డెడ్‌లైన్ 31 | Deadline 31 | Sakshi
Sakshi News home page

డెడ్‌లైన్ 31

Published Wed, Mar 4 2015 3:41 AM | Last Updated on Sat, Sep 2 2017 10:14 PM

Deadline 31

ఇందూరు : ‘2012-13, 2013-14’ సంవత్సరాలకు సంబంధించిన బీఆర్‌జీ నిధులు మార్చి 31 వరకు ఒక్క పైసా కూడా మీ దగ్గర బ్యాలెన్స్ ఉండటానికి వీలు లేదు. ఒకవేళ డబ్బులు ఉన్న ట్లు తెలిస్తే సంబంధిత అధికారిని బాధ్యుడిని చేయాల్సి ఉం టుంది. ప్రభుత్వానికి మీరే వివరణ ఇచ్చుకోవాల్సి ఉంటుంది’’ అని జడ్‌పీ ఇన్‌చార్జ్ సీఈఓ రాజారాం ఎంపీడీఓలను, ఇంజినీరింగ్ శాఖల అధికారులను హెచ్చరించారు. మంగళవారం జడ్‌పీ సమావేశ మందిరం లో ఆయన అధికారులతో సమావేశమయ్యూరు. బీఆర్‌జీ ఎ ఫ్, 13వ ఆర్థిక సంఘం, ఎస్‌ఎఫ్‌సీ, 2015-16బీఆర్‌జీఎఫ్ నూతన ప్రణాళిక తయారీ తదితర అంశాలపై చర్చించారు.

ఈ సందర్భంగా సీఈఓ మాట్లాడుతూ పనులు పూర్తయి, నిధులు లేకుంటే తెలియజేయాలన్నారు. స్థలాలు దొరకక, ఏళ్ల తరబడి ప్రారంభానికి నోచుకోకుండా పెండింగ్‌లో ఉన్న పనులను వెంటనే రద్దు చేయాలని ఆదేశించారు. స్థలాలు దొరికినవాటిని ప్రారంభించి, నిర్మాణంలో ఉన్న పనులను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. ఎట్టి పరిస్థితులలో    నూ పాత పనులు పూర్తి చేసి తీరాలన్నారు. 2015-16 బీఆర్‌జీఎఫ్ నూతన ప్రణాళాక వెంటనే తయారు చేసి ఇవ్వాలని ఆదేశించారు.
 
ఆ నిధులెందుకు ఖర్చు చేయలేదు?
 13వ ఆర్థిక సంఘం నిధులు చాలా మండలాలలో మిగిలి ఉన్నాయని, కొన్ని చోట్ల అసలే ఖర్చు చేయలేదని సీఈఓ అన్నారు. ఎస్‌ఎఫ్‌సీ నిధుల విషయంలో కూడా ఇ దే పరిస్థితి ఉందని అసహనం వ్యక్తం చేశారు. నిధులిచ్చి అభివృద్ధి ప  నులు చేయమంటే, ఖర్చు చేయకుండా ఇచ్చిన నిధులు అ లాగే ఉంచడం అధికారుల పని తీరుకు అద్దం పడుతోందన్నారు.

వేసవి కాలం వచ్చినందున గ్రామాలలో నీటి ఎద్దడి లేకుండా చూసుకోవాలని, ఖర్చు చేయకుండా ఉంచిన ని  ధులు నీటి సౌకర్యం కోసం ఉప యోగించాలని ఎంపీడీఓలను ఆదేశించారు. నిధులకు సంబంధించిన ప్రోగ్రెస్ రిపోర్టులు  ఇవ్వని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం సాయంత్రంలోగా తన టేబుల్ మీద వివరాలు ఉం  డాలన్నారు. బీఆర్‌జీఎఫ్ ఆడిట్ ఫారాలు త్వరగా పూర్తి చేసి, అడ్వాన్సు డ్రా చేసిన ప్రజాప్రతినిధుల నుంచి నిధుల రికవరీ లేదా కేసులు పెట్టి ఎఫ్‌ఐఆర్ కాపీలను అందజేయాలన్నారు.
 
మానవుడికి మూడో కన్ను ‘విద్యే’
మానవుడికి విద్య మూడో కన్నులాంటిదని ఏజేసీ రాజారాం అన్నారు. జడ్‌పీలో ఆయన మంగళవారం సాక్షరభారత్ శా ఖపై సమీక్షించారు. చదువు అనేది చాల ముఖ్యమైందని, ఇందుకు కో-ఆర్డినేటర్‌లు మనసుపెట్టి పని చేయూలన్నారు. నిరక్ష్యరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలని ఉద్యోగుల కు సూచించారు.
 
మనం చివరి స్థానంలో
అక్షరాస్యతలో ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో జిల్లా చివరి స్థానంలో ఉందని తెలిపారు. ఐదవ ఫేస్‌లో 100 శాతం లక్ష్యం పూర్తి చేసి చూపించాలని ఆదేశించారు. సాక్షర భారత్ కేంద్రాలు లేనిచోట ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని, గ్రా మ, మండల కో ఆర్డినేటర్ పోస్టుల భర్తీ చేపటాలని సాక్షర భారత్ డీడీని ఆదేశించారు. కేంద్రాల పనితీరు తెలుసుకోవడానికి, మెరుగుపరిచేందుకు ఎంపీడీఓలు, జడ్‌పీటీసీల పర్యవేక్షణ ఉండాలని సూచించారు.

పిట్లం మండల ఎంసీఓ పని  తీరు బాగలేదన్న ఫిర్యాదు మేరకు ఆయనపై చర్యలకు ఆదే శించారు. పని చేయనివారుంటే స్వచ్ఛందంగా తప్పుకోవాలని స్పష్టం చేశారు. ఇకపై కేంద్రాల పని చేస్తున్నట్లు రిపోర్టు లు ఇవ్వద్దని, ఫోటో సాక్ష్యాలు ఇవ్వాలని మండల కో-ఆర్డినేటర్లకు సూచించారు. అనంతరం మండలాలవారీగా కేంద్రా   ల పనితీరు, ఉద్యోగుల సమస్యలను అడిగి తెలుసుకు న్నా రు. తగు సూచనలు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement