ramagundam NTPC
-
నాటి వైఎస్సార్ నుంచి నేటి కేసీఆర్ వరకు..
సాక్షి, గోదావరిఖని (కరీంనగర్) : రాష్ట్ర, జాతీయస్థాయి అతిథులకు నిలయంగా , అద్భుతమైన వంటకాలతో ప్రత్యేకతను చాటుకుంటోంది రామగుండం ఎన్టీపీసీ జ్యోతిభవన్. 2004లో ప్రారంభించిన నాటి నుంచి నేటి వరకు అనేక మంది ప్రముఖులు ఇక్కడి గృహంలోనే బస చేశారు. అప్పటి ముఖ్యమంత్రి దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి నుంచి నేటి సీఎం కె.చంద్రశేఖర్‌రావుతో సహా ఈ ప్రాంతానికి పర్యటనకు వస్తే ఇదే అతిథిగృహాన్ని ఎంచుకోవడం విశేషం. తాజాగా సీఎం ప్రత్యేకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించడానికి ఈప్రాంతానికి వచ్చిన రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్యరాజన్ కూడా ఇదే అతిథి గృహానికి చేరుMýనారు. మరోసారి ఈ గెస్ట్‌హౌజ్ విశిష్టస్థానాన్ని సంపాదించుకుంది. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రామగుండం ఎన్టీపీసీ యాజమాన్యం ప్రత్యేకంగా వచ్చే అతిథులు బస చేసేందుకు జ్యోతిభవన్ గెస్ట్‌హౌజ్ నిర్మించారు. 1986లో అప్పటి డైరెక్టర్ వి.సుందరరాజన్ గెస్ట్‌హౌజ్‌ను ప్రారంభించారు. అప్పటి నుంచి నేటి వరకు అతిథుల సేవలో తరిస్తోంది. 2006లో దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఈప్రాంత పర్యటనకు వచ్చినపుడు ఇదే గెస్ట్‌హౌజ్‌లో బస చేశారు. ఆతర్వాత 2004లో కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి ఆర్వీ సాహి గెస్ట్‌హౌజ్‌లో బస చేశారు. అలాగే 2006లో న్యూజిలాండ్‌కు చెందిన విదేశీయులు ఇదే గెస్ట్‌హౌజ్‌లో విడిది చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చీఫ్ జస్టిస్ మదన్మోహన్ బి లోకూర్ 2011లో ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఇదే గెస్ట్‌హౌజ్‌లో ఆతిథ్యం స్వీకరించారు. ఏపీ హైకోర్టు యాక్టింగ్ చీఫ్ జస్టిస్ పీసీ బోస్ 2012లో ఈ ప్రాంతానికి వచ్చారు. అలాగే సీఎం ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ఏడాదిలో రెండుసార్లు జ్యోతిభవన్‌లో బస చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు పనులు పరిశీలించడానికి వచ్చిన ముఖ్యమంత్రి ప్రశాంతంగా ఉండే గెస్ట్‌హౌజ్‌లో విశ్రాంతి తీసుకునేందుకు ఎంచుకున్నారు. తాజాగా రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ జ్యోతిభవన్‌లోనే బస చేశారు. చదవండి: మేడం వచ్చారు భవనం ప్రత్యేకతలు ఇవే.. చుట్టూ పచ్చదనంతో పరుచుకున్న పచ్చిక, విశాలమైన రోడ్లు, కాలుష్యానికి ఆమడదూరంలో గెస్ట్‌హౌజ్ నిర్మించడం ప్రత్యేకత సంతరించుకుంది. 1986లో ప్రారంభించిన గెస్ట్‌హౌజ్ ఎన్టీపీసీ అతిథుల కోసం కేటాయించారు. అయితే గెస్ట్‌హౌజ్ ప్రాంగణం విశాలంగా ఉండడంతోపాటు రాష్ట్ర, కేంద్రాల నుంచి వచ్చే అతిథులు బస చేసేందుకు అనుకూలంగా ఉంది. అంతేకాకుండా ప్రస్తుతం రామగుండం పోలీస్ కమిషనరేట్ కూడా గెస్ట్‌హౌజ్‌కు సమీపంలోనే ఉండడంతో వీఐపీలు బస చేసేందుకు మరింత అనుకూలంగా మారింది. నిరంతర విద్యుత్ సరఫరా, అతిథులను ఒప్పించి మెప్పించే వంటకాలతోపాటు అన్ని ఏర్పాట్లు ఇందులో ఉండడంతో అతిథులు ఈ జ్యోతిభవన్‌లోనే ఉండేందుకు మక్కువ చూపుతు న్నారు. ఇండియన్ కాఫీ హౌజ్ ఆతిథ్యం గెస్ట్‌హౌజ్‌లో బస చేసే వారికోసం ఇండియన్ కాఫీ హౌజ్ ద్వారా నార్తిండియన్ వంటకాలు తయారు చేస్తున్నారు. ఎన్టీపీసీ యాజమాన్యం అతిథులకు వడ్డించేందుకు ఇండియన్ కాఫీ హౌజ్‌ను కాంట్రాక్ట్ ద్వారా కేటాయించింది. నార్తిండియన్లతోపాటు తెలంగాణ ప్రాంత అతిథులకు కూడా ఇక్కడి వంటకాలు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. -
సీఎంను కలిసిన బాల మేధావులు
గోదావరిఖని (రామగుండం): అద్భుత మేధో సంపత్తితో చిన్న వయసులోనే పదోతరగతి పరీక్షలు రాసి మంచి మార్కులు సాధించిన చిన్నారులు ఉన్నత చదువుల కోసం ఎదురుచూస్తున్నారు. ఈనేపథ్యంలో పెద్దపల్లి జిల్లా రామగుండం పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి తమ మనసులోని మాటను విన్నవించడంతోనే.. సీఎం సానుకూలంగా స్పందించి వారి సమస్యను తీర్చాలని చీఫ్ సెక్రటరీ ఎస్.కె.జోషిని ఆదేశించారు. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం బబ్బెరచెలుక గ్రామానికి చెందిన మూల విష్ణువర్ధన్‌రెడ్డి– సరిత దంపతులు ప్రస్తుతం సీసీసీ నస్పూర్‌కాలనీలో ఉంటున్నారు. వీరి కూతురు వర్షితారెడ్డి, కుమారుడు హర్షవర్ధన్‌రెడ్డి 4, 3వ తరగతి చదువుతున్నారు. అయితే అద్భుత జ్ఞాపకశక్తితో పదో తరగతి పరీక్షలు రాసేందుకు అనుమతివ్వాలని ఇటీవల శ్రీరాంపూర్ పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రిని వేడుకున్నారు. సీఎం సానుకూలంగా స్పందించినప్పటికీ అధికారుల నుంచి అనుమతి రాకపోవడంతో కోర్టు ఆదేశాల ద్వారా ప్రత్యేక కమిటీ పర్యవేక్షణలో ఇద్దరు చిన్నారులు పరీక్షలు రాశారు. బాబుకు 61 శాతం, పాపకు 73 శాతం మార్కులు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఉన్నత చదువుల కోసం అవకాశం కల్పించాలని ముఖ్యమంత్రిని కలిసేందుకు వచ్చారు. హైదరాబాద్‌కు బయలుదేరేందుకు సీఎం బయటకు వచ్చిన క్రమంలో అక్కడ నిలబడి ఉన్న పిల్లలను పిలుచుకుని మాట్లాడి సమస్యను పరిష్కరించాలని సీఎస్‌కు సూచించారు. వీరికి అన్ని రకాలుగా సహకరించాలని ఆదేశించారు. సంతృప్తి లభించింది గెస్ట్‌హౌస్ వద్ద ఉన్న పిల్లలను గుర్తుపట్టి