మన్మోహన్ ను ప్రశ్నించనున్న సీబీఐ?
ఢిల్లీ: కోల్‌స్కాం కేసులో మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ను విచారించడానికి సీబీఐ సన్నద్ధమయినట్లు తెలుస్తోంది. యూపీఏ ప్రభుత్వంలో బొగ్గుశాఖ బాధ్యతలను అదనంగా నిర్వర్తించిన ఆనాటి ప్రధాని మన్మోహన్ కూడా విచారించాలని సీబీఐ యోచిస్తోంది. హిందూల్కోకు బొగ్గు గనుల కేటాయింపుపై సీబీఐ సమర్పించిన తుది నివేదికను ప్రత్యేక కోర్టు తోసిపుచ్చింది.
హిందూల్కోకు బొగ్గు గనుల కేటాయింపులో మన్మోహన్ వాంగ్మూలం నమోదు చేయాలని సీబీఐకి ప్రత్యేక కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో మన్మోహన్ ను సీబీఐ విచారించే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి.