refinery
-
ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నకు కేంద్రమంత్రి జవాబు
సాక్షి, న్యూఢిల్లీ: పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్‌ను మిశ్రమం చేయాలన్న లక్ష్య సాధనలో 2జీ (రెండో తరం) ఇథనాల్ కీలకం కానున్నట్లు పెట్రోలియం శాఖ సహాయ మంత్రి రామేశ్వర్ తెలీ వెల్లడించారు. అందుకోసం 2జీ బయో ఇథనాల్ రిఫైనరీల ఏర్పాటుకు కేంద్రం ఆర్థిక సహాయం అందిస్తుందని రాజ్యసభలో సోమవారం వైఎస్సార్సీపీ సభ్యులు విజయసాయిరెడ్డి ప్రశ్నకు రాతపూర్వకంగా బదులిస్తూ చెప్పారు. ప్రభుత్వ ఆయిల్ రంగ సంస్థలు ఈ ఏడాది నవంబర్ 15 నాటికి ఆంధ్రప్రదేశ్ నుంచి 16.19 కోట్ల లీటర్ల ఇథనాల్‌ను కొనుగోలు చేసినట్లు ఆయన చెప్పారు. దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి గడిచిన 5 సంవత్సరాలలో 385.92 కోట్ల లీటర్ల ఇథనాల్‌ను ప్రభుత్వ రంగ ఆయిల్ సంస్థలు కొనుగోలు చేసినట్లు పేర్కొన్నారు. 2025 నాటికి పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్ మిశ్రమాన్ని సాధించేందుకు రెండో తరం ఇథనాల్ ఉత్పత్తిని ఏ విధంగా ప్రోత్సహిస్తున్నారన్న ప్రశ్నకు మంత్రి బదులిస్తూ ప్రధాన మంత్రి జేఐ-వన్ (జీవ్ ఇంధన్- వాతావరణ్ అనుకూల్ ఫసల్ అవశేష్ నివారణ్) యోజన పథకం కింద సెల్లులోసిక్, లింగో సెల్లులోసిక్ బయోమాస్ నుంచి అలాగే పెట్రో కెమికల్ మార్గం ద్వారా 2జీ ఇథనాల్ ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు 2 జీ ఇథనాల్ బయో రిఫైనరీస్‌ను పెద్ద ఎత్తు ఏర్పాటు చేయాలని తలపెట్టినట్లు మంత్రి వెల్లడించారు. ఈ రిఫైనరీలకు తగిన విధంగా ఆర్థిక సహాయం అందించేందుకు కేంద్రం నోటిఫికేషన్ కూడా విడుదల చేసినట్లు తెలిపారు. వరి దుబ్బు, ఇతర పంట వ్యర్థాల ఆధారిత 2జీ ఇథనాల్ బయో రిఫైనరీలు పంజాబ్, హర్యానా, ఒడిశా, అస్సాం రాష్ట్రాల్లో ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు. హర్యానాలోని పానిపట్‌లో నెలకొల్పిన బయో రిఫైనరీని జాతికి అంకితం చేసినట్లు తెలుపారు. బయోమాస్ సేకరణ కోసం ప్రభుత్వ రంగ ఆయిల్ సంస్థలు వివిధ రాష్ట్రాలు, రైతులు, ఇతర భాగస్వాములతో సమన్వయం చేసుకుంటోందని మంత్రి తెలిపారు ఏపీలో లక్షా 90 వేల వీధి వర్తకులకు స్వానిధి రుణాలు ప్రధానమంత్రి స్వానిధి పథకం కింద ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు 1,90,433 మంది వీధి వర్తకులకు రుణాలు మంజూరు చేసినట్లు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలిపారు. రాజ్యసభలో విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి బదులిస్తూ 2020-21 ఆర్థిక సంవత్సరంలో 1,12,744 మందికి, 2021-22 లో 70,415 మందికి, 2022-23 లో 7,274 మందికి మొదటి దశ కింద ఒక్కొక్కరికి 10 వేల రూపాయల రుణం మంజూరు చేసినట్లు తెలిపారు. మొదటి తీసుకున్న రుణం సక్రమంగా చెల్లించిన వారికి రెండవ దఫా రుణం కింద 20 వేల రూపాయలు మంజూరు చేసినట్లు చెప్పారు. మూడవ దశ కింద 251 మందికి 50 వేల రూపాయల రుణం అందించినట్లు మంత్రి తెలిపారు. అలాగే వడ్డీ సబ్సిడీ కింద 3 కోట్ల రూపాయలు, క్యాష్ బ్యాక్ కింద కోటి 65 లక్షల రూపాయలు లబ్దిదారులకు అందజేసినట్లు తెలిపారు. ఈ ఏడాది డిసెంబర్ 4 నాటికి పీఎం స్వానిధి పథకం కింద రుణాల కోసం ఏపీ నుంచి 4 లక్షల దరఖాస్తులు అందగా అందులో 67,404 దరఖాస్తులు అర్హత లేనివిగా గుర్తించి తిరస్కరించినట్లు తెలిపారు. 16,118 దరఖాస్తులు మంజూరు దశలో ఉన్నాయని, 29,853 మంది బ్యాంకులకు అందుబాటులో లేని కారణంగా రుణాల పంపిణీ పెండింగ్‌లో ఉన్నట్లు మంత్రి వివరించారు. కోవిడ్ మహమ్మారి కారణంగా కుదేలైన వీధి వర్తకులు తిరిగి వారి వ్యాపార కార్యకలాపాలను కొనగించుకునేందుకు వర్కింగ్ కాపిటల్ కింద 10 వేల రూపాయలు రుణం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎం స్వానిధి పథకాన్ని 2020 జూన్ 1న ప్రారంభించినట్లు మంత్రి తెలిపారు. తీసుకున్న రుణం సకాలంలో చెల్లించిన వారికి రెండవ దఫా రుణం కింద 20 వేలు, మూడవ దఫా కింద 50 వేల రూపాయలు ఇచ్చినట్లు పేర్కొన్నారు. సకాలంలో రుణం చెల్లించిన వారికి తీసుకున్న రుణంపా 7 శాతం వడ్డీ రాయితీ, డిజిటల్ చెల్లింపులు చేసిన వారికి క్యాష్ బ్యాక్ కింద ఏడాదికి 1200 రూపాయలు చెల్లించినట్లు మంత్రి పేర్కొన్నారు. చదవండి: ఏపీలో భారీగా ఉద్యోగావకాశాలు.. వేల కోట్ల పెట్టుబడులకు ఎస్ఐపీబీ గ్రీన్ సిగ్నల్ -
మేలో మౌలిక రంగం భారీ వృద్ధి
న్యూఢిల్లీ: ఎనిమిది మౌలిక పరిశ్రమల గ్రూప్ మేనెల్లో (2021 మే నెలతో పోల్చి) భారీగా 18.1 శాతం పురోగతి సాధించింది. ఈ స్థాయి ఫలితం నమోదుకావడం 13 నెలల తర్వాత ఇదే తొలిసారి. బొగ్గు, క్రూడ్ ఆయిల్, సహజ వాయువు, రిఫైనరీ ప్రొడక్టులు, ఎరువులు, స్టీల్, సిమెంట్, విద్యుత్‌లతో కూడిన ఈ గ్రూప్ వెయిటేజ్ మొత్తం పారిశ్రామిక ఉత్పతిసూచీ (ఐఐపీ)లో దాదాపు 44 శాతం. మే నెల్లో బొగ్గు (25.1 శాతం), క్రూడ్ ఆయిల్ (4.6 శాతం), రిఫైనరీ ప్రొడక్టులు (16.7 శాతం), ఎరువులు (22.8 శాతం), సిమెంట్ (26.3 శాతం) విద్యుత్ (22 శాతం) రంగాలు మంచి పురోగతి సాధించాయి. అయితే సహజ వాయువు ఉత్పత్తి 7 శాతం క్షీణించగా, స్టీల్ ఉత్పత్తి 15 శాతం పడింది. కాగా, ఆర్థిక సంవత్సరం మొదటి రెండు నెలల్లో (ఏప్రిల్–మే) ఎనిమిది పరిశ్రమల వృద్ధి రేటు 13.6 శాతంగా నమోదయ్యింది. -
ఇన్ఫ్రా పరుగులు...