ముఖ్యమంత్రి దగ్గరకు పిలవడం జీవితంలో మరిచిపోలేం. మా బాధను అర్థం చేసుకొని వెంటనే పరిష్కరించాలని చీఫ్ సెక్రెటరీకి సూచించడం ఎంతో సంతోషానిచ్చింది. అడ్రస్ రాసిచ్చేందుకు పెన్ను కూడా లేకపోవడంతో సీఎం స్వయంగా తన వద్ద ఉన్న పెన్ను ఇచ్చి అడ్రస్ తీసుకోవడం జీవితానికి సరిపడే సంతృప్తినిచ్చింది. మా పిల్లలకు ముఖ్యమంత్రి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలి. – చిన్నారుల తల్లిదండ్రులు -
వెలుగుల దివ్వె ఎన్టీపీసీ
సాక్షి, పెద్దపల్లి/జ్యోతినగర్: దక్షిణభారత దేశానికి వెలుగులు పంచుతున్న రామగుండం ఎన్టీపీసీ 40వ వసంతంలోకి అడుగు పెట్టింది. నూతనంగా ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్రానికి వెలుగు కిరణాలను అందిస్తున్న ఎన్టీపీసీ గణనీయ పురోగతిని సాధిస్తోంది. 200 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యంతో 40 సంవత్సరాల క్రితం ప్రారంభమైన ఎన్టీపీసీ అంచెలంచెలుగా ఎదిగి 2,600 మెగావాట్ల సామర్థ్యానికి చేరుకొంది. ప్రపంచ విద్యుత్ సంస్థలతో పోటీపడుతూ, ఎన్నో అవార్డులు సొంతం చేసుకొని, రాష్ట్ర ఖ్యాతిని దశదిశలా వ్యాపింపచేస్తోంది. రామగుండం ఎన్టీపీసీ మంగళవారం 40వ వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా ‘సాక్షి’ అందిస్తున్న కథనం.. 1978లో శ్రీకారం అప్పటి ఉమ్మడి కరీంనగర్ జిల్లా, ప్రస్తుత పెద్దపల్లి జిల్లా రామగుండంలో 1978 నవంబర్ 14న నాటి ప్రధానమంత్రి మొరార్జీ దేశాయ్ చేతుల మీదుగా ఎన్టీపీసీ పురుడు పోసు కుంది. 1983 అక్టోబర్ 23 నుంచి ప్లాంట్ వెలుగులు పంచడం మొదలుపెట్టింది. దేశంలోనే తొలిసారిగా ఐఎస్వో 14001 సర్టిఫికెట్ ‘సూపర్ థర్మల్ పవర్ స్టేషన్’ అవార్డు పొందింది. ప్రపంచ స్థాయి విద్యుత్ సంస్థలతో పోటీ పడుతూ ఎన్నో రికార్డులను నెలకొల్పింది. 2,600 మెగావాట్ల సామర్థ్యం 200 మెగావాట్ల సామర్థ్యంతో ప్రారంభమైన ఎన్టీపీసీ ప్రస్తు తం 2,600 మెగావాట్ల సామర్థ్యానికి చేరుకొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏడు నెలల్లోనే 11,048.100 మిలియన్ యూనిట్లను 82.78 శాతం పీఎల్ఎఫ్ (ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్)తో ఉత్పత్తి చేసింది. 2016–17 వార్షిక సంవత్సరం లో 19,597.497 మిలియన్ యూనిట్లను 86.04 శాతం పీఎల్‌ఎఫ్‌తో ఉత్పత్తి చేసింది. రామగుండంలో ఈ ఏడాది మార్చి 29న ఒక్కరోజు 64.401 మిలియన్ యూనిట్ల విద్యు దుత్పత్తి చేసి రికార్డు సాధించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళ, గోవా, పాండిచ్చేరి రాష్ట్రాలకు ఇక్కడి నుంచి విద్యుత్ సరఫరా అవుతోంది. త్వరలో ‘తెలంగాణ’ వెలుగులు రాష్ట్ర పునర్విభజన ప్రకారం తెలంగాణకే త్వరలో ఎన్టీపీసీ వెలుగులు పంచబోతోంది. నిర్మాణ దశలో ఉన్న 1,600 మెగావాట్ల సామర్థ్యం ఉన్న తెలంగాణ ప్రాజెక్ట్ పూర్తయితే, మన రాష్ట్రానికి మరింత విద్యుత్ అందనుంది. తెలంగాణ స్టేజీ–1లో 800 మెగావాట్ల సామర్థ్యమున్న రెండు యూనిట్ల నిర్మాణం ప్రస్తుతం సాగుతోంది. దీనితో ఎన్టీపీసీకి 1,600 మెగావాట్ల విద్యుత్ అదనంగా అందనుంది. తెలంగాణ స్టేజీ–1ను 2016లో ప్రధాని మోదీ ప్రారంభించారు. సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో సంవత్సరానికి 8.0 మెట్రిక్ టన్నుల బొగ్గు, రెండు టీఎంసీల ఎల్లంపల్లి ప్రాజెక్టు నీటి వినియోగం, మందాకిని–బి కోల్‌మైన్, ఒడిశా, డబ్ల్యూపీ ఎల్ కోల్ లింకేజీతో రూ.10,598.98 కోట్లతో ప్రాజెక్టు నిర్మాణపనులు వేగంగా సాగుతున్నాయి. సోలార్ విద్యుత్ ను సంస్థ ఉత్పత్తి చేస్తోంది. సోలార్ ఫొటో వొల్టాయిక్ టెక్నా లజీతో క్రిస్టాలిన్ సిలికాన్ మోడ్యూల్స్‌తో విద్యుత్ ఉత్పత్తి చేస్తోంది. 2016–17లో 16.101 మిలియన్ యూనిట్లను 18.39 సీయూఎఫ్తో విద్యుత్ ఉత్పత్తి జరిగింది. దీనిని 132 కేవీ ద్వారా గ్రిడ్‌కు అనుసంధానించారు. అవార్డులు... - స్వర్ణశక్తి అవార్డు 2015–16 (విన్నర్ సీఎస్సార్–సీడి, రన్నర్ ప్రోడక్టివిటీలో) - ఎన్టీపీసీ బీఈ మోడల్ 2016–17లో ద్వితీయ స్థానం. - ఎంజీఆర్ విభాగం ఉద్యోగులకు విశ్వకర్మ పురస్కారం - క్వాలిటీ సర్కిల్ ఫోరమ్ ఆఫ్ ఇండియా చాప్టర్ అవార్డు. - గ్రీన్‌టెక్ సేఫ్టీ అవార్డు–2016 - ఎనర్జీ ఎఫీషియెంట్ యూనిట్ అవార్డు అంతర్జాతీయ గుర్తింపు రామగుండం ఎన్టీపీసీకి 2015 ప్రపంచ అత్యుత్తమ ప్రాజెక్టుగా అమెరికా పవర్ మ్యాగజైన్ గుర్తింపు దక్కింది. 442 రోజులు నిరంతర విద్యుత్ ఉత్పత్తి చేసి జాతీయ స్థాయి రికార్డును సొంతం చేసుకుంది. – దిలీప్‌కుమార్ దూబే,ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ఎన్టీపీసీ రామగుండం 89 శాతం బూడిద.. విద్యుత్ ఉత్పత్తిలో భాగంగా విడుదలయ్యే బూడిదను 89.04 శాతం ఉపయోగంలోకి తెచ్చారు. రైల్వే వ్యాగన్ల ద్వారా బూడిదను తరలించి, భూగర్భ గనుల్లో నింపేం దుకు చర్యలు తీసుకొంటున్నారు. రైతులకు ఉచిత బూడిద సరఫరా చేయడంతో పాటు, బొగ్గు పూర్తిగా తొలగించిన ఓపెన్‌కాస్టు మైన్లను బూడిదతో నింపేందుకు ప్రణాళిక లు రూపొందిస్తున్నారు. 100 శాతం బూడిద వినియోగానికి ప్రత్యేక చర్య లు తీసుకుంటున్నారు. విద్యుదుత్ప త్తిలో రక్షణ చర్యలకు సంస్థ అధిక ప్రాధాన్యతనిస్తోంది. సేప్టీ మేనేజ్ మెంట్ విధానం ద్వారా ప్రతి విభా గంలో రక్షణ బృందాలను ఏర్పాటు చేసి అనుక్షణం గమనిస్తుంటారు. క్వాలిటీ సర్కిల్ బృందాల ద్వారా వృత్తి నైపుణ్యతను పెంచుతూ, విద్యుదుత్పత్తి, ఉత్పాదకతలో మెరు గైన పద్ధతులను పాటిస్తున్నారు. తెలంగాణ స్టేజీ–1ను ప్రారంభిస్తున్న ప్రధాని నరేంద్రమోదీ (ఫైల్) -
ఎన్టీపీసీలో ఆగని ఆందోళన
రామగుండం: రామగుండం ఎన్టీపీసీలో మంగళవారం సాయంత్రం మొదలైన కాంట్రాక్టు కార్మికుల ఆందోళన ఇంకా కొనసాగుతోంది. కాంట్రాక్టు కార్మికుడు సంపత్ రావు(54) అకస్మాత్తుగా కుప్పకూలగా.. ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో చనిపోయాడు. దీంతో మృతుడి భార్య విమల, ఇద్దరు కుమారులు నష్టపరిహారం చెల్లించాలని బంధువులు, యూనియన్ నాయకులతో పాటు లేబర్ గేట్ వద్ద నిరసనకు దిగారు. తమ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని, రూ.20 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అయితే, యాజమాన్యం అందుకు అంగీకరించకపోవటంతో బుధవారం ఉదయం కూడా ఆందోళన కొనసాగిస్తున్నారు. దీంతోపాటు దాదాపు రెండు వేల మంది కార్మికులు వారికి మద్దతుగా విధులు బహిష్కరించారు. -
రామగుండం ఎన్టీపీసీలో తప్పిన ప్రమాదం
పెద్దపల్లి: పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీలో ఆదివారం పెద్ద ప్రమాదం తప్పింది. ఎన్టీపీసీలోని బొగ్గు బంకర్ ఒక్కసారిగా కూలిపోయింది. దీంతో నాలుగో యూనిట్లో 500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. బంకర్ కూలిన సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. బంకర్లో నిల్వ ఉన్న 20 వేల టన్నుల బొగ్గు నేల పాలయింది. ఎన్టీపీసీ అధికారులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. బంకర్ కూలడంతో భారీగా ఆస్తి నష్టం వాటిల్లినట్లు సమాచారం. పునరుద్ధరణ పనులు చేపట్టారు. -
రామగుండం ఎన్టీపీసీలో తప్పిన ప్రమాదం
-
రామగుండం ఎన్టీపీసీ ఏడవ యూనిట్ నిలిపివేత
పెద్దపల్లి: పెద్దపల్లి జిల్లాలోని రామగుండం ఎన్టీపీసీ(నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్) 7 యూనిట్ లో ఉత్పత్తి నిలిచి పోనుంది. ఈ అంశాన్ని అధికారులు తెలిపారు. ఏడో యూనిట్ వార్షిక మరమ్మత్తుల కోసం శుక్రవారం నుంచి ఉత్పత్తిని నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. దీని వల్ల 500ల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి నిలిచి పోనుంది. -
ఐదేళ్లలో 4వేల మెగావాట్ల ఉత్పత్తి
