సాక్షి, ఢిల్లీ: అఫ్గనిస్తాన్ పరిణామాలపై అఖిలపక్షం గురువారం సమావేశమైంది. తాజా పరిస్థితిని ఫ్లోర్‌లీడర్లకు విదేశాంగ శాఖ వివరించింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీ మిథున్‌రెడ్డి హాజరయ్యారు. సమావేశం అనంతరం మిథున్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, అఫ్గాన్‌లో చాలా మంది తెలుగువాళ్లు పనిచేస్తున్నారని.. వారందరినీ క్షేమంగా తీసుకురావాలని కోరామని తెలిపారు. దేశ దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని వ్యూహాలను రూపొందించాలని సూచించామని పేర్కొన్నారు. ప్రతి అంశంలో ఆచితూచి వ్యవహరిస్తామని విదేశాంగ మంత్రి చెప్పారని మిథున్‌రెడ్డి తెలిపారు.
ఇవీ చదవండి:
‘అగ్రిగోల్డ్ ఆస్తులు కొల్లగొట్టేందుకు చంద్రబాబు యత్నించారు’
'బుల్లెట్ బండి' పాటకు అదిరిపోయే స్టెప్పులేసిన ఎంపీ
Comments
Please login to add a commentAdd a comment