All Party conference
-
19న అఖిలపక్ష సమావేశం
న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈ నెల 20వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 19న అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం గురువారం వెల్లడించింది. పార్లమెంట్ సమావేశాల ప్రారంభానికి ముందు అఖిలపక్ష భేటీ నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. వర్షాకాల సమావేశాల కోసం అధికార, విపక్షాలు తమ వ్యూహాలు, అ్రస్తాలతో సన్నద్ధమవుతున్నాయి. -
జీ20 అఖిలపక్ష సమావేశానికి సీఎం జగన్
సాక్షి, అమరావతి: భారతదేశం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న జీ20 దేశాల సదస్సును విజయవంతం చేసేందుకు కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయడానికి కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది. డిసెంబర్ 5న న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో సాయంత్రం 5 గంటలకు జరిగే ఈ సమావేశానికి హాజరు కావాల్సిందిగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఆహ్వానించారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో ఈ సమావేశం జరగనుంది. ప్రపంచంలో ఆర్థికంగా బలంగా ఉన్న గ్రూప్ ఆఫ్ ట్వంటీ (జీ 20) దేశాలకు 2022 డిసెంబర్ 1 నుంచి 2023 నవంబర్ 30 వరకు భారత్ నేతృత్వం వహించనుంది. ఈ సందర్భంగా దేశ వ్యాప్తంగా 32 రంగాలకు సంబంధించి వివిధ నగరాల్లో 200కు పైగా సమావేశాలు నిర్వహించనున్నారు. భారతదేశం నేతృత్వం వహిస్తున్న ఈ సమావేశాలను విజయవంతం చేయడం ద్వారా దేశ సత్తాను ప్రపంచానికి తెలియచేసే విధంగా కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయనున్నారు. ప్రపంచ జీడీపీలో 90 శాతం, వ్యాపారంలో 80 శాతం, జనాభాలో మూడింట రెండొంతుల వాటా ఈ దేశాలదే. ఈ దేశాలు కలిసి పని చేయడం ద్వారా ప్రపంచ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేస్తూ సుస్థిరమైన వృద్ధిని సాధించడమే ఈ సమావేశాల లక్ష్యం. -
లా అండ్ ఆర్డర్ లో 'లా' నే లేదు: ప్రొఫెసర్ హరగోపాల్
-
కేంద్రం సానుకూలంగా పరిష్కరిస్తుందని ఆశిస్తున్నాం: విజయసాయిరెడ్డి
న్యూఢిల్లీ: బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి వర్చువల్‌గా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం జగన్ ఇటీవల ప్రధానమంత్రికి సమర్పించిన వినతి పత్రంలోని అంశాలను కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా పరిష్కరిస్తుందని ఆశిస్తున్నాం. పార్లమెంటు సమావేశాలు సజావుగా జరిగేందుకు చర్యలు తీసుకోవాలి. అడ్డుకునే వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి. పెగాసెస్ వ్యవహారం సామాన్య ప్రజలకు సంబంధించింది కాదు. ఎల్ఐసీ, బీపీసీఎల్, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నాం. చదవండి: (పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖపై సీఎం జగన్ సమీక్ష; కీలక ఆదేశాలు) కరోనా నేపథ్యంలో రాష్ట్రాలకు జీఎస్టీ నష్టపరిహారాన్ని మరో ఐదేళ్ల పాటు పొడిగించాలి. మధ్యతరగతి ప్రజలకు స్వల్ప మొత్తంతో ఆరోగ్య భీమా వర్తింపజేయాలి. తక్షణమే జనాభా లెక్కల సేకరణ చేపట్టాలి. అందులో కులాల వారి గణన కూడా చేయాలి. కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలలో 10 లక్షల ఖాళీలను వెంటనే భర్తీ చేయాలి. నిర్ణీత కాల వ్యవధిలో నియామకాలు పూర్తి చేసేలా యూపీఎస్సీ తరహాలో స్టాఫ్ సెలక్షన్ కమిషన్, ఆర్ఆర్బీకి సైతం చట్ట బద్ధత కల్పించాలి' అని అఖిలపక్ష సమావేశంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి కోరారు. -
తెలుగు వారిని కాపాడండి: ఎంపీ మిథున్‌రెడ్డి
-
వారందరినీ క్షేమంగా తీసుకురావాలి: ఎంపీ మిథున్‌రెడ్డి
సాక్షి, ఢిల్లీ: అఫ్గనిస్తాన్ పరిణామాలపై అఖిలపక్షం గురువారం సమావేశమైంది. తాజా పరిస్థితిని ఫ్లోర్‌లీడర్లకు విదేశాంగ శాఖ వివరించింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీ మిథున్‌రెడ్డి హాజరయ్యారు. సమావేశం అనంతరం మిథున్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, అఫ్గాన్‌లో చాలా మంది తెలుగువాళ్లు పనిచేస్తున్నారని.. వారందరినీ క్షేమంగా తీసుకురావాలని కోరామని తెలిపారు. దేశ దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని వ్యూహాలను రూపొందించాలని సూచించామని పేర్కొన్నారు. ప్రతి అంశంలో ఆచితూచి వ్యవహరిస్తామని విదేశాంగ మంత్రి చెప్పారని మిథున్‌రెడ్డి తెలిపారు. ఇవీ చదవండి: ‘అగ్రిగోల్డ్ ఆస్తులు కొల్లగొట్టేందుకు చంద్రబాబు యత్నించారు’ 'బుల్లెట్ బండి' పాటకు అదిరిపోయే స్టెప్పులేసిన ఎంపీ -
ఆర్టికల్ 370ని పునరుద్దరించేవరకు ఎన్నికల్లో పోటీ చేయను
కశ్మీర్: జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్టికల్ 370, 35ఏని పునరిద్ధరించేవరకు తాను ఎన్నికల్లో పోటీ చేయనని స్పష్టం చేశారు. జమ్మూకశ్మీర్ భవిష్యత్ ప్రణాళికపై చర్చించడానికి ఈ నెల 24న ప్రధానమంత్రి అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష సమావేశం అనంతరం ముఫ్తీ ఎన్నికలు, నియోజకవర్గాల పునర్వవస్థీకరణ కన్న ముందు ఈ ప్రాంత ప్రజల విశ్వాసం గెలవడం ముఖ్యం అన్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ‘‘జమ్మూకశ్మీర్ ప్రత్యేక హోదా, ఆర్టికల్ 370, 35ఏని పునరిద్ధరించే వరకు నా పోరాటం కొనసాగుతుంది.. అప్పటి వరకు నేను ఎన్నికల్లో పోటీ చేయను. నా పార్టీ పీడీపీ ఎన్నికల్లో పోటీ చేస్తుంది. సీఎం అభ్యర్థులకు కొరత లేదు’’ అన్నారు. ‘‘మా పార్టీ భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తుంది.. దాని ప్రకారమే నడుచుకుంటుంది. అందుకే ప్రధాని ఆహ్వానం మేరకు మేం ఢిల్లీ వచ్చి.. మోదీతో సమావేశం అయ్యాము. కానీ ప్రస్తుతం రాజకీయ పార్టీలతో సమావేశం కావడం ముఖ్యం కాదు. ప్రజలతో కలిసిపోయి.. వారిలో విశ్వాసం నింపాలి. వారి నమ్మకాన్ని గెల్చుకోవాలి. అందుకు తగిన చర్యలు తీసుకోవడం ముఖ్యం’’ అన్నారు మెహబూబా ముఫ్తీ. జమ్మూకశ్మీర్ భవిష్యత్ ప్రణాళికపై ఆక్కడి కీలక నేతలతో ప్రధానమంత్రి మోదీ గురువారం తన నివాసంలో దాదాపు మూడున్నర గంటల పాటు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ప్రస్తుతం కొనసాగుతున్న నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ముగిసిన తరువాత అసెంబ్లీ ఎన్నికలుంటాయని ప్రధాని తెలిపారని పీపుల్స్ కాన్ఫెరెన్స్ నేత ముజఫర్ హుస్సేన్ బేగ్ వెల్లడించారు. చదవండి: కశ్మీర్ పార్టీల మల్లగుల్లాలు -
