itr form
-
ఐటీఆర్ ఫైలింగ్.. ఇవి గమనిస్తే మేలు
పన్ను రిటర్నులు దాఖలు (ఐటీఆర్)కు జులై 31 చివరి తేదీగా నిర్ణయించారు. సరైన అవగాహన లేకుండా, నిపుణుల సలహాలు తీసుకోకుండా ఐటీఆర్ ఫైల్ చేయడం కొంచెం కష్టమని పన్ను చెల్లింపుదారులు భావిస్తుంటారు. ఐటీఆర్ గడువు ముగుస్తుంటే కంగారుపడి ఆన్లైన్లో నమోదుచేసేపుడు ఒక్కోసారి పొరపాట్లు చేస్తారు. అలాచేసే తప్పులను సరిదిద్దుకునే అవకాశం ఉందని గుర్తించాలి. రివైజ్డ్ రిటర్నులు దాఖలు చేయడం ద్వారా వాటిని సవరించుకోవచ్చు. కానీ, అందుకు అదనంగా సమయం కేటాయించాలి. అది కొంత చికాకు పెట్టే అంశం. అందుకే తొలిసారి ఐటీఆర్ ఫైల్ చేసినపుడే జాగ్రత్త వహిస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఈ తరుణంలో రిటర్నులు దాఖలు చేసేటప్పుడు బ్యాంకు ఖాతా ధ్రువీకరణ, ఈ-వెరిఫై, మినహాయింపులు..వంటి కొన్ని అంశాల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.బ్యాంకు అకౌంట్ ధ్రువీకరణపన్ను చెల్లింపుదారులు ఐటీఆర్ దాఖలుకు ముందే ఈ-ఫైలింగ్ పోర్టల్‌లో తమ బ్యాంకు ఖాతాలను ధ్రువీకరించుకోవాలి. ట్యాక్స్ పేయర్ల ఖాతా యాక్టివ్గానే ఉందని ఇది నిర్ధరిస్తుంది. అప్పుడే రిఫండ్లు జమ చేసేందుకు వెసులుబాటు ఉంటుంది.ఈ-వెరిఫైఐటీఆర్ దాఖలు చేసిన తర్వాత దాన్ని పన్ను చెల్లింపుదారులు కచ్చితంగా ధ్రువీకరించాలి. అప్పుడే దాఖలు ప్రక్రియ పూర్తయినట్లు. లేదంటే రిటర్నులను పరిగణనలోకి తీసుకోరు. ఐటీఆర్ అప్లోడ్ చేసిన 30 రోజుల్లోగా దాన్ని వెరిఫై చేయాల్సి ఉంటుంది. ఐటీఆర్ దాఖలు చేసి తప్పకుండా వెరిఫై చేయాలి.మినహాయింపులు ఇలా..ఆదాయపు పన్ను మినహాయింపుల్లో భాగంగా సెక్షన్ 80సీ నిబంధనల ప్రకారం వివిధ పెట్టుబడి పథకాల్లో మదుపు చేసి, రూ.1,50,000 వరకూ వెసులుబాటు పొందవచ్చు. ఈపీఎఫ్, పీపీఎఫ్, ఈఎల్ఎస్ఎస్, హోమ్‌లోన్ అసలు, పిల్లల ట్యూషన్ ఫీజులు, జీవిత బీమా పాలసీలకు చెల్లించే ప్రీమియం తదితరాలన్నీ ఈ సెక్షన్ పరిధిలోకే వస్తాయి. సెక్షన్ 80డీలో ఆరోగ్య బీమా ప్రీమియం వివరాలు నమోదు చేయాలి. సేవింగ్స్ ఖాతా ద్వారా వచ్చిన వడ్డీ ఆదాయంపై రూ.10,000 వరకు 80టీటీఏ కింద మినహాయింపు కోరవచ్చు. అలాగే వేతనంలో హెచ్ఆర్ఏ లేనట్లయితే అద్దె చెల్లింపులకు 80జీజీ కింద మినహాయింపు ఉంటుంది.ఆదాయాలన్నీ చెప్పాల్సిందే..చాలామంది పన్ను చెల్లింపుదారులు అదనపు మార్గాల ద్వారా వచ్చే ఆదాయాన్ని ఐటీఆర్‌లో చూపించరు. వడ్డీ, కమిషన్ వంటి వాటినుంచి వచ్చే ఇన్‌కమ్‌ను వదిలేస్తుంటారు. వీటన్నింటిపై టీడీఎస్ కట్ చేసి ఉంటారనే ఉద్దేశంతో అవసరం లేదనుకుంటారు. కానీ, ఐటీఆర్‌లో ప్రతీ ఆదాయ మార్గాన్ని పేర్కొనాల్సిందే.గడువు పూర్తయితే..ఐటీఆర్ ఫైలింగ్‌ను గడువులోగా పూర్తి చేయాలి. లేదంటే రూ.1,000 నుంచి రూ.5,000 వరకు జరిమానా చెల్లించాల్సి వస్తుంది. ఆడిట్ అవసరం లేని వ్యక్తులు జులై 31 వరకూ రిటర్నులు దాఖలు చేయాలి.ఇదీ చదవండి: ఉద్యోగులకు ఈ ఫారం తప్పనిసరి!అన్ని పత్రాల పరిశీలనకొన్నిసార్లు ఇన్‌కమ్‌ట్యాక్స్ వివరాలు, ఫారం-16లోని వివరాలు ఒకేలా ఉండకపోవచ్చు. మీ వద్ద వసూలు చేసిన పన్నును ఆదాయపు పన్ను విభాగానికి జమ చేయకపోవడం వల్ల ఈ వ్యత్యాసం కనిపిస్తుంది. రిటర్నులు దాఖలు చేసేముందు మీ ఫారం-16, ఫారం 16ఏ, 26ఏఎస్, వార్షిక సమాచార నివేదిక (ఏఐఎస్)లను పూర్తిగా పరిశీలించాలి. ఏదైనా తేడా ఉంటే మీరు పనిచేసే యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లి, సరిచేసుకోవాలి. -
ఐటీఆర్ దాఖలు చేస్తున్నారా.. ఏ ఫారం ఎవరికంటే..
పన్ను రిటర్నులు దాఖలు (ఐటీఆర్)కు జులై 31 చివరి తేదీగా నిర్ణయించారు. సరైన అవగాహన లేకుండా, నిపుణుల సలహాలు తీసుకోకుండా ఐటీఆర్ ఫైల్ చేయడం కొంచెం కష్టమని పన్ను చెల్లింపుదారులు భావిస్తుంటారు. ఐటీఆర్ గడువు ముగుస్తుంటే కంగారుపడి వాటిని ఎంచుకోవడంలో ఒక్కోసారి పొరపాట్లు చేస్తారు. అలాచేసే తప్పులను సరిదిద్దుకునే అవకాశం ఉందని గుర్తించాలి. రివైజ్డ్ రిటర్నులు దాఖలు చేయడం ద్వారా వాటిని సవరించుకోవచ్చు. కానీ, అందుకు అదనంగా సమయం కేటాయించాలి. అది కొంత చికాకు పెట్టే అంశం. అందుకే తొలిసారి ఐటీఆర్ ఫైల్ చేసినపుడే జాగ్రత్త వహిస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఈతరుణంలో రిటర్నులు దాఖలు చేసేటప్పుడు ఎలాంటి ఆదాయాలు ఉన్నవారు ఏయే ఫారాలు ఎంచుకోవాలో ఈ కథనంలో తెలుసుకుందాం.సరైన ఫారం ఎంపికఆదాయపన్ను రిటర్నులు దాఖలు చేసే పన్నుదారులకు కేంద్ర ప్రత్యక్ష పన్నుల విభాగం(సీబీటీటీ) మొత్తం ఏడు రకాల ఫారాలను నోటిఫై చేసింది. వీటిలో పన్నుదారులు వారి ఆదాయమార్గాలకు అనుగుణంగా ఏది సరైందో చూసి ఎంచుకోవాలి. కొత్త పన్ను శ్లాబును ఎంచుకున్నవారి వేతనం రూ.7.5లక్షల కంటే ఎక్కువ వార్షిక వేతనం ఉండి, ఒక ఇంటిపై ఆదాయం, వడ్డీ, వ్యవసాయ రాబడి రూ.5000 కంటే తక్కువ..వంటి తదితర మార్గాల్లో అదనంగా ఆదాయం వస్తున్నప్పుడు ఐటీఆర్-1 దాఖలు చేయొచ్చు.ఐటీఆర్-2వ్యక్తిగతంగా లేదా హిందూ అవిభాజ్య కుటుంబాలకు చెందిన పన్నుదారులు దాఖలు చేయవచ్చు.నిబంధనల ప్రకారం వేతనం ఉండాలి.ఒకటికంటే ఎక్కువ ఇళ్లు ఉన్నవారు ఎంచుకోవాలి.ఎలాంటి వ్యాపార ఆదాయం ఉండకూడదు.వ్యవసాయ ఆదాయం ఎంతైనా ఉండవచ్చు. అయితే ఐటీఆర్ సమయంలో వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది.ఇతరమార్గాల ద్వారా వచ్చే మూలధన రాబడులపై ట్యాక్స్ చెల్లిస్తుండాలి.ఐటీఆర్ 3వ్యక్తిగతంగా లేదా హిందూ అవిభాజ్య కుటుంబాలు, సంస్థల్లో భాగస్వామ్యం కలిగిఉన్న పన్నుదారులు ఈ ఫారం దాఖలు చేయవచ్చు.నిబంధనల ప్రకారం వేతనం ఉండాలి. ఒకటి కంటే ఎక్కువ ఇళ్లు ఉండాలి.వ్యాపార ఆదాయం ఉండవచ్చు.వ్యవసాయ ఆదాయం ఎంతైనా ఉండవచ్చు. అయితే ఐటీఆర్ సమయంలో వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది.ఇతరమార్గాల ద్వారా వచ్చే మూలధన రాబడులపై ట్యాక్స్ చెల్లిస్తుండాలి.ఐటీఆర్-4వ్యక్తిగతంగా లేదా హిందూ అవిభాజ్య కుటుంబాలు, సంస్థల్లో భాగస్వామ్యం కలిగిఉన్న పన్నుదారులు ఈ ఫారం దాఖలు చేయవచ్చు.నిబంధనల ప్రకారం వేతనం ఉండాలి.ఒక ఇల్లు మాత్రమే ఉండాలి.వ్యాపార ఆదాయం ఉండవచ్చు. కానీ మీ మొత్తం ఆదాయంలో బిజినెస్ టర్నోవర్ 8 శాతానికి మించి ఉండకూడదు.వ్యవసాయ ఆదాయం రూ.5000లోపు ఉండాలి. అయితే ఐటీఆర్ సమయంలో వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది.ఇతరమార్గాల ద్వారా వచ్చే మూలధన రాబడులపై ట్యాక్స్ చెల్లించకూడదు.ఇదీ చదవండి: పన్నుదారులు తెలుసుకోవాల్సినవి..ఐటీఆర్-5ఒకరికంటే ఎక్కువమంది కలిసి ఏదైనా వ్యాపారంసాగిస్తే ఈ ఫారం దాఖలు చేయవచ్చు.ఎలాంటి వేతన ఆదాయం ఉండకూడదు.ఒకటికంటే ఎక్కువ ఇళ్లు ఉండవచ్చు.వ్యాపార ఆదాయం ఉండాలి.ఇతరమార్గాల ద్వారా ఆదాయం ఉండవచ్చు.కంపెనీలు దాఖలు చేసే ఫారం ఐటీఆర్-6. ఐటీఆర్ 7 ఫారాన్ని ట్రస్టులు అవి చెల్లించిన ఆదాయాన్ని రిటర్ను చేసుకోవడానికి దాఖలు చేస్తాయి. -
ఆన్లైన్లో రిటర్న్ వేస్తున్నారా!
గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రిటర్న్‌లు దాఖలు చేయాల్సిన సమయం వచ్చింది. ఏ వ్యక్తయినా రిటర్న్ వేసే ముందు తనకు సంబంధించిన ఆదాయ వివరాల పట్టికను తయారు చేసుకోవాలి. అంటే తనకు వచ్చిన ఆదాయం, వివరాలు దానికి సంబంధించిన ఎగ్జంప్షన్లు, డిడక్షన్ల వివరాలన్నీ తీసుకుని తనకు వచ్చిన మొత్తం ఆదాయం ఎంత? అందులో ఎంత మొత్తానికి పన్ను వర్తిస్తుంది? ఎంత పన్ను చెల్లించాల్సి ఉంది? అనే విషయాలు పొందుపరచాలి. ఇలా ఒక అవగాహనకు వచ్చాక రిటర్న్ దాఖలు చేయొచ్చు. కొన్ని నిర్ధిష్ట పరిస్థితుల్లో తప్ప రిటర్న్ ఆన్లైన్లో, భౌతికంగా రెండు విధాలుగా వేయొచ్చు. కానీ ఆన్లైన్లో వేయటం శ్రేయస్కరం. ఆన్లైన్లో దాఖలు చేసేదిలా... అసెస్సీ తన ఆదాయ, పన్ను వివరాలను ఒక పట్టికలో పొందుపరిచాక ఇన్కమ్ ట్యాక్స్ ఇండియా ఈఫైలింగ్.జీవోవీ.ఇన్ అనే వెబ్సైట్ ద్వారా తనకు సంబంధించిన ఐటీఆర్ ఫారాన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. అంటే వేతనదారులకు ఐటీఆర్-1, వ్యాపారం ద్వారా ఆదాయం ఉన్న వారికి ఐటీఆర్-4 తదితరాలు. ప్రస్తుతం ఐటీఆర్ ఎక్సెల్ , జావా యుటిలిటీ రెండు విధాలుగా అందుబాటులో ఉంది. ఆసెసిలు ఈ రెండింటిలో ఏదైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేశాక దాన్ని మీ సిస్టంలో సేవ్ చేయాలి. తరవాత ఐటీఆర్ ఫారంలో వివరాలను పొందుపరచాలి. ప్రతి ఐటీఆర్ ఫారంలో మీ పేరు, చిరునామా, పాన్ నంబరు, అడ్రస్, బ్యాంకు ఖాతా వివరాల వంటివి పొందుపరచాలి. తరువాత మీ ఆదాయ వివరాలను రాయాలి. మీకు వర్తించే డిడక్షన్లు ఏమైనా ఉంటే వాటి వివరాలు కూడా తెలియ చేయాలి. మీకు సంబంధించిన టీడీఎస్ , సెల్ఫ్ అసెస్మెంట్ ట్యాక్సు వివరాలను కూడా పొందుపరచాలి. మీరు తయారు చేసుకున్న పట్టిక ఆధారంగా పై వివరాలు తెలియజేయాలి. రిప్రజెంటేటివ్ ద్వారా రిటర్న్ దాఖలు చేసేట్లయితే వారి వివరాలు కూడా తెలపాలి. ఆఖర్లో మీకు వర్తించే ట్యాక్సు లేదా రిఫండ్ మొత్తాన్ని సరి చూసుకోవాల్సి ఉంటుంది. కంపెనీలైతే రిటర్న్ సబ్మిట్ చేసేముందు డిజిటల్ సిగ్నేచర్ చేయాలి. మిగిలిన వారు జావా యుటిలిటిలో ఐటీఆర్ నింపి... ఐటీఆర్‌లోనే సబ్మిట్ చేయొచ్చు. ఆదాయపు పన్ను శాఖ వారు కొత్తగా ఆధార్ నంబరుతో లింక్ చేస్తున్నారు. ఆధార్‌తో లింక్ అయిన ఆసెిస్సీలు ఓటీపీ ద్వారా తమ రిటర్న్‌ని ఈ వెరిఫై చేసుకోవచ్చు. లేకపోతే ఐటీఆర్- అనే అక్నాలెడ్జ్మెంట్ డౌన్లోడ్ చేసుకొని, దానిపై సంతకం చేసి, దాని కింది భాగంలో పేర్కొన్న ‘సీపీసీ బెంగళూరు’ చిరునామాకి పోస్టు ద్వారా పంపాలి. పైన తెలిపిన రెండు పద్ధతులు కాకుండా నెట్‌బ్యాంకింగ్ లాగిన్ ద్వారా ఈ వెరిఫై చేయవచ్చు. ఒకవేళ సీపీసీ బెంగళూరుకు పంపితే రిటర్న్ ఫైల్ చేసిన 120 రోజుల లోపు పంపించాలి. - కె.సీహెచ్. ఎ.వి.ఎస్.ఎన్ మూర్తి, కె.వి.ఎన్ లావణ్య ట్యాక్సేషన్ నిపుణులు -
ఉద్యోగులూ!! రిటర్న్‌లు వేద్దామా?
గడిచిన ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వేతనదారులు తమ సంపాదనపై రిటర్న్‌లు దాఖలు చేయాల్సిన అవసరం ఉంది. దీనికి సంబంధించి వేతనదారులు ఐటీఆర్-1 లేదా ఐటీఆర్-2 ఫారమ్‌లను వినియోగించాల్సి ఉంటుంది. కేవలం వేతనం మాత్రమే ఆదాయంగా ఉన్నా, దీంతో పాటు ఇంటి మీద అద్దెల రూపంలో ఆదాయం ఉన్నా ఐటీఆర్-1ను వినియోగించాలి. ఒకవేళ ఒకటి కంటే ఎక్కువ ఇళ్లపై ఆదాయం ఉన్నవారు ఐటీఆర్-2 వినియోగించవచ్చు. ఈ ఐటీఆర్ ఫారంలను ఇన్కమ్ ట్యాక్స్ ఇండియా ఈ ఫైలింగ్ వెబ్సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. అలాగే రిటర్న్‌లను ఆన్లైన్ ద్వారా లేదా ఆఫ్‌లైన్ ద్వారా కూడా వేసుకోవచ్చు. ఈ రిటర్న్‌లు దాఖలు చేయడానికి జూలై 31 చివరి తేదీ. ఒక ఆర్థిక సంవత్సరంలో ఒకటి కంటే ఎక్కువ కంపెనీల్లో ఉద్యోగం చేసి ఉంటే వారు కూడా ఐటీఆర్-1 దాఖలు చేయొచ్చు. వేతనంతో పాటు వడ్డీ ఆదాయం అంటే బ్యాంకు డిపాజిట్లు లేదా సేవింగ్స్ ఖాతాపై వచ్చే వడ్డీ ఆదాయం ఉన్నా వీటిని ఐటీఆర్-1లోనే చూపించొచ్చు. ఇలా నింపండి.. ముందుగా మీ ఆదాయ వివరాలను బట్టి ఐటీఆర్-1 లేదా ఐటీఆర్-2ను డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో మొదట మీ వ్యక్తిగత వివరాలైన ఫోన్ నంబర్, ఈ మెయిల్‌తో సహా అన్నీ నింపండి. మీరు వేస్తున్న రిటర్న్ ఒరిజనలా లేక రివైజ్డా అనేది స్పష్టంగా తెలియజేయాలి. అలాగే మీరు రెసిడెంటా? లేక నాన్ రెసిడెంటా?, ప్రభుత్వ ఉద్యోగా లేక ప్రైవేటు ఉద్యోగా? అనేది తెలియజేయటంతో పాటు ఆధార్ నంబర్ ఇవ్వాలి. వీటితో పాటు మీ ట్యాక్స్ స్టేటస్ కూడా తెలియచేయాలి. వీటి తర్వాత మీ ఆదాయ వివరాలు... అంటే వేతనం మరియు ఇంటి అద్దె వంటి ఇతర ఆదాయ వివరాలను తెలియచేయాలి. ఆ తరువాత చాప్టర్ ఆరు ఏ కింద ఏమైనా డిడక్షన్స్ ఉంటే వాటి వివరాలు తెలియజేయండి. గడువు తేదీలోగా రిటర్నులు దాఖలు చేయడం వల్ల అనేక ప్రయోజనాలుంటాయి. ఒక వేళ మీ పన్ను భారం రూ. 10,000కు మించి ఉంటే సెక్షన్ 234ఏ, 234 బీ, 234 సీ వల్ల పడే వడ్డీ కట్టవలసిన అవసరం ఉండదు. మీ మొత్తం ఆదాయం (వేతనం + ఇతర ఆదాయాలు) రూ. 5 లక్షలు మించకుండా ఉంటే సెక్షన్ 87ఏ కింద పన్ను భారంలో రూ. 2,000 రిబేటు పొందవచ్చు. ఒకవేళ మీ ఆదాయం రూ.5 లక్షలు దాటితే మాత్రం తప్పనిసరిగా ఆన్లైన్లోనే ఫైల్ చేయాల్సి ఉంటుంది. అయిదు లక్షల లోపు ఉంటే ఆన్లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో మీ వీలును బట్టి రిటర్న్‌లు దాఖలు చేసుకోవచ్చు. పన్ను భారంపై 3 శాతం సెస్ చెల్లించాల్సి ఉందన్న విషయం మర్చిపోవద్దు. పన్ను వివరాలు... మీరు పనిచేస్తున్న కంపెనీ ఇచ్చే ఫారం-16 ద్వారా టీడీఎస్ రూపంలో ఎంత పన్ను రికవరీ చేశారో తెలుసుకోవచ్చు. కాబట్టి కంపెనీ నుంచి ఫారం-16 తీసుకోవడం మర్చిపోవద్దు. వేతనం కాకుండా ఇతర ఆదాయాలపై టీడీఎస్ రికవరీ చేస్తే దానికి సంబంధించి ఫారం 16ఏ తప్పనిసరిగా తీసుకోవాలి. అలా కాకుండా మీకు టీడీఎస్ రికవరీ చేయని పక్షంలో సొంతంగా పన్ను భారం చెల్లించాల్సి వస్తే సెల్ఫ్ అసెస్మెంట్ టాక్స్‌గా చెల్లించాలి. అలా చెల్లించగా వచ్చిన చలానా వివరాలను ఐటీఆర్ ఫారంలో పొందుపర్చాలి. ఫారం-16, ఫారం-16ఏలో ‘ట్యాన్’ మరియు యజమాని వివరాలను సరైన పద్ధతిలో పొందుపర్చాలి. చివరగా.. మీ పన్ను భారం, చెల్లించిన పన్ను వివరాలు అన్నీ సరిగా ఉన్నాయా లేదా సరిచూసుకోండి. అలాగే మీ వ్యక్తిగత బ్యాంక్ ఖాతాల వివరాలు (ఒకటి అంతకంటే ఎక్కువ) తెలియచేయాలి. వీటితో పాటు ఏదైనా సంస్థకు గాని, ట్రస్ట్‌కు గాని విరాళం ఇచ్చినచో వాటి వివరాలను 80జీ కాలమ్‌లో పొందుపర్చాలి. విరాళం ఇచ్చిన వారి పాన్ నంబర్, మరియు చిరునామా తప్పకుండా పొందుపర్చాలి. ఇలా విరాళం ఇచ్చి ఉంటే పన్ను భారం తగ్గుతుంది. గడువు తేదీలోగా రిటర్న్ దాఖలు చేయండి నిశ్చింతగా ఉండండి. కె.సీహెచ్.ఎ.వి.ఎస్.ఎన్ మూర్తి,కె.వి.ఎన్ లావణ్య ట్యాక్సేషన్ నిపుణులు -
కొత్త ఐటీఆర్ ఫారమ్‌లు వచ్చాయ్
న్యూఢిల్లీ: సరళీకరించిన కొత్త ఆదాయపు పన్ను రిటర్ను ఫారాల(ఐటీఆర్)ను కేంద్ర ఆర్థిక శాఖ ఆదివారం అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ కొత్త ఐటీఆర్-2, 2ఏలను మూడు పేజీలకు కుదించామని, ఇతర వివరాలను షెడ్యూల్స్‌లో నింపాల్సి ఉంటుందని ఆర్థిక శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. వివాదాస్పద విదేశీ ప్రయాణాలు, లావాదేవీలు జరగని(డార్మంట్) బ్యాంక్ ఖాతాల వివరాల వెల్లడి నిబంధనను ఈ కొత్త ఫారాల నుంచి తొలగించారు. అదేవిధంగా రిటర్నుల దాఖలుకు ఆగస్టు 31 వరకూ గడువు పొడిగించారు. ప్రతియేటా ఈ గడువు జూలై 31 వరకూ ఉంటున్న సంగతి తెలిసిందే. మూలధన లాభాలు, వ్యాపారం/వృత్తి లేదా విదేశీ ఆస్తులు/ఆదాయం లేని వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులు, హిందూ అవిభాజ్య కుటుంబాలు(హెచ్‌యూఎఫ్) కొత్త ఐటీఆర్ 2ఏ ఫారాన్ని ఉపయోగించుకోవచ్చని ప్రకటనలో పేర్కొన్నారు. కాగా, అసెస్సీలకు పాస్‌పోర్టు గనుక ఉంటే ఆ నంబర్‌ను మాత్రం తెలియజేయాల్సి ఉంటుందని ఆర్థిక శాఖ తెలిపింది. గతేడాలో అసెస్సీ కలిగివున్న కరెంట్/సేవింగ్స్ అకౌంట్ నంబర్, ఐఎఫ్ఎస్ కోడ్‌ను రిటర్నుల్లో పేర్కొన్నాలని.. అయితే, అకౌంట్స్‌లో బ్యాలెన్స్ ఎంతుందనేది వెల్లడించక్కర్లేదని ప్రకటనలో పేర్కొన్నారు. కాగా, ఆన్లైన్లో రిటర్నుల దాఖలుకు సంబంధించి సాఫ్ట్‌వేర్‌ను సిద్ధం చేస్తున్నామని.. జూన్ మూడో వారం నుంచి ఇది అసెస్సీలకు అందుబాటులోకి వస్తుందని ఆర్థిక శాఖ పేర్కొంది. -
రిఫండ్ తీసుకోవచ్చిలా..
టీమ్ లీడర్‌గా సంజనకి ప్రమోషన్ రావడంతో ఆఫీసులో పని ఒత్తిడి బాగా పెరిగింది. తన టీమ్‌ను మొదటి స్థానంలో నిలబెట్టాలనే ఆలోచనలో తన సొంత పనులపై నిర్లక్ష్యం చూపించింది. దీంతో ఏప్రిల్ నెల జీతం సగానికి సగం తగ్గిపోయింది. అకౌంట్స్ డిపార్ట్మెంట్కి వెళ్లి అడిగితే టీడీఎస్ వల్ల జీతం తగ్గిందన్నారు. పిల్లలకు చెల్లించిన ట్యూషన్‌ఫీజులు, సేవింగ్స్ ఉన్నా.. వాటిని సకాలంలో ఆఫీసులో ఇవ్వకపోవడంతో టీడీఎస్‌కి గురయింది. మరి ఇప్పుడేం చెయ్యాలి అని ఆఫీసులో అడిగితే రిటర్నులు దాఖలు చేస్తే ఈ మొత్తం రిఫండ్ వస్తుందన్నారు. ఒక్క సంజనే కాదు చాలామంది సకాలంలో రశీదులు ఇవ్వక టీడీఎస్ బారినపడతారు. ఇలా అధికంగా పన్ను చెల్లించిన వారు రిటర్నులు దాఖలు చేసుకోవడం ద్వారా ఈ మొత్తాన్ని వెనక్కి తీసుకోవచ్చు. రిఫండ్ ఎలా తీసుకోవాలన్న దానిపై అవగాహన కల్పించేదే ఈ వారం ప్రాఫిట్ లీడ్ స్టోరీ... గత ఆర్థిక సంవత్సరంలో ఆదాయం కంటే అధికంగా పన్నులు చెల్లించినవారు ఆందోళన చెందనవసరం లేదు. ఆదాయపు పన్ను శాఖకి రిటర్నులు దాఖలు చేయడం ద్వారా వీటిని వెనక్కి తీసుకోవచ్చు. దీన్నే రిఫండ్‌గా వ్యవహరిస్తారు. మీరు రిటర్నులు దాఖలు చేస్తున్నప్పుడు దానిపైన రిఫండ్ అని తప్పనిసరిగా పేర్కొనాలి. అంతేకాదు... మీ బ్యాంకు అకౌంట్ నం బర్, ఐఎఫ్ఎస్సీ కోడ్ తదితర వివరాలన్నీ పేర్కొంటే రిఫండ్ నేరుగా మీ అకౌంట్లోకి వచ్చేస్తుంది. ఒకవేళ రిటర్ను దాఖలు చేసినప్పుడు రిఫండ్ అని పేర్కొనకపోతే.. ఫాం 30ని ఉపయోగించి రిఫండ్ పొందవచ్చు. సాధారణంగా రిటర్నులు దాఖలు చేసిన తర్వాత మూడు నాలుగు నెలల్లో రిఫండ్ మొత్తం మీ ఖాతాలోకి వచ్చేస్తుంది. తొందరగా రిఫండ్ రావాలంటే... మీ సేవింగ్స్, పన్ను మినహాయింపులు లభించే వివరాలను పూర్తిగా పేర్కొని ఆన్లైన్ ద్వారా రిటర్నులు దాఖలు చేయండి. ఇప్పుడు ఆన్లైన్లో మీ రిఫండ్ స్టేటస్‌ను కూడా ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. ఒకవేళ రిఫండ్ ఆలస్యమైతే.. మీ అసెస్మెంట్ ఆఫీసర్‌ను సంప్రదించొచ్చు.. లేదా ఇన్‌కమ్‌ట్యాక్స్ అంబుడ్స్‌మెన్‌కి ఫిర్యాదు చేయొచ్చు. టీడీఎస్ అంటే ఆదాయం కంటే అధికంగా పన్ను చెల్లించే వారిలో అత్యధికంగా ఉద్యోగులు, వ్యాపారులు, వృత్తి నిపుణులు ఉంటారు. వీరంతా టీడీఎస్ రూపంలో ఎప్పటికప్పుడు పన్ను చెల్లించేస్తుంటారు. దీన్నే మూలం వద్ద పన్ను (ట్యాక్స్ డిడక్షన్ ఎట్ సోర్స్-టీడీఎస్) అంటారు. ఆదాయ పన్ను పరిధిలోకి వచ్చిన ఉద్యోగులు ప్రతి నెలా టీడీఎస్ రూపంలో ముందస్తుగా పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఉదాహరణకి రూ.24,000 పన్ను చెల్లించాల్సి ఉంటే ఈ మొత్తం ఒకేసారి కాకుండా ప్రతి నెలా రూ.2,000 చొప్పున టీడీఎస్ రూపంలో జీతంలోంచి కోత పెడుతుంటారు. అలాగే చాలా వ్యాపారాలు, కమీషన్ ఆదాయం ఉన్న వాళ్ళు తప్పని సరిగా 10 శాతం టీడీఎస్ చెల్లించాల్సి ఉంటుంది. ఎందుకు ఎక్కువ పన్ను కోస్తారు? ఆదాయ పన్ను భారం నుంచి తప్పించుకోవడానికి సేవింగ్స్, వ్యయాల రూపంలో అనేక అవకాశాలున్నాయి. వీటి వివరాలన్నీ ప్రతి ఏడాది ముందుగానే మనం పనిచేస్తున్న ఆఫీసులో ఇవ్వాలి. వీటిని పరిగణనలోకి తీసుకొని ఆదాయపు పన్ను లెక్కించి ఆ మేరకు టీడీఎస్‌ను నిర్ణయిస్తారు. ఒకవేళ పని ఒత్తిడిలో పడి, లేక వీలుకాక సేవింగ్స్ వివరాలు ఇవ్వకపోతే ఆఫీసు వాళ్లు ఎక్కువ టీడీఎస్‌ను విధిస్తారు. అలాగే బ్యాంకులో వడ్డీ ఆదాయం ఏడాదికి రూ.10,000 దాటితే టీడీఎస్ వర్తిస్తుంది. మీరు పన్ను పరిధిలోకి రాకున్నా ఇలా టీడీఎస్ చెల్లించాల్సిందే. ఈ మొత్తాన్ని తర్వాత రిటర్నులు దాఖలు చేసి రిఫండ్ తీసుకోవాలి. అధికంగా క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ చెల్లిం చినవారు, వ్యాపారంలో నష్టం వచ్చిన వారు ఆ వివరాలను దాఖలు చేయ డం ద్వారా అధికంగా చెల్లించిన పన్నుని వెనక్కి తీసుకోవచ్చు. - సాక్షి పర్సనల్ ఫైనాన్స్ విభాగం ఈ-ఫైలింగ్ ఆన్లైన్ ద్వారా రిటర్నులు దాఖలు చేయవచ్చు. నేరుగా యూజర్ ఐడీ క్రియేట్ చేసుకోవడం ద్వారా రిటర్నులు దాఖలు చేయొచ్చు. https://incometaxindiaefiling.gov.in వెబ్‌సైట్‌ను దర్శించి మీకు సంబంధించిన ఐటీఆర్ ఫామ్‌ను డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో మీ ఆదాయ వివరాలు, సేవింగ్స్, టీడీఎస్, పన్ను చెల్లింపులు తదితర వివరాలన్నీ పూర్తి చేయండి. అలాగే బ్యాంకు అకౌంట్ వివరాలను ఇవ్వడం మర్చిపోవద్దు. వివరాలన్నీ ఇచ్చిన తర్వాత ఎక్స్ఎంఎల్ ఫైల్‌ను జనరేట్ చేయండి. ఈ ఫైల్‌ను అప్లోడ్ చేసి సబ్మిట్ చేస్తే సరిపోతుంది. అప్పుడు ఐటీఆర్-వి ఫామ్‌ను ప్రింట్ తీసుకొని బెంగళూరులోని కేంద్ర ఆఫీసుకు 120 రోజుల్లోగా అందేటట్లు పంపించండి. ఏ ఫారం ఎవరికి ఐటీఆర్1 : జీతం, వడ్డీ, కుటుంబ పెన్షన్ ఆదాయం ఉన్న వారికి ఐటీఆర్ 2 : మూలధన లాభాలు, ఇంటి అద్దె ఆదా యంగా ఉన్న వారికి ఇది. ఈ ఆదాయా లతో పాటు జీతం కూడా ఉన్నా ఇదే. హిందూ అవిభక్త కుటుంబానికీ ఇదే. ఐటీఆర్ 3 : భాగస్వామ్య వ్యాపారస్తులకు ఐటీఆర్ 4 : వృత్తినిపుణులు, వ్యాపారస్తులకు.