ఎన్టీపీసీలో ఆగని ఆందోళన
Published Wed, Mar 15 2017 10:48 AM | Last Updated on Tue, Sep 5 2017 6:10 AM
రామగుండం: రామగుండం ఎన్‌టీపీసీలో మంగళవారం సాయంత్రం మొదలైన కాంట్రాక్టు కార్మికుల ఆందోళన ఇంకా కొనసాగుతోంది. కాంట్రాక్టు కార్మికుడు సంపత్ రావు(54) అకస్మాత్తుగా కుప్పకూలగా.. ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో చనిపోయాడు. దీంతో మృతుడి భార్య విమల, ఇద్దరు కుమారులు నష్టపరిహారం చెల్లించాలని బంధువులు, యూనియన్ నాయకులతో పాటు లేబర్ గేట్ వద్ద నిరసనకు దిగారు.
తమ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని, రూ.20 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అయితే, యాజమాన్యం అందుకు అంగీకరించకపోవటంతో బుధవారం ఉదయం కూడా ఆందోళన కొనసాగిస్తున్నారు. దీంతోపాటు దాదాపు రెండు వేల మంది కార్మికులు వారికి మద్దతుగా విధులు బహిష్కరించారు.
Advertisement
Advertisement