• అక్టోబర్‌లో 6.6 శాతం • ఆరు నెలల గరిష్ట స్థారుుకి వృద్ధి • స్టీల్, రిఫైనరీ రంగాల మెరుగైన పనితీరు న్యూఢిల్లీ: మౌలిక రంగ వృద్ధి అక్టోబర్‌లో రికార్డు స్థారుుకి చేరుకుంది. గత ఆరు నెలల కాలంలోనే అత్యధికంగా అక్టోబర్‌లో 6.6 శాతంగా నమోదైంది. స్టీల్, రిఫైనరీ రంగాల అద్భుత పనితీరు ఈ స్థారుు వృద్ధికి తోడ్పడ్డారుు. మౌలికంలో భాగమైన విద్యుదుత్పత్తి, ఎరువుల ఉత్పత్తి, సిమెంట్ ఉత్పత్తి మాత్రం భారీగా పడిపోరుుంది. వరుసగా మూడో నెల కూడా బొగ్గు ఉత్పత్తి తగ్గింది. మౌలికంలో భాగమైన ఎనిమిది రంగాలు... బొగ్గు, ముడి చమురు, సహజవాయువు,, రిఫైనరీ ఉత్పత్తులు, ఎరువులు, స్టీల్, సిమెంట్, విద్యుదుత్పత్తి వృద్ధి రేటు గతేడాది అక్టోబర్‌లో కేవలం 3.8 శాతంగానే ఉంది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో 5 శాతంగా నమోదవగా.. తాజాగా అది 6.6 శాతానికి చేరుకుంది. దేశీయ పారిశ్రామిక ఉత్పత్తిలో మౌలిక రంగం వాటా 38 శాతం. ఈ రంగం ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-అక్టోబర్ కాలంలో 4.9 శాతం వృద్ధి చెందింది. గతేడాది ఇదే కాలంలో ఈ వృద్ధి రేటు 2..8 శాతం మాత్రమే. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం బుధవారం గణాంకాలను విడుదల చేసింది. ⇔ అక్టోబర్‌లో స్టీల్ ఉత్పత్తి రెండంకెల స్థారుులో 16.9 శాతంగా నమోదైంది. అంతకుముందు ఏడాది ఇదే నెలలో ఇది 5.5 శాతం. ⇔ రిఫైనరీ ప్రొడక్ట్స్ ఉత్పత్తి సైతం 15.1 శాతానికి చేరుకుంది. అంతకుముందు ఏడాది అక్టోబర్‌లో ఇది కేవలం 4.4 శాతంగా ఉంది. ⇔ 2015 అక్టోబర్‌లో ఎరువుల ఉత్పత్తి 16.8 శాతంగా ఉండగా తాజాగా అది 0.8 శాతానికి పడిపోరుుంది. సిమెంట్ ఉత్పత్తి సైతం 13.8 శాతం నుంచి 2.8 శాతానికి క్షీణించింది. ⇔ బొగ్గు ఉత్పత్తి 6.6% నుంచి 1.6%కి, సహజ వారుువు ఉత్పత్తి 1.4%కి, ముడి చమురు ఉత్పత్తి 3.2 శాతానికి తగ్గింది. -
వంటనూనెలపై దిగుమతి సుంకాలు పెంచాలి
♦ అప్పుడే దేశీ రైతులు, రిఫైనరీలకు ప్రయోజనం ♦ సాల్వెంట్ ఎక్స్‌ట్రాక్టర్స్ అసోసియేషన్ వినతి హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీ రిఫైనరీలు, రైతుల ప్రయోజనాలు కాపాడాలంటే దిగుమతయ్యే వంటనూనెలపై సుంకాలు మరింతగా పెంచాల్సిన అవసరం ఉందని సాల్వెంట్ ఎక్స్‌ట్రాక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ప్రవీణ్ లుంకాడ్ అన్నారు. క్రూడ్, రిఫైన్డ్ నూనెల దిగుమతి సుంకాల మధ్య వ్యత్యాసం ప్రస్తుతం 7.5% మాత్రమే ఉందని, ఇది కనీసం 15 % ఉండాలని ఆయన వివరించారు. ప్రస్తుతం క్రూడ్ దిగుమతులపై 12.5%, రిఫైన్డ్ నూనెలపై సుమారు 20% మేర సుంకాలు ఉన్నాయని గురువారమిక్కడ మలేషియా ఇండియా పామాయిల్ సెమినార్లో పాల్గొన్న సందర్భంగా ప్రవీణ్ తెలిపారు. దేశీయంగా ఏటా 20 మిలియన్ టన్నుల మేర వంటనూనెల డిమాండ్ ఉండగా, 14.5 మిలియన్ టన్నులు దిగుమతవుతోందని, ఇందులో 9.5 మి. టన్నులు పామాయిల్ ఉంటోందని ఆయన చెప్పారు. వంటనూనెల దిగుమతి బిల్లు సుమారు రూ. 70,000 కోట్ల పైచిలుకు ఉందని పేర్కొన్నారు. దేశంలో రిఫైనరీల మొత్తం సామర్థ్యం 2.5 మిలియన్ టన్నుల మేర ఉన్నప్పటికీ.. కేవలం 30% సామర్ధ్యాన్నే వినియోగించుకోవడం జరుగుతోందని ప్రవీణ్ చెప్పారు. వర్షపాతం మెరుగ్గా ఉండొచ్చన్న అంచనాల నేపథ్యంలో రానున్న రోజుల్లో ధరలు ఒక స్థాయిలోనే కదలాడవచ్చన్నారు. 700 డాలర్లకు పామాయిల్ ధర.. అంతర్జాతీయంగా ప్రస్తుతం 650 డాలర్లుగా ఉన్న టన్ను పామాయిల్ ధర సోయా ఉత్పత్తి తగ్గుదల అంచనాలు తదితర అంశాల కారణంగా 700 డాలర్లకు చేరొచ్చని సెమినార్లో పాల్గొన్న మలేషియా పామాయిల్ కౌన్సిల్ సీఈవో యూసఫ్ బసీరన్ తెలిపారు. భారత్‌కు గతేడాది 3.9 మిలియన్ టన్నుల మేర పామాయిల్ ఎగుమతి చేశామని, ఈసారి 4 మిలియన్ టన్నుల స్థాయి దాటొచ్చని చెప్పారు. -
17వేల కోట్లతో విశాఖ రిఫైనరీ విస్తరణ
♦ కరీంనగర్లో ఎల్పీజీ ప్లాంట్ ♦ నాలుగేళ్లలో 45,000 కోట్లు ♦ ఇన్వెస్ట్ చేస్తున్న హెచ్‌పీసీఎల్ న్యూఢిల్లీ: హిందుస్తాన్ పెట్రోలియమ్ కార్పొరేషన్(హెచ్‌పీసీఎల్) రిఫైనరీల విస్తరణను భారీ స్థాయిలో చేపడుతోంది. విశాఖపట్టణంలోని రిఫైనరీ విస్తరణ కోసం 2020 కల్లా రూ.17,000 కోట్లు పెట్టుబడులు పెట్టనున్నామని హెచ్‌పీసీఎల్ పేర్కొంది. ప్రస్తుతం విశాఖ రిఫైనరీ వార్షిక ఉత్పాదక సామర్థ్యం 8.3 మిలియన్ టన్నులని, దీనిని 15 మిలియన్ టన్నులకు పెంచడానికి ఈ స్థాయిలో పెట్టుబడులు పెడుతున్నామని ఇన్వెస్టర్లకు ఇచ్చిన ప్రజెంటేషన్‌లో హెచ్‌పీసీఎల్ వివరించింది. అంతేకాకుండా తెలంగాణలోని కరీంనగర్లో కొత్తగాఎల్‌పీజీ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తున్నామని పేర్కొంది. మార్కెటింగ్ కోసం రూ.14,000 కోట్లు... రిఫైనరీల విస్తరణ, మార్కెటింగ్ మౌలిక సదుపాయాలు, ఇతర అంశాల కోసం 2020 కల్లా మొత్తం రూ.45,000 కోట్లు పెట్టుబడులు పెట్టనున్నామని హెచ్‌పీసీఎల్ తెలిపింది. రిఫైనరీల సామర్థ్య విస్తరణ కోసం రూ.21,000 కోట్లు, మార్కెటింగ్ మౌలిక సదుపాయాల కోసం రూ.9,000 కోట్లు పెట్టుబడులు, జాయింట్ వెంచర్ రిఫైనరీ ప్రాజెక్టుల కోసం, సహజ వాయువు వ్యాపారం, చమురు అన్వేషణ కోసం మొత్తం రూ. 14,000 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నామని వివరించింది. ముంబై రిఫైనరీ వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 6.5 మిలియన్ టన్నులని, దీనిని 9.5 మిలియన్ టన్నులకు విస్తరించడానికి రూ.4,199 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నామని పేర్కొంది. అలాగే భటిండా రిఫైనరీ వార్షిక ఉత్పత్తి సామర్థ్యాన్ని 9 మిలియన్ టన్నుల నుంచి 11.25 మిలియన్ టన్నులకు పెంచడానికి మరో 35 కోట్ల డాలర్లు పెట్టుబడులు పెట్టనున్నామని వివరించింది. యూరో ఫైవ్/సిక్స్ ప్రమాణాలకనుగుణంగా ఉండే ఉత్పత్తుల తయారీకి ఈ పెట్టుబడులు తోడ్పడతాయని వివరించింది. పంజాబ్‌లోని భటిండా రిఫైనరీలో హెచ్‌పీసీఎల్‌కు, ప్రపంచ స్టీల్ దిగ్గజం ఆర్సెలర్ మిట్టల్ ప్రమోటర్ లక్ష్మీనాథ్ మిట్టల్‌కు చెరిసమానంగా భాగస్వామ్యం ఉంది. చరా పోర్ట్‌లో ఎల్ఎన్జీ దిగుమతి టెర్మినల్ ముంబైకి చెందిన మౌలిక రంగ దిగ్గజం షాపూర్జీ పల్లోంజీ గ్రూప్‌కు చెందిన ఎస్ పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి గుజరాత్‌లోని చరా పోర్ట్‌లో 5 మిలియన్ టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్థ్యం ఉన్న ఎల్ఎన్జీ ఇంపోర్ట్ టెర్మినల్‌ను ఏర్పాటు చేయనున్నామని హెచ్‌పీసీఎల్ తెలిపింది. రూ.5,411 కోట్ల ఈ ప్రాజెక్టుకు అవసరమైన నిధుల సమీకరణ పూర్తయిందని పేర్కొంది. నవీకరణ విద్యుదుత్పత్తిని రెట్టింపు(100 మెగావాట్లు) చేయనున్నామని వివరించింది. దేశవ్యాప్తంగా 13,561 పెట్రోల్ పంప్‌లు ఉన్నాయని, కొత్త పైప్లైన్ల నిర్మాణానికి, ఇంధన డిపోలు, ఎల్పీజీ ప్లాంట్ల కోసం రూ.1,782 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నామని వివరించింది. మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్, మహారాష్ట్రలోని లొని టెర్మినల్ ఇంధన డిపోలను పునర్వ్యస్థీకరిస్తున్నామని పేర్కొంది. కరీంనగర్‌తో పాటు షోలాపూర్(మహారాష్ట్ర), భోపాల్(మధ్యప్రదేశ్), పనఘర్(పశ్చిమ బెంగాల్)ల్లో కొత్త ఎల్పీజీ ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నామని హెచ్‌పీసీఎల్ తెలిపింది. -
పశ్చిమ తీరంలో భారీ రిఫైనరీ
రూ. 1.5 లక్షల కోట్ల పెట్టుబడులు న్యూఢిల్లీ: పశ్చిమ తీరంలో భారీ రిఫైనరీని ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వ రంగ చమురు దిగ్గజాలు ఐవోసీ, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్, ఈఐఎల్ చేతులు కలుపుతున్నాయి. ఇవి దాదాపు రూ. 1.5 లక్షల కోట్ల పెట్టుబడితో దేశంలోనే అతి పెద్ద రిఫైనరీని నెలకొల్పనున్నాయని చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. మహారాష్ట్రలో దాదాపు 60 మిలియన్ టన్నుల వార్షిక సామర్ధ్యంతో రెండు దశల్లో దీన్ని నిర్మించనున్నట్లు సోషల్ నెట్వర్కింగ్ సైట్ ట్వీటర్లో ఆయన తెలిపారు. తొలి దశలో రూ. 1 లక్ష కోట్ల పెట్టుబడులు ఉంటాయని, 40 మిలియన్ టన్నుల సామర్ధ్యంతో నిర్మాణం జరుగుతుందని మంత్రి వివరించారు. ఐవోసీఎల్ రిఫైనరీల్లో చాలా వరకూ ఉత్తరాదినే ఉన్నాయి. ఫలితంగా పశ్చిమ, దక్షిణ ప్రాం తాల కస్టమర్లకు సేవలు అందించడం కష్టమవుతున్నందున అనువైన ప్రదేశం కోసం అన్వేషించిన ఐవోసీఎల్ ఈ ప్రాంతాన్ని ఎంచుకుంది. ఈ రిఫైనరీలో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ, ఏటీఎఫ్ మొదలైనవి ఉత్పత్తి కానున్నాయి. -
ఇరాక్‌లో తారాస్థాయికి సంక్షోభం