కరీంనగర్ జిల్లా రామగుండం ఎన్‌టీపీఎస్‌లో విద్యుత్ సంక్షోభం నెలకొంది. రామగుండంలో గత మూడు రోజులుగా విస్తారంగా వర్షాలు ...
కరీంనగర్: కరీంనగర్ జిల్లా రామగుండం ఎన్‌టీపీఎస్‌లో విద్యుత్ సంక్షోభం నెలకొంది. రామగుండంలో గత 3 రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా బొగ్గు ఉత్పత్తికి తీవ్ర అంతరాయం ఏర్పడింది. 6వ యూనిట్లో 500 మెగావాట్లు, 3వ యూనిట్లో 200 మెగావాట్ల విద్యుత్కు అంతరాయం ఏర్పడింది. వర్షం కారణంగా తడిబొగ్గుతో విద్యుత్ ఉత్పత్తి గణనీయంగా తగ్గింది. దాంతో 2600 మెగావాట్లకుగానూ 1286 మెగావాట్లు విద్యుత్ ఉత్పత్తి అవుతోంది.