కశ్మీర్ పార్టీల మల్లగుల్లాలు
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్ భవిష్యత్ ప్రణాళికపై చర్చించడానికి ఈ నెల 24న ప్రధానమంత్రి అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయడంతో కశ్మీర్‌కు చెందిన పార్టీలన్నీ ఏం చేయాలా అని మల్లగుల్లాలు పడుతున్నాయి. నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా పార్టీలో అంతర్గత చర్చలు ప్రారంభించారు. చర్చల విషయంలో ఎలాంటి వైఖరి తీసుకుందామనే విషయంలో సీనియర్ నాయకులతో మంతనాలు జరుపుతున్నారు. ‘‘ఎన్సీ చీఫ్ పార్టీ సీనియర్ నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు. పార్టీ ప్రధానకార్యదర్శి అలీ మహమ్మద్ సాగర్, కశ్మీర్ ప్రావిన్షియల్ అధ్యక్షుడు నసీర్ అస్లామ్ వణీతో చర్చించారు. ఈ చర్చలు సోమవారం కూడా కొనసాగుతాయి. ఆ తర్వాత ఏం చేయాలన్నదానిపై స్పష్టత వస్తుంది’’అని పార్టీ నాయకుడొకరు ఆదివారం వెల్లడించారు. కశ్మీర్లో మరో ప్రధాన పార్టీ పీడీపీకి చెందిన పొలిటికల్ అఫైర్స్ కమిటీ (పీఏసీ) సమావేశమై నిర్ణయాధికారాన్ని పార్టీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీకి కట్టబెట్టింది. ‘‘అఖిలపక్ష సమావేశంపై తుది నిర్ణయాన్ని పార్టీ అధినేత్రి ముఫ్తీకి కట్టబెడుతూ పీఏసీ నిర్ణయించింది’’అని పీడీపీ అధికార ప్రతినిధి సయ్యద్ సుహైల్ బుఖారి చెప్పారు. పీపుల్స్ అలయెన్స్ ఫర్ గుప్కార్ డిక్లరేషన్ (పీఏజీడీ) మంగళవారం సమావేశమై అసలు సమావేశానికి హాజరు కావాలా, వద్దా అని నిర్ణయిస్తారు. కశ్మీర్ అంశంలో ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో ఈ నెల 24, గురువారం మధ్యాహ్నం 3 గంటలకి అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. రాష్ట్ర హోదా పునరుద్ధరించాలి: కాంగ్రెస్ ప్రజాస్వామ్యం, రాజ్యాంగంపై విశ్వాసం ఉంచి కేంద్ర ప్రభుత్వం జమ్మూకశ్మీర్ రాష్ట్ర హోదాని పునరుద్ధరించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. అయితే అఖిలపక్ష సమావేశానికి హాజరవుతారో లేదో కాంగ్రెస్ స్పష్టంగా వెల్లడించలేదు. పూర్తి స్థాయి రాష్ట్ర హోదా పునరుద్ధరించాలన్న డిమాండ్‌కే తమ పార్టీ కట్టుబడి ఉందని కాంగ్రెస్ ప్రధాన అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా తెలిపారు. -
అఖిలపక్షం: గళమెత్తిన విజయసాయిరెడ్డి
