ఎర్రగుంట్ల: రాయలసీమ ప్రాంతానికి వెలుగులు నింపేరాయలసీమ ధర్మల్ పవర్ ప్రాజెక్టు(ఆర్టీపీపీ) ఏపీ జెన్‌కో ఉన్నతాధికారులు వివక్ష చూపుతున్నారు. విద్యుత్ ఉత్పత్తికి అవసరైమన బొగ్గును సరఫరా చేయడంలో సవతి ప్రేమను చూపుతున్నారు. ప్రస్తుతం ఆర్టీపీపీకి సింగరేణి నుంచి వస్తున్న బొగ్గులో నాణ్యత లోపించింది. బొగ్గులో ఎక్కువగా రాళ్లు వస్తున్నాయి. వీటిని పగల కొట్టి బంకర్లలోకి పంపించడానికి అధికారులు నానా తంటాలు పడుతున్నారు. వస్తున్న రాళ్లను కార్మికులు సమ్మెటలతో పగలగొట్టి అందులోంచి బండరాళ్లను బయటకు తీస్తున్నారు. ఆర్టీపీపీలో 1,2,3,4,5 యూనిట్లలో 1050 మెగావాట్లు విద్యుత్ ఉత్పత్తి జరుగుతున్న విషయం విధితమే. బొగ్గు కొరత కారణంగా ఉత్పత్తికి ఆటంకం కలిగే పరిస్థితులు ఏర్పడడంతో కింద పడిన బొగ్గును సైతం వాడుతున్నారు.
బొగ్గు మాత్రం యూనిట్లుకు సరిపడ సరఫరా కావడంలేదు. ఆర్టీపీపీకి సింగరేణి, మణగూరు, రామగుండం మంచిర్యాల ప్రాంతాల నుంచి బొగ్గు సరఫరా అవుతోంది. సింగరేణి నుంచి ఇక్కడి స్టేజ్-1,2 ప్లాంట్లకు 38.80 లక్షల టన్నుల బొగ్గును సింగరేణి నుంచి సరఫరా చేయించే విధంగా 2012 ఏప్రిల్ 1న చేసుకున్న ఒప్పందం మేరకు 2032 సంవత్సరం వరకు సింగరేణి బొగ్గు ఆర్టీపీపీకి రావాల్సింది. కొన్ని నెలలుగా సగటున రోజుకు ఒక్క వ్యాగన్ కూడా రావడంలేదు. సింగరేణి నుంచి కృష్ణపట్నం సమీపంలోని ధర్మల్ స్టేషన్‌కు ఇబ్బందుల్లేకుండా బొగ్గు సరఫరా చేస్తున్నారు.. ఏపి జెన్‌కో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు బొగ్గు ఆ ప్లాంట్‌కు తరలివెళుతోందని విశ్వసనీయ సమాచరం.
ఒరిస్సా నుంచి వస్తున్న బొగ్గు పరిస్థితి దారుణం
ఆర్టీపీపీకి ఒరిస్సాలోని మహానది నుంచి వస్తున్న వాష్‌డ్ బొగ్గు పరిస్థితి మరీ దారుణంగా ఉంది. నెలకు రెండు లక్షల టన్నుల బొగ్గు రావాల్సింది. నెలకు సుమారు 26 వ్యాగన్ల వరకు రావాల్సింది. ప్రస్తుతం నెలకు పది వ్యాగన్లు కూడా రాలేదు. నవంబరు నెలలో కేవలం 8 వ్యాగన్లు వచ్చాయని అధికారులు తెలిపారు. అంటే వాష్‌డ్ బొగ్గు ఆర్టీపీపీ ఒప్పందం ప్రకారం సక్రమంగా సరఫరా జరిగితే సమస్య తగ్గే అవకాశం ఉంది.
ఆర్టీపీపీలోని ఐదు యూనిట్లు పని చేయాలంటే రోజుకు సుమారు 16వేల టన్నుల బొగ్గ్గు అవసరం. అయితే గురువారం నాటికి ఆర్టీపీపీలో స్వదే శీ బొగ్గు నిల్వలు కేవలం 62 టన్నులు మాత్రమే. విదేశీ బొగ్గు నిల్వలు నిల్. ఈ మధ్య కాలంలో సింగరేణి నుంచి వస్తున్న బొగ్గులో కూడా నాణ్యత ప్రమాణాలు క్షీణించాయి. ఎక్కువగా రాళ్లు వస్తున్నాయి. ఒప్పందం ప్రకారం గ్రేడ్-15 గల బొగ్గు రావాల్సింది. రాయలసీమ ప్రాంతంలోని విద్యుత్ ఉత్పత్తి కర్మగారంపై ఏపి జెన్‌కో ఉన్నతాధికారులు చిన్నచూపు చూడడంలో అంతరార్థం ఏవరికీ బోధపడడంలేదు.
నాణ్యత లేని బొగ్గుతో నష్టం
సింగారేణి కాలని నుంచి వస్తున్న నాణ్యత లేని బొగ్గుతో ఆర్టీపీపీ ఉత్పత్తి నష్టం కల్గుతోందని అధికారులు అంటున్నారు. ఈ బొగ్గులో రాళ్లు ఎక్కువగా వస్తున్నాయని దీనిని వాడితే యూనిట్లులో ఇబ్బందులు కలుగుతాయన్నారు. బొగ్గు కొరతతో ఒక్కొక్క యూనిట్‌లో 210 మెగావాట్లు బదులు ప్రస్తుతం 150లోపే విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నామని అధికారులు తెలిపారు. అంతేకాక రాళ్లుతో వస్తున్న బొగ్గును బయటకు తీయడానికి ప్రత్యేక ఖర్చుతో పొక్లెయిన్లు ఏర్పాటు చేసుకుని బండ రాళ్లును బయటకు తీస్తున్నారు. దీంతో ఆర్టీపీపీకి బొగ్గు కొరతతో పాటు అదనపు ఖర్చు వస్తుందని సీఈ తెలిపారు.
సింగరేణి వద్దనే బొగ్గును క్రష్ చేసి పంపించాల్సింది..
సింగరేణిని వస్తున్న బొగ్గును ముందుగా క్రషర్ ద్వారా పెద్ద బొగ్గును పిండి చేసి సరఫరా చేయూలి. అరుుతే సింగరేణి కాలనీ నేరుగా వ్యాగన్లు ద్వారా పెద్ద రాళ్ల బొగ్గును అలానే పంపిస్తున్నారు. సింగరేణి బొగ్గుతో పాటు వాష్‌డ్ బొగ్గు సక్రమంగా వస్తేనే ఉత్పత్తికి ఆటంకం ఉండదని అధికారులు వివరిస్తున్నారు.
ఆర్టీపీపీ సీఈ ఏమంటున్నారంటే.....
ఈ విషయంపై ఆర్టీపీపీ సీఈ కుమారుబాబును వివరణ కోరగాఆర్టీపీపీకి బొగ్గు కొరత చాలా ఎక్కువగా ఉంది. వాష్‌డు బొగ్గు ఒప్పంద ప్రకారం రాలేదు. ఒరిస్సా నుంచి నెల సుమారు 26 వ్యాగన్లు రావాల్సి ఉన్నా రాలేదు. సింగ రేణి నుంచి వస్తున్న బొగ్గులో రాళ్లు ఎక్కువగా ఉన్నాయి. వాటిని పగల కొట్టి కష్టాల నడుమ విద్యుత్ ఉత్పత్తికి ఆటంకం లేకుండా చూస్తున్నాం.
బొగ్గు బాగోలేదు..
Published Sat, Dec 6 2014 3:14 AM | Last Updated on Sat, Sep 2 2017 5:41 PM
Advertisement
Advertisement