కొత్త ఐటీఆర్ ఫారంలు వచ్చేశాయ్
న్యూఢిల్లీ : ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయడానికి కొత్త ఐటీఆర్ ఫారాలను కేంద్ర ఆర్థిక శాఖ విడుదల చేసింది. 2015-16 అసెస్‌మెంట్ ఇయర్‌కి (2014-15 ఆర్థిక సంవత్సరం) సంబంధించి రిటర్నులు సులభంగా దాఖలు చేసే విధంగా మూడు పేజీలతో కూడిన ఐటీఆర్ ఫారంలు సోమవారం సాయంత్రం నుంచి అందుబాటులోకి వచ్చినట్లు కేంద్ర ఆర్థిక శాఖ విడుదల చేసిన గెజిట్‌లో పేర్కొంది. గతంలో ఐటార్2ఏ ఫారంను పూర్తి చేయడానికి 15 పేజీలు నింపాల్సి ఉండటంతో దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే.
దీంతో పేజీల సంఖ్యను మూడుకు తగ్గిస్తూ ఐటీఆర్ ఫారంలను సరళీకరించడం జరిగింది. ఐటీఆర్ ఫారంల విడుదల జాప్యం కావడంతో రిటర్నుల దాఖలు గడువును ఆగస్టు 31 వరకు పొడిగించారు.