ప్రతీకాత్మక చిత్రం
ఖమ్మం జిల్లా: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రెండో రోజు ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఖమ్మం, తిరుమలాయపాలెం, కూసుమంచి, చింతకాని, కారేపల్లి, కామేపల్లి, బూర్గంపాడు మండలాల్లో జోరుగా వర్షం కురుస్తోంది. మణుగూరు ఓపెస్ కాస్ట్ 4 ఓబీ నుంచి వర్షపునీరు పట్టణంలోని గాంధీనగర్ కాలనీకి వచ్చి చేరుతోంది. దీంతో స్థానికులు తీవ్ర ఆందోళనకు గురువుతున్నారు. భారీ వర్షాల కారణంగా ఇల్లందు మండలంలోని మాణిక్యారం, మాసి వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి.
పలుచోట్ల వాహన రాకపోకలు నిలిచిపోయాయి. వర్షం కారణంగా రెండో రోజు సింగరేణి గనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. కొత్తగూడెంలో 3 వేల టన్నులు, సత్తుపల్లిలో 6వేల టన్నులు, మణుగూరులో 4 వేల టన్నులు, ఇల్లందులో 3 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. నిన్నటి వర్షం కారణంగా 45 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి నష్టం వాటిల్లినట్లు సంబంధిత శాఖాధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment