రామగుండం ఎన్‌టీపీసీలోని మొదటి యూనిట్‌లో సాంకేతిక లోపంతో గురువారం అంతరాయం ఏర్పడింది.
కరీంనగర్: రామగుండం ఎన్‌టీపీసీలోని మొదటి యూనిట్‌లో సాంకేతిక లోపంతో గురువారం అంతరాయం ఏర్పడింది. 200 మెగా యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి ఆగిపోయింది. మరోవైపు నాల్గో యూనిట్‌లో 500 మెగా యూనిట్ల కేంద్రంలోనూ మరమ్మతులు కొనసాగుతున్నాయి. దీంతో 2600 మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తిగాను 1900 మెగా యూనిట్ల విద్యుత్ మాత్రమే ఉత్పత్తి అవుతోంది. అధికారులు పునరుద్ధరణకు చర్యలు చేపట్టారు.