► రామగుండం ఎన్టీపీసీ విద్యుత్ కేంద్రాన్ని వేగంగా పూర్తిచేస్తాం ► సీఎం కేసీఆర్‌కు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ హామీ ► బీహెచ్ఈఎల్ వద్ద ఉన్న 4 యూనిట్లు రాష్ట్రానికి అందించడానికి అంగీకారం సాక్షి, న్యూఢిల్లీ: రామగుండం వద్ద ఎన్టీపీసీ నిర్మించనున్న 4 వేల మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రం ఐదేళ్లలోగానే పూర్తిస్థాయి విద్యుత్ ఉత్పత్తి చేస్తుందని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గోయల్ హామీ ఇచ్చారు. తెలంగాణలో మరిన్ని సోలార్ పార్క్‌లను ఏర్పాటుకు అనుమతివ్వనున్నట్లు చెప్పారు. సీఎం కేసీఆర్ శుక్రవారం ఢిల్లీలో పీయూష్ గోయల్‌ను కలసి పలు అంశాలపై చర్చించారు. ఆయన వెంట మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎంపీలు జితేందర్‌రెడ్డి, వినోద్‌కుమార్, బూర నర్సయ్యగౌడ్, ఎమ్మెల్సీ పి.రాజేశ్వర్‌రెడ్డి, ఢిల్లీలోని రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి వేణుగోపాలాచారి ఉన్నారు. ఈ సందర్భంగా పీయూష్ గోయల్ మాట్లాడుతూ... రామగుండంలో విద్యుత్ కేంద్రం ఏర్పాటుకు సంబంధించి రెండు 800 మెగావాట్ల యూనిట్లకు టెండర్లు పూర్తయ్యాయని... త్వరలో పనులు ప్రారంభమవుతాయని చెప్పారు. మరో మూడు 800 మెగావాట్ల యూనిట్లను కూడా నిర్మిస్తామని... 2021వ సంవత్సరం నాటికి నాలుగు వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతుందని తెలిపారు. ఈ యూనిట్ల ఏర్పాటుకు 600 ఎకరాల భూమి అవసరమని, కొంత భూమి రైల్వేలైన్ విస్తరణకు అవసరమని... త్వరలోనే దీనికి పరిష్కారం కనుగొంటామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారన్నారు. టీ జెన్కో ప్రతిపాదించిన 1,080 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టు ఏర్పాటుకు బీహెచ్ఈఎల్ వద్ద ప్రస్తుతమున్న 270 మెగావాట్ల 4 యూనిట్లను రాష్ట్రానికి అందించాలని సీఎం కేసీఆర్ కోరారని కేంద్ర మంత్రి గోయల్ చెప్పారు. తద్వారా ఖమ్మం జిల్లాలోని మణుగూరులో యూనిట్లను రెండేళ్లలోగా ఏర్పాటు చేయవచ్చని, ఈలోగా పర్యావరణ అనుమతులను పొందాల్సి ఉంటుందని తెలిపారు. 2,500 మెగావాట్ల సోలార్ పార్క్‌ను తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందని.. భవిష్యత్తులో మరిన్ని సోలార్ పార్క్‌లకు అనుమతి ఇవ్వాలని కేంద్రం యోచిస్తోందని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం రానున్న మూడేళ్లలో కొత్తగా 5,880 మెగావాట్ల ధర్మల్ విద్యుత్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించడం అభినందనీయమని చెప్పారు. ఈ విద్యుత్ కేంద్రాలకు కోల్ లింకేజీ ఇవ్వాలని సీఎం కేసీఆర్ కోరారన్నారు. థర్మల్ విద్యుత్ కేంద్రాలకు కోల్ లింకేజీకి సంబంధించి కొత్త విధానాన్ని ఖరారు చేస్తున్నామని.. అది ఖరారు కాగానే రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలను పరిష్కరిస్తామని చెప్పారు. తాడిచెర్ల-1 కోల్‌బ్లాక్‌ను టీజెన్‌కోకు కేంద్రం గతేడాదే కేటాయించిందని, బొగ్గు ఉత్పత్తికి కొంత సమయం పడుతుందని తెలిపారు. తాత్కాలికంగా 2.5 మిలియన్ టన్నుల కోల్ లింకేజీని రాష్ట్ర ప్రభుత్వం కోరిందని... అందుకు అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేశామని గోయల్ చెప్పారు. -
ఎన్టీపీసీలో నిలిచిన విద్యుత్
కరీంనగర్: రామగుండం ఎన్టీపీసీలోని మొదటి యూనిట్లో సాంకేతిక లోపంతో గురువారం అంతరాయం ఏర్పడింది. 200 మెగా యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి ఆగిపోయింది. మరోవైపు నాల్గో యూనిట్లో 500 మెగా యూనిట్ల కేంద్రంలోనూ మరమ్మతులు కొనసాగుతున్నాయి. దీంతో 2600 మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తిగాను 1900 మెగా యూనిట్ల విద్యుత్ మాత్రమే ఉత్పత్తి అవుతోంది. అధికారులు పునరుద్ధరణకు చర్యలు చేపట్టారు. -
రామగుండం ఎన్టీపీసీలో ఉత్పత్తికి అంతరాయం
రామగుండం: కరీంనగర్ జిల్లా రామగుండం ఎన్టీపీసీలోని మొదటి యూనిట్లో అంతరాయం ఏర్పడింది. దీంతో 200 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. శుక్రవారం తెల్లవారుజామున సాంకేతిక లోపంతో విద్యుత్ ఉత్పత్తికి ఏర్పడిందని అధికారులు గుర్తించారు. కాగా, సాయంత్రంలోగా సమస్య పరిష్కరిస్తామని అధికారులు తెలిపారు. రామగుండం ఎన్టీపీసీ మొత్తం సామర్ధ్యం 2600 మెగావాట్లు కాగా, ప్రస్తుతానికి 2400 మెగావాట్ల విద్యుత్ మాత్రమే ఉత్పత్తి చేస్తున్నారు. -
రామగుండంలో మరిన్ని ఎన్టీపీసీ యూనిట్లు
జ్యోతినగర్: కరీంనగర్ జిల్లాలోని రామగుండంలోని ఎన్టీపీసీ ప్రాజెక్టు సమీపంలో మరిన్ని విద్యుదుత్పత్తి ప్లాంట్లు నిర్మించే ఆలోచనలో ఉన్నట్టు ఆ సంస్థ సీఎండీ అరూప్‌రాయ్ చౌదరి తెలిపారు. తెలంగాణ స్టేజ్-1లో భాగంగా రామగుండంలోనిర్మిస్తున్న 1600 మెగావాట్ల (ఒక్కోటీ 800) ప్రాజెక్టు పనులను ఆదివారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా అధికారులతో మాట్లాడుతూ... మరో 10వేల మెగావాట్ల ప్రాజెక్టులు ఏర్పాటు చేయడానికి సరిపడా స్థలం అందుబాటులో ఉందన్నారు. ఈ విషయమై ప్రభుత్వంతో మాట్లాడనున్నట్టు చెప్పారు. -
రామగుండం ఎన్టీపీఎస్‌లో విద్యుత్ సంక్షోభం
కరీంనగర్: కరీంనగర్ జిల్లా రామగుండం ఎన్టీపీఎస్‌లో విద్యుత్ సంక్షోభం నెలకొంది. రామగుండంలో గత 3 రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా బొగ్గు ఉత్పత్తికి తీవ్ర అంతరాయం ఏర్పడింది. 6వ యూనిట్లో 500 మెగావాట్లు, 3వ యూనిట్లో 200 మెగావాట్ల విద్యుత్‌కు అంతరాయం ఏర్పడింది. వర్షం కారణంగా తడిబొగ్గుతో విద్యుత్ ఉత్పత్తి గణనీయంగా తగ్గింది. దాంతో 2600 మెగావాట్లకుగానూ 1286 మెగావాట్లు విద్యుత్ ఉత్పత్తి అవుతోంది.