న్యూఢిల్లీ: ఎనిమిది పరిశ్రమల కీలక ఇన్‌ఫ్రా గ్రూప్ వృద్ధి రేటు సెప్టెంబర్‌లో ఊరట నిచ్చింది. ఇది 5.2 శాతంగా నమోదయ్యింది. అంటే ఈ ఎనిమిది పరిశ్రమల ఉత్పత్తి విలువ 2016 సెప్టెంబర్‌తో పోలిస్తే 2017 సెప్టెంబర్‌లో 5.2 శాతం వృద్ధి చెందిందన్న మాట. గత ఏడాది సెప్టెంబర్‌లో ఈ వృద్ధిరేటు 5.3 శాతం.
మొత్తం పారిశ్రామిక ఉత్పత్తి సూచీలో (ఐఐపీ) ఈ ఎనిమిది రంగాల గ్రూప్ వాటా దాదాపు 30 శాతం. బొగ్గు, క్రూడ్ ఆయిల్, సహజ వాయువు, రిఫైనరీ ప్రొడక్టులు, ఎరువులు, స్టీల్, సిమెంట్, విద్యుత్ రంగాలు ఈ ఎనిమిది రంగాల్లో ఉన్నాయి. ఒక్క ఎరువుల విభాగం తప్ప, సెప్టెంబర్‌లో అన్ని విభాగాలూ వృద్ధి బాటనే ఉండడం గమనార్హం.
కాగా స్టీల్, సిమెంట్‌లో వృద్ధిబాటనే ఉన్నా, ఈ రేటు తగ్గింది. ఈ ఎనిమిది రంగాల తాజా సానుకూల ఫలితం ఈ నెల రెండవ వారం చివర్లో వెలువడే ఐఐపీ సెప్టెంబర్ గణాంకాలకు ప్లస్ అవుతుందని కొందరు నిపుణుల వాదన.
Comments
Please login to add a commentAdd a comment