
రామగుండం ఎన్టీపీసీలో ఉత్పత్తికి అంతరాయం
రామగుండం: కరీంనగర్ జిల్లా రామగుండం ఎన్టీపీసీలోని మొదటి యూనిట్‌లో అంతరాయం ఏర్పడింది. దీంతో 200 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. శుక్రవారం తెల్లవారుజామున సాంకేతిక లోపంతో విద్యుత్ ఉత్పత్తికి ఏర్పడిందని అధికారులు గుర్తించారు.
కాగా, సాయంత్రంలోగా సమస్య పరిష్కరిస్తామని అధికారులు తెలిపారు. రామగుండం ఎన్టీపీసీ మొత్తం సామర్ధ్యం 2600 మెగావాట్లు కాగా, ప్రస్తుతానికి 2400 మెగావాట్ల విద్యుత్ మాత్రమే ఉత్పత్తి చేస్తున్నారు.