ఆదాయపు పన్ను శాఖ 2024-25 అసెస్‌మెంట్ ఇయర్‌కు సంబంధించిన ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ (ITR) ఫారాలు - 1, 4 లను విడుదల చేసింది. రూ. 50 లక్షల వరకు ఆదాయం ఉన్న హిందూ అవిభక్త కుటుంబాలు, వ్యక్తులు, సంస్థలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023-24)లో ఆర్జించిన ఆదాయానికి రిటర్న్‌లను దాఖలు చేయడం ప్రారంభించవచ్చు.
ఒక నిర్దిష్ట ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఐటీఆర్ ఫారాలను సాధారణంగా మార్చి చివరిలో లేదా ఏప్రిల్ ప్రారంభంలో ప్రకటిస్తారు. అయితే, ఈ సంవత్సరం మాత్రం డిసెంబర్‌లోనే ఐటీఆర్ ఫారాలను ప్రకటించారు. దీంతో పన్ను చెల్లింపుదారులకు ముందస్తుగా ఐటీఆర్ దాఖలు చేయడానికి వీలు కలిగింది.
ఏ ఫారం ఎవరికి?
ఐటీఆర్ ఫారం-1 (సహజ్), ఐటీఆర్ ఫారం-4 (సుగమ్) అనేవి పెద్ద సంఖ్యలో ఉండే చిన్న, మధ్య స్థాయి పన్ను చెల్లింపుదారుల కోసం ఉద్దేశించిన సరళీకృత ఫారాలు. వీటిలో జీతాలు, ఇళ్లు, వడ్డీలు, వ్యయసాయం తదితర మార్గాల ద్వారా రూ. 50 లక్షల వరకు ఆదాయం కలిగిన వ్యక్తులకు ఫారం-1 వర్తిస్తుంది. ఇక వ్యాపారం, వృత్తి మార్గాల ద్వారా రూ. రూ. 50 లక్షల వరకు ఆదాయం ఆర్జించేవారు ఫారం-4 ద్వారా రిటర్న్స్ దాఖలు చేస్తారు.
Comments
Please login to add a commentAdd a comment