న్యూఢిల్లీ: గత ఆర్థిక సంవత్సరానికి (2021-22) సంబంధించి ఈ-ఫైలింగ్ పోర్టల్ ద్వారా ఇప్పటివరకు 3 కోట్ల పైగా ఇన్‌కం ట్యాక్స్ (ఐటీ) రిటర్నులు దాఖలైనట్లు ఆదాయ పన్ను శాఖ సోమవారం వెల్లడించింది. జూలై 25 వరకు 3 కోట్లకు పైగా ఐటీఆర్‌లు దాఖలయ్యాయని ఆదాయపు పన్ను శాఖ తెలిపింది. ఆఖరు రోజైన జులై 31 వరకూ ఆగకుండా, వీలైనంత త్వరగా రిటర్నులు దాఖలు చేయాలంటూ పన్ను చెల్లింపుదారులను కోరింది. గత ఆర్థిక సంవత్సరంలో గడువు తేదీ పొడిగించడంతో డిసెంబర్ 31 నాటికి మొత్తం 5.89 కోట్ల ఐటీఆర్‌లు దాఖలయ్యాయి.
జూలై 31తో ఐటీఆర్ దాఖలుకు గడువు ముగియనుంది.మరోవైపు ప్రభుత్వం డెడ్‌లైన్ పెంచేందుకు ఆసక్తి చూపడం లేదు. పెనాల్టీలు లేదా ఇతర చట్టపరమైన చర్యల్ని ఎదుర్కోకుండా ఉండాలంటేగడువు లోపేఫైల్ చేయాలి. గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో, కోవిడ్-19 మహమ్మారితో పోరాడుతున్న నేపథ్యంలో ఐటీఆర్ ఫైలింగ్ గడువును పొడిగించింది. ప్రస్తుతం పరిస్థితులు మెరుగ్గా ఉన్న నేపథ్యంలో గడువు పొడిగింపు అంశాన్ని కేంద్రం పరిగణనలోకి తీసుకోవడంలేదు. గడువును పొడిగించకుండా ఉండటం మూడేళ్లలో తొలిసారి కావడం గమనార్హం.
(చదవండి: వోల్వో లగ్జరీ ఎలక్ట్రిక్ కారు లాంచ్, సూపర్ లగ్జరీ ఎస్‌యూవీలకు పోటీ!)
కాగా ఐటీఆర్ ఫైలింగ్ గడువును పొడిగిస్తారని చాలామంది పన్నుచెల్లింపుదారులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే గడువును పొడిగించే ఆలోచన ఏదీ ప్రస్తుతానికి లేదని రెవెన్యూ కార్యదర్శి తరుణ్ బజాజ్ ఇప్పటికే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment