Deadline 31
-
ఐటీ రిటర్న్ గడువులోగా ఫైల్ చేయండి..లేదంటే?
ITR filing deadline July 31: ఆదాయపు పన్ను చట్టాల ప్రకారం, ఐటీఆర్ ఫైలింగ్ అనేది దేశంలోని ప్రతి బాధ్యతగల పౌరుని విధి. ఆదాయ పన్ను రిటర్న్‌లను దాఖలు చేసేందుకు జులై 31 ఆఖరు తేదీ. ఈ ఏడాది డెడ్‌లైన్‌ను పొడిగించే అవకాశం ఉందనే ఊహాగానాలున్నప్పటికీ, ఆ ఉద్దేశం లేదని ఆర్థిక మంత్రిత్వశాఖ, ఆదాయపు పన్నుశాఖ అధికారులు ఇప్పటికే స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పన్ను చెల్లింపుదారులు రిటర్న్‌లను దాఖలును కచ్చితంగా చేయాల్సిందే. గడువు పెంచుతారో తెలియదు గానీ, ఐటీఆర్ లను దాఖలు చేయకపోతే మాత్రం భారీ జరిమానా, ఒక్కో సందర్భంలో జైలు శిక్షపడే అవకాశాలు మాత్రం ఉన్నాయి. ఐటీ వర్గాలు హెచ్చరికలను దృష్టిలో పెట్టుకుని చివరి నిమిషం వరకు వెయిట్ చేయకుండా గడువు లోపు ఐటీ రిటర్న్స్‌ను ఫైల్ చేయడం ఉత్తమం. అలా కాని పక్షంలో ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందో ఒకసారి చూద్దాం. జరిమానా జులై 31తో ఐటీఆర్‌లను ఫైల్ చేయలేకపోయినవారికి ఒక చిన్న వెసులు బాటు ఉంది. సాధారణంగా జరిమానాతో దాఖలు చేసేందుకు కొంత గడువు ఉంటుంది. పన్ను చెల్లించాల్సిన అవసరం ఉన్నట్లయితే, పన్ను చెల్లింపుదారులు ITR ఫైల్ చేసే వరకు గడువు తేదీ ముగిసిన తర్వాత నెలకు 1 శాతం వడ్డీని వసూలు చేస్తారు. ఐటీచట్టం 1961లోని 243ఎఫ్ ప్రకారం...ఐటీఆర్‌ను దాఖలు చేస్తున్న వ్యక్తి వార్షిక ఆదాయం రూ.5 లక్షల కన్నా ఎక్కువ ఉంటే ఈ జరిమానా రూ.5 వేలు ఉంటుంది. వార్షిక ఆదాయం రూ.5లక్షలలోపు ఉండి ఉంటే రూ.1000 జరిమానా విధిస్తుంది. (బియ్యం కోసం కయ్యాలొద్దు: ఐఎంఎఫ్ చీఫ్ ఎకనామిస్ట్) అప్డేటెడ్ రిటర్న్స్ సెక్షన్ 139(8A) ప్రకారం అప్డేట్ చేసిన రిటర్న్‌ను ఫైల్ చేసే ఆప్షన్ కూడా ఉంది. ఫైనాన్స్ యాక్ట్, 2022, అసెస్సీ ఆదాయ రిటర్న్‌ను ఫైల్ చేయడానికి ఎక్కువ వ్యవధిని అనుమతించడానికి దీన్ని ప్రవేశపెట్టింది. అయితే, సంబంధిత అసెస్మెంట్ సంవత్సరం ముగిసిన 24 నెలలలోపు (కొన్ని షరతులకు లోబడి) అప్డేట్ చేయబడిన రిటర్న్‌ను ఫైల్ చేయవచ్చు. ఆలస్యమైన రిటర్న్ లేదా రివైజ్డ్ రిటర్న్ ఆఫ్ ఆదాయాన్ని దాఖలు చేయడానికి పేర్కొన్న కాల పరిమితుల గడువు ముగిసిన తర్వాత కూడా దీనిని ఫైల్ చేయవచ్చు. ప్రాసిక్యూషన్, జైలు శిక్ష? అసాధారణ పరిస్థితుల్లో ఐటీఆర్ ఫైల్ చేయని వారికి జైలుశిక్ష పడే అవకాశం ఉంటుంది. డిసెంబర్ 31, 2023లోగా ఐటీఆర్ దాఖలు చేయని వ్యక్తికి జైలు శిక్ష కూడా పడే అవకాశాలుంటాయి. ఒకవేళ పన్ను చెల్లింపుదారులు ITRను అస్సలు ఫైల్ చేయకపోతే, వారు ప్రస్తుత అసెస్మెంట్ సంవత్సరంలోని నష్టాలను ముందుకు తీసుకెళ్లలేరు. అలాగే, అసెస్డ్ ట్యాక్స్‌లో కనిష్టంగా 50 శాతం లేదా అసెస్డ్ ట్యాక్స్‌లో గరిష్టంగా 200 శాతం పెనాల్టీ విధించవచ్చు. సరైన కారణం లేకుండా, డిసెంబర్ 31, 2023 లోపు ఐటీఆర్ దాఖలు చేయకపోతే ఆరు నుంచి ఏడు సంవత్సరాల వరకు జైలుశిక్ష విధించే అవకాశాలుంటాయి. అలాగే ఐటీ యాక్ట్ ప్రకారం వేతన జీవులను ప్రాసిక్యూషన్‌ను ఎదుర్కోవచ్చు. అలాగే చెల్లించాల్సిన పన్ను మొత్తం అత్యధికంగా ఉన్న సమయాల్లో ఐటీశాఖ ఈ చర్యలు తీసుకుంటుంది. కాగా ఈ ఏడాది ఐటీ రిటర్న్స్ దాఖలు శరవేవంగా జరుగుతోందనీ, సుమారు నాలుగుకోట్ల మందికిపైగా ఐటీఆర్‌లను దాఖలు చేసినట్టు ఆదాయ పన్ను శాఖ గణాంకాల ద్వారా తెలుస్తోంది. మొత్తం ఐటీ రిటర్న్స్‌లో 7శాతం తొలిసారిగా దాఖలు చేసినవారు ఉన్నట్లు సీబీడీటీ చైర్మన్ నితిన్‌గుప్తా ప్రకటించిన సంగతి తెలిసిందే. సగానికిపైగా ఐటీఆర్‌ల ప్రాసెస్ ముగిసిందని, రూ.80 లక్షల వరకు రీఫండ్ చేసినట్లు ఆయన వివరించారు. -
ఐటీఆర్ ఫైలింగ్ గడువు: మేమేమైనా మెషిన్లమా? మొత్తుకుంటున్న నెటిజన్లు
సాక్షి, ముంబై: ఆదాయపు పన్ను రిటర్న్‌లు దాఖలు చేయడానికి చివరి తేదీని పొడిగించే ఆలోచన ఏదీ లేదని కేంద్రం స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అయితే నెటిజన్లు మాత్రం గడువునే వెంటనే పొడిగించాలని డిమాండ్ చేశారు. జూలై 31వ తేదీ లోపు ఫైల్ చేయడం సాధ్యం కాదు. దయచేసి ఆగస్ట్ 31 వరకు పొడిగించండి అని ట్విటర్ ద్వారా కోరుతున్నారు. అలాగే ఇన్‌కంటాక్స్ పోర్టల్ పని తీరుపై విమర్శలు గుప్పిస్తున్నారు. డెడ్‌లైన్ పొడిగింపులేదని ప్రకటించిన తరువాత పొడిగింపు కోసం ఎదురుచూస్తున్న పన్ను చెల్లింపు దారులు ట్విటర్లో గగ్గోలు పెడుతున్నారు. గడువుపెంచండి మహాప్రభో అని మొత్తుకుంటున్నారు. గడువు తేదీని పొడిగించాల్సిందిగా కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌కు విజ్ఞప్తి చేశారు. దీంతో #Extend_Due_Date ట్విటర్లో ట్రెండింగ్‌లో నిలిచింది. టాక్స్ అఫీషియల్స్ ఏమైనా మెషీన్లా.. కాదు కదా.. తీవ్రమైన ఒత్తిడి, టెన్షన్‌తో వారు పనిచేస్తున్నారు. ఆగస్టు 31 వరకు గడువు పెంచాల్సిందే అని కొంతమంది కమెంట్ చేస్తున్నారు. పోర్టల్ పనిచేయడం లేదని మరికొంతమంది, ఫన్నీ కమెంట్స్, రకరకాల మీమ్స్‌తో ట్విటర్లో హల్చల్ చేస్తున్నారు. #Extend_Due_Date_Immediately Tax professionals are not machines. They are working under a lot of stress and tension. Fix 31st August for non audit returns for ever. — K K Atal (@kkatal88) July 26, 2022 #Extend_Due_Date_Immediately #incometaxportal Sitting in office trying to download 26AS/AIS/TIS: pic.twitter.com/ciV0pjGLTg — Atish Paliwal (@atishpaliwal22) July 23, 2022 Clients with pending ITRs looking at their CAs : #Extend_Due_Date_Immediately #Extend_Due_Dates pic.twitter.com/N6yI9CSyyA — Yum (@upsehooon) July 24, 2022 Right now:-#Extend_Due_Date_Immediately#IncomeTaxReturn pic.twitter.com/JO5TJuEDwh — Bhavya (@iconic232001) July 26, 2022 -
ITR Filing: మూడేళ్లలో తొలిసారి కేంద్రం ఇలా..
