- మిగిలింది 75 రోజులే
- లక్ష్యం 18 మిలియన్ టన్నులు
- ఇప్పటివరకు 37 మిలియన్ టన్నుల ఉత్పత్తి
- ఉత్పత్తి వేగం పెంచేందుకు అధికారుల కసరత్తులు
కొత్తగూడెం : సింగరేణి సంస్థ నిర్ధేశించుకున్న బొగ్గు ఉత్పత్తి లక్ష్య సాధనలో లోటు కొనసాగుతోం ది. ప్రతి ఏటా వర్షాకాలంలో ఓసీల్లో ఉత్పత్తికి ప్రతికూల పరిస్థితులు ఏర్పడేది. ఈ ఏడాది అ లాంటి ఇబ్బందులు పెద్దగా లేకున్నా ఉత్పత్తి మందగించింది. ఆర్థిక సంవత్సరం ముగియడానికి రెండున్నర నెలలు మాత్రమే ఉంది. దీంతో ఉత్పత్తి వేగం పెంచడానికి యాజమా న్యం అవసరమైన చర్యలు చేపట్టింది. ఫలితం గా కార్మికులపై పనిభారం పెరుగుతున్నట్లు సమాచారం అందుతోంది.
సింగరేణి సంస్థ 2014-15 ఆర్థిక సంవత్సరానికి 55 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యంగా నిర్ధేశించుకుం ది. కంపెనీ వ్యాప్తంగా 11 ఏరియాల్లో ఉన్న 15 ఓపెన్‌కాస్టు, 34 భూగర్భ గనుల ద్వారా గడిచి న తొమ్మిదిన్నర నెలల కాలంలో 41 మిలియన్ ట న్నులకు 37 మిలియన్ టన్నుల ఉత్పత్తి నమోదైంది. మరో రెండున్నర నెలల కాలంలో సుమారు 18 మిలియన్ టన్నులు సాధించాల్సి ఉంది.
ఈ ఏడాది జనవరి 13 నాటికి 4,17, 21,644 టన్నుల ఉత్పత్తి చేపట్టాల్సి ఉండగా 3,73,40,418 టన్నుల(89 శాతం) ఉత్పాదక త నమోదైంది. గత ఏడాదితో పోల్చుకుంటే ఉత్పత్తి కొంచెం ఎక్కువగానే ఉన్నప్పటికీ 2012-13 ఏడాదితో పోల్చుకుంటే మాత్రం 2 మిలియన్ టన్నులు వెనుకంజలో ఉంది.
వెనుకబడిన ఓపెన్‌కాస్టులు
ప్రతి ఏటా ఓపెన్‌కాస్టుల్లో నూరు శాతానికి పైగా చేసిన ఉత్పత్తితో భూగర్భగనుల లోటు భర్తీ అయ్యేది. భూగర్భగనుల ద్వారా ఇప్పటివరకు 1,13,30,949 టన్నులకు 76,09,400 టన్నులు, ఓపెన్‌కాస్టు గనుల్లో 3,03,90,695 టన్నులకు 2,97,31,003 టన్నుల ఉత్పత్తి జరి గింది. మొత్తం 11 ఏరియాల్లో 4 ఏరియాలు మాత్రమే నూరుశాతం ఉత్పత్తి సాధించాయి. కొత్తగూడెం ఏరియా 126 శాతంతో ప్రథమ స్థానంలో, అడ్రియాల ప్రాజెక్టు ఏరియా చివరి స్థానంలో, మందమర్రి ఏరియా 65 శాతంతో చివరి నుంచి రెండో స్థానంలో ఉంది.