పసిడికి యూరోజోన్ పరిణామాలు కీలకం
రాజ్యాంగ సంస్కరణలకు సంబంధించి ఇటలీలో రెఫరెండం తదితర యూరోజోన్ పరిణామాలు ఈ వారం పసిడి రేట్లను ప్రభావితం చేసే అవకాశాలున్నట్లు పరిశీలకుల అంచనా. ఇక, ఈసీబీ పాలసీ సమీక్షా సమావేశం తదితర అంశాలూ పుత్తడిపై ప్రభావం చూపనున్నాయన్నది వారి అభిప్రాయం. ఇప్పటికే అమెరికా ఫెడరల్ రిజర్వ్ డిసెంబర్‌లో వడ్డీ రేట్లను పెంచే అవకాశాలను పరిగణనలోకి తీసుకునే పసిడి ధరలు సర్దుబాటు అరుునందున.. మెరుగైన ఉద్యోగ గణాంకాలు, ద్రవ్యోల్బణం వంటి అంశాలతో ఇన్వెస్టర్లు ఇక 2017లో మరింతగా రేట్ల పెంపుపై దృష్టి పెట్టొచ్చు. ఏదైతేనేం.. బంగారంలో ప్రస్తుతం ఓవర్‌సోల్డ్ ధోరణులు కనిపిస్తున్నప్పటికీ.. షార్ట్ కవరింగ్ ర్యాలీ కనిపించవచ్చు. కానీ దీర్ఘకాలానికి మాత్రం బేరిష్ అంచనాలే నెలకొన్నట్లు నిపుణులు చెబుతున్నారు.
మరోవైపు, క్రితం వారం దేశీయంగా పసిడి ధరలను సమీక్షిస్తే.. అంతర్జాతీయంగా బేరిష్ ధోరణి, దేశీయంగా డీమోనిటైజేషన్ ప్రతికూల ప్రభావాలతో బంగారం రేట్లు వరుసగా నాలుగో వారమూ తగ్గారుు. బంగారం రేటు నష్టాలతో కీలకమైన రూ.29,000 మార్కు దిగువకు పడిపోరుుంది. ఆభరణాల బంగారం ధర 10 గ్రాములకు రూ. 29,035-28,345 మధ్య తిరుగాడి చివరికి క్రితం వారంతో పోలిస్తే సుమారు రూ. 475 తగ్గుదలతో రూ. 28,380 వద్ద ముగిసింది. మేలిమి బం గారం రేటూ దాదాపు అంతే నష్టంతో రూ. 28,530 వద్ద ముగిసింది. వారం మొత్తంలో రూ.29,185-28,495 మధ్య తిరుగాడింది.