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కోసం అనేక విద్యుత్ థర్మ ల్ కేంద్రాలను ప్రారంభించనుంది. ఇందుకోసం ప్రస్తు తం సింగరేణి సంస్థ అందిస్తున్న బొగ్గు కంటే అదనంగా ఏడాదికి మరో 40 మిలియన్ టన్నుల బొగ్గు అవసరముంటుంది. ప్రస్తుతం సాధించిన 52 మిలియన్ టన్ను ల నుంచి 90-100 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తిని పెంచాల్సి వస్తుంది. ఇందులో భాగంగా ఈ ఏడాది వా ర్షిక లక్ష్యాన్ని 60 మిలియన్ టన్నులకు యాజమాన్యం పెంచింది. దీని సాధించటానికి యాజమాన్యం నెల రో జులుగా ప్రణాళికలను తయారుచేసి అందుకు కావాల్సి న పనులను వేగవంతం చేస్తోంది. అలాగే, లక్ష్యసాధ నకు కార్మికులు జూన్ నుంచి కసరత్తు చేస్తున్నారు.
రికార్డు స్థారుులో బొగ్గురవాణా
ఈ ఏడాది మే, జూన్ నెలల్లో సింగరేణి సంస్థ అన్ని ఏరి యూల్లో కలిపి కలిపి 126.34 లక్షల టన్నుల బొగ్గును రవాణా చేసింది. గత ఏడాది ఈ నెలల్లో 60%శాతం రావాణాను కూడా చేయని పరిస్థితి. సింగరేణి చైర్మన్ చొరవతో ఏరియాల అధికారులు ముందుకు వచ్చి రవాణాను రికార్డు స్థాయికి చేర్చారు.