బీజింగ్: ‘బొగ్గు అంటే చైనా, చైనా అంటే బొగ్గు’ అంతర్జాతీయ ఇంధన సంస్థ 2012లో చైనా గురించి చేసిన వ్యాఖ్యలివి. అప్పుడు మొత్తం ప్రపంచంలో సగం బొగ్గును చైనానే ఉత్పత్తి చేసేది. విద్యుత్ ఉత్పత్తి కోసం దాన్ని ఉపయోగించేది. ప్రపంచంలో రెండవ బలమైన ఆర్థిక దేశంగా ఘనతికెక్కిన చైనాలో అప్పుడు 2,600 థర్మల్ విద్యుత్ కేంద్రాలు ఉండేవి. 2014 సంవత్సరం నుంచి చైనా వైఖరి ఊహించని విధంగా మారింది. థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తిని తగ్గిస్తూ జల విద్యుత్, సౌర విద్యుత్, పవన విద్యుత్ కేంద్రాలను పెంచుతూ వచ్చింది.
థర్మల్ విద్యుత్ రంగంలో ఉత్పత్తిని తగ్గిస్తూ కాలుష్యరహిత ప్రత్యామ్నాయ విద్యుత్ ఉత్పత్తి రంగంలో పురోభివృద్ధి సాధిస్తున్న దేశాల్లో బ్రిటన్, అమెరికా తర్వాత చైనానే నిలబడింది. 2013లో చైనా 420 టన్నుల బొగ్గును విద్యుత్ ఉత్పత్తి కోసం వినియోగించగా, 2014లో దానిలో 2.9 శాతాన్ని, 2015లో 3.6 శాతాన్ని చైనా తగ్గించిందని ‘నేచర్ జియోసైన్స్ జర్నల్’ వెల్లడించింది. అదే సమయంలో చైనా సౌర విద్యుత్ రంగంలో 28 శాతం, పవన, జల విద్యుత్ రంగాల్లో 13 శాతం ఉత్పత్తిని పెంచిందని చైనాకు చెందిన ‘రినీవబుల్ ఎనర్జీ ఇండస్ట్రీస్ అసోసియేషన్’ తెలియజేసింది.
భూతాపోన్నతిపై అంతర్జాతీయంగా కుదురిని అవగాహన మేరకు 2014 నుంచి బ్రిటన్, అమెరికా, చైనాలతోపాటు జపాన్, కెనడా, జర్మనీ, ఇండోనేషియా, మెక్సికో లాంటి దేశాలు కూడా విద్యుత్ కోసం బొగ్గు వినియోగాన్ని గణనీయంగా తగ్గించాయి. కనుక ఆ సంవత్సరాన్ని ›ప్రపంచ ఆర్థిక, పర్యావరణ చరిత్రలో ఓ మైలురాయిగా పరిగణిచ్చవచ్చని వ్యాసకర్తలు అభివర్ణించారు.
పర్యావరణంలో అదో మైలురాయి
Published Wed, Sep 28 2016 7:50 PM | Last Updated on Mon, Sep 4 2017 3:24 PM
Advertisement