న్యూఢిల్లీ: గత ఆర్థిక సంవత్సరానికి (2021-22) సంబంధించి ఈ-ఫైలింగ్ పోర్టల్ ద్వారా ఇప్పటివరకు 3 కోట్ల పైగా ఇన్‌కం ట్యాక్స్ (ఐటీ) రిటర్నులు దాఖలైనట్లు ఆదాయ పన్ను శాఖ సోమవారం వెల్లడించింది. జూలై 25 వరకు 3 కోట్లకు పైగా ఐటీఆర్‌లు దాఖలయ్యాయని ఆదాయపు పన్ను శాఖ తెలిపింది. ఆఖరు రోజైన జులై 31 వరకూ ఆగకుండా, వీలైనంత త్వరగా రిటర్నులు దాఖలు చేయాలంటూ పన్ను చెల్లింపుదారులను కోరింది. గత ఆర్థిక సంవత్సరంలో గడువు తేదీ పొడిగించడంతో డిసెంబర్ 31 నాటికి మొత్తం 5.89 కోట్ల ఐటీఆర్‌లు దాఖలయ్యాయి. జూలై 31తో ఐటీఆర్ దాఖలుకు గడువు ముగియనుంది.మరోవైపు ప్రభుత్వం డెడ్‌లైన్ పెంచేందుకు ఆసక్తి చూపడం లేదు. పెనాల్టీలు లేదా ఇతర చట్టపరమైన చర్యల్ని ఎదుర్కోకుండా ఉండాలంటేగడువు లోపేఫైల్ చేయాలి. గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో, కోవిడ్-19 మహమ్మారితో పోరాడుతున్న నేపథ్యంలో ఐటీఆర్ ఫైలింగ్ గడువును పొడిగించింది. ప్రస్తుతం పరిస్థితులు మెరుగ్గా ఉన్న నేపథ్యంలో గడువు పొడిగింపు అంశాన్ని కేంద్రం పరిగణనలోకి తీసుకోవడంలేదు. గడువును పొడిగించకుండా ఉండటం మూడేళ్లలో తొలిసారి కావడం గమనార్హం. (చదవండి: వోల్వో లగ్జరీ ఎలక్ట్రిక్ కారు లాంచ్, సూపర్ లగ్జరీ ఎస్‌యూవీలకు పోటీ!) కాగా ఐటీఆర్ ఫైలింగ్ గడువును పొడిగిస్తారని చాలామంది పన్నుచెల్లింపుదారులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే గడువును పొడిగించే ఆలోచన ఏదీ ప్రస్తుతానికి లేదని రెవెన్యూ కార్యదర్శి తరుణ్ బజాజ్ ఇప్పటికే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. -
డెడ్‌లైన్ 31
ఇందూరు : ‘2012-13, 2013-14’ సంవత్సరాలకు సంబంధించిన బీఆర్జీ నిధులు మార్చి 31 వరకు ఒక్క పైసా కూడా మీ దగ్గర బ్యాలెన్స్ ఉండటానికి వీలు లేదు. ఒకవేళ డబ్బులు ఉన్న ట్లు తెలిస్తే సంబంధిత అధికారిని బాధ్యుడిని చేయాల్సి ఉం టుంది. ప్రభుత్వానికి మీరే వివరణ ఇచ్చుకోవాల్సి ఉంటుంది’’ అని జడ్పీ ఇన్చార్జ్ సీఈఓ రాజారాం ఎంపీడీఓలను, ఇంజినీరింగ్ శాఖల అధికారులను హెచ్చరించారు. మంగళవారం జడ్పీ సమావేశ మందిరం లో ఆయన అధికారులతో సమావేశమయ్యూరు. బీఆర్జీ ఎ ఫ్, 13వ ఆర్థిక సంఘం, ఎస్ఎఫ్సీ, 2015-16బీఆర్జీఎఫ్ నూతన ప్రణాళిక తయారీ తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా సీఈఓ మాట్లాడుతూ పనులు పూర్తయి, నిధులు లేకుంటే తెలియజేయాలన్నారు. స్థలాలు దొరకక, ఏళ్ల తరబడి ప్రారంభానికి నోచుకోకుండా పెండింగ్‌లో ఉన్న పనులను వెంటనే రద్దు చేయాలని ఆదేశించారు. స్థలాలు దొరికినవాటిని ప్రారంభించి, నిర్మాణంలో ఉన్న పనులను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. ఎట్టి పరిస్థితులలో నూ పాత పనులు పూర్తి చేసి తీరాలన్నారు. 2015-16 బీఆర్జీఎఫ్ నూతన ప్రణాళాక వెంటనే తయారు చేసి ఇవ్వాలని ఆదేశించారు. ఆ నిధులెందుకు ఖర్చు చేయలేదు? 13వ ఆర్థిక సంఘం నిధులు చాలా మండలాలలో మిగిలి ఉన్నాయని, కొన్ని చోట్ల అసలే ఖర్చు చేయలేదని సీఈఓ అన్నారు. ఎస్ఎఫ్సీ నిధుల విషయంలో కూడా ఇ దే పరిస్థితి ఉందని అసహనం వ్యక్తం చేశారు. నిధులిచ్చి అభివృద్ధి ప నులు చేయమంటే, ఖర్చు చేయకుండా ఇచ్చిన నిధులు అ లాగే ఉంచడం అధికారుల పని తీరుకు అద్దం పడుతోందన్నారు. వేసవి కాలం వచ్చినందున గ్రామాలలో నీటి ఎద్దడి లేకుండా చూసుకోవాలని, ఖర్చు చేయకుండా ఉంచిన ని ధులు నీటి సౌకర్యం కోసం ఉప యోగించాలని ఎంపీడీఓలను ఆదేశించారు. నిధులకు సంబంధించిన ప్రోగ్రెస్ రిపోర్టులు ఇవ్వని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం సాయంత్రంలోగా తన టేబుల్ మీద వివరాలు ఉం డాలన్నారు. బీఆర్జీఎఫ్ ఆడిట్ ఫారాలు త్వరగా పూర్తి చేసి, అడ్వాన్సు డ్రా చేసిన ప్రజాప్రతినిధుల నుంచి నిధుల రికవరీ లేదా కేసులు పెట్టి ఎఫ్ఐఆర్ కాపీలను అందజేయాలన్నారు. మానవుడికి మూడో కన్ను ‘విద్యే’ మానవుడికి విద్య మూడో కన్నులాంటిదని ఏజేసీ రాజారాం అన్నారు. జడ్పీలో ఆయన మంగళవారం సాక్షరభారత్ శా ఖపై సమీక్షించారు. చదువు అనేది చాల ముఖ్యమైందని, ఇందుకు కో-ఆర్డినేటర్లు మనసుపెట్టి పని చేయూలన్నారు. నిరక్ష్యరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలని ఉద్యోగుల కు సూచించారు. మనం చివరి స్థానంలో అక్షరాస్యతలో ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో జిల్లా చివరి స్థానంలో ఉందని తెలిపారు. ఐదవ ఫేస్‌లో 100 శాతం లక్ష్యం పూర్తి చేసి చూపించాలని ఆదేశించారు. సాక్షర భారత్ కేంద్రాలు లేనిచోట ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని, గ్రా మ, మండల కో ఆర్డినేటర్ పోస్టుల భర్తీ చేపటాలని సాక్షర భారత్ డీడీని ఆదేశించారు. కేంద్రాల పనితీరు తెలుసుకోవడానికి, మెరుగుపరిచేందుకు ఎంపీడీఓలు, జడ్పీటీసీల పర్యవేక్షణ ఉండాలని సూచించారు. పిట్లం మండల ఎంసీఓ పని తీరు బాగలేదన్న ఫిర్యాదు మేరకు ఆయనపై చర్యలకు ఆదే శించారు. పని చేయనివారుంటే స్వచ్ఛందంగా తప్పుకోవాలని స్పష్టం చేశారు. ఇకపై కేంద్రాల పని చేస్తున్నట్లు రిపోర్టు లు ఇవ్వద్దని, ఫోటో సాక్ష్యాలు ఇవ్వాలని మండల కో-ఆర్డినేటర్లకు సూచించారు. అనంతరం మండలాలవారీగా కేంద్రా ల పనితీరు, ఉద్యోగుల సమస్యలను అడిగి తెలుసుకు న్నా రు. తగు సూచనలు చేశారు.