సాక్షి, ఢిల్లీ: ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష సమావేశంలో ఆంధ్రప్రదేశ్ సమస్యలపై వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి గళమెత్తారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటుపై చర్యలు చేపట్టాలని, విశాఖలో జాతీయ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇంకా పలు సమస్యలను ఆయన లేవనెత్తారు. ‘భౌగోళిక ప్రాతిపదికన జల వనరులు కేటాయించాలి. దిశ చట్టానికి వెంటనే అనుమతులు ఇవ్వాలి. రేప్ ఘటనలకు పాల్పడే వారికి త్వరగా శిక్షలు పడేలా.. ఐపీసీ, సీఆర్‌పీసీలకు సవరణలు తీసుకురావాలని’’ ఆయన కోరారు. చదవండి: రాష్ట్రపతి ప్రసంగంలో విభజన హామీల ప్రస్తావన ఏదీ! రైతుల సమస్యలను విజయసాయిరెడ్డి ప్రస్తావిస్తూ.. గిట్టుబాటు ధరకు చట్టబద్ధత కల్పించాలని కోరారు. ప్రత్యేక రైతు కమిషన్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. చట్టసభల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. విగ్రహాల ధ్వంసం వెనుక టీడీపీ నేతలున్నట్లు సీసీ ఫుటేజ్‌లో ఆధారాలు బయటపడ్డాయని, ఐపీసీ 295కు సవరణ తీసుకొచ్చి 20 ఏళ్ల జైలు శిక్ష విధించాలని ఎంపీ విజయసాయిరెడ్డి డిమాండ్ చేశారు. చదవండి: ఊసరవెల్లిని మించిపోయావయ్యా చంద్రం! -
ఐక్యతను, సాయుధ దళాల పట్ల సంఘీభావాన్ని చాటాల్సిన సమయమిది
సాక్షి, అమరావతి: భారత్–చైనా సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో శుక్రవారం నిర్వహించిన అఖిలపక్ష సమావేశంపై వక్రభాష్యాలు చెప్పే ప్రయత్నాల పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విచారం వ్యక్తం చేశారు. ఈ మేరకు శనివారం రాత్రి ట్వీట్ చేశారు. ‘ఇది మనం ఐక్యతను, మన సాయుధ దళాల పట్ల సంఘీభావాన్ని చాటాల్సిన సమయం. అంతేగానీ.. ఒకరి పట్ల మరొకరు వేలెత్తి చూపించుకోవడమో లేక తప్పులను ఎత్తి చూపించుకోవడమో చేసుకునే సమయం కాదు. అఖిలపక్ష సమావేశంలో ప్రధానమంత్రి, ఇతర మంత్రులు చాలా ఆమోద యోగ్యమైన, విశ్వసనీయమైన సమాధానాలు చెప్పారు. ఈ విషయమై జాతి యావత్తు ఏకతాటిపై నిలబడాలి. ఐక్యత బలాన్ని ఇస్తుంది. విభజన బలహీనతను ప్రదర్శిస్తుంది’ అని ట్విట్టర్లో పేర్కొన్నారు. -
అఖిలపక్ష నేతల పొలికేక
సాక్షి, బోయినపల్లి(కరీంనగర్) : మధ్య మానేరు(శ్రీరాజరాజేశ్వర) ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యల పరిష్కారం కోసం సీఎం కేసీఆర్ అత్తగారి గ్రామం కొదురుపాక వేదికగా అఖిలపక్షం నేతలు శుక్రవారం పొలికేక వేశారు. 13 ముంపు గ్రామాల నిర్వాసితుల సమస్యల పరిశ్కారం కోసం ఇక హైదరాబాద్ వేదికంగా ఉద్యమం తీవ్రతరం చేయాలని నిర్ణయించారు. ఇందుకు అవసరమైతే ‘చలో అసెంబ్లీ’ పేరిట కొదురుపాక నుంచి రాష్ట్ర రాజధానిలోని అసెంబ్లీ, ప్రగతి భవన్‌ను ముట్టడించాలని పిలుపునిచ్చారు. అక్రమార్జనలో ఒక్కశాతం వెచ్చించినా.. ఇసుక మాఫియాతో రూ.వేల కోట్ల ఆదాయాన్ని సంపాదించిన టీఆర్ఎస్ నేతలు.. అందులో ఒకశాతం ఖర్చు చేసినా నిర్వాసితుల ఇళ్ల నిర్మాణాలు పూర్తవుతాయని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి అన్నారు. చింతమడక వాసులకు సీఎం కేసీఆర్ అడుగకుండానే ఇంటింటికీ రూ.10లక్షలు ఇస్తామని ప్రకటించారని అన్నారు. మధ్యమానేరు నిర్వాసితులు ఏం పాపం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. నిర్వాసితుల ఉద్యమాలు ఇక గ్రామాల నుంచి రాష్ట్ర రాజధానికి తరలివెళ్తాయని పేర్కొన్నారు. నిర్వాసితుల పక్షాన ఎలాంటి పోరాటాలకైనా సిద్ధంగా ఉంటామని ఆయన అభయమిచ్చారు. బండి సంజయ్ మాటల తుటాలు.. తెలంగాణ ప్రజల ఓట్లతో సీట్లు సాధించి గద్దెనెక్కిన సీఎం కేసీఆర్.. తన అత్తగారి మండలంలోని నిర్వాసితుల ఇళ్ల నిర్మాణాలకు ఇచ్చిన హామీని నెరవేర్చాలని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ డిమాండ్ చేశారు. నిర్వాసితుల హక్కుల సాధనకు అవసరమైతే ప్రగతిభవన్‌ను ముట్టడించాలని, దీనిపై ప్రతీ నిర్వాసితుడు సిద్ధంగా ఉండాలని కోరారు. నిర్వాసితుల ఉద్యమాలను చూసి టీఆర్ఎస్ నేతల లాగులు తడవాలన్నారు. జెండాలు, కండువాలు పక్కన పెట్టి ఒకేజెండాగా నిర్వాసితుల పక్షాన అఖిల పక్షం నేతలు పోరాడాలని కోరారు. సీఎం అసమర్థతకు నిదర్శనం కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా రాకపోవడం వెనుక సీఎం కేసీఆర్ అసమర్థత ఉందని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి విమర్శించారు. కేంద్ర ప్రభుత్వానికి కాళేశ్వరం ప్రాజెక్టుపై పూర్తిస్థాయి నివేదిక ఇవ్వడంలో వైఫల్యం చెందడంతో జాతీయ హోదా రాలేదని అన్నారు. జాతీయ హోదా వచ్చినట్లయితే 60 శాతం నిధులు కేంద్రం భరించేదని అభిప్రాయపడ్డారు. ప్రాజెక్టుకు జాతీయ హోదా వస్తే కమిషన్లు రావని నివేదిక సవ్యంగా ఇవ్వలేదని ఆరోపించారు. ఇప్పుడు వరద కాలువకు కాళేశ్వరం నీరు రావడంలేదని కడెం ప్రాజెక్టు నీళ్లు వస్తున్నాయన్నారు. గ్యాస్ బెలూన్లతో నిరసన సీఎం కేసీఆర్ మిడ్‌మానేరు ప్రాజెక్టు పర్యవేక్షిం చడానికి హెలికాప్టర్లో వస్తే ముంపు గ్రామాల ప్రజలు వారి గ్రామాల నుంచే బెలూన్లు పైకి ఎగురవేసి సీఎం కేసీఆర్ హెలికాప్టర్‌కు నిరసన సెగ తగిలేలా చేయాలని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ కోరారు. సీఎం బంధువులతోపాటు ముంపు గ్రామాల నిర్వాసితులకు అన్నిరకాల ప్యాకేజీలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పోరాటాలతోనే పరిహారం సాధ్యం సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ ముంపు గ్రామాల సమస్యలు పరిష్కారం కావాలంటే పోరాటాలనే శరణ్యమన్నారు. సీఎం కేసీఆర్ సతీమణి శోభక్క ముంపు గ్రామాల నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ధ చూపించి ఇళ్ల నిర్మాణాలకు రూ.5.4లక్షలు ఇచ్చేలా చూడాలన్నారు. పాటలతో ఉర్రూతలూగించి విమలక్క, సోమన్న.. అరుణోదయ అధ్యక్షురాలు విమలక్క, గాయకుడు ఏవూరి సోమన్న నిర్వాసితులు వేతలపై వారు ఎదుర్కొంటున్న సమస్యలపై పాటల రూపంలో ఆవేదన వ్యక్తం చేశారు. నిర్వాసితుల చప్పట్ల ధ్వని ప్రగతిభవన్ గడగడలాడాలని కోరారు. వర్షంలో తడిసిన నిర్వాసితులు... సభ ప్రారంభంలో కొద్దిసేపు వర్షం కురిసినా నిర్వాసితులు లెక్కచేయకుండా తమ సమస్యల పరిష్కారం కోసం బహిరంగ సభ స్థలంలోనే కూర్చున్నారు. కొదురుపాక బహిరంగ సభ స్థల పరిసరాల్లో వేలాది మంది నిర్వాసితులు తరలివచ్చారు. -
నేడు అఖిలపక్ష సమావేశం
న్యూఢిల్లీ: లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ అధ్యక్షతన గురువారం ఢిల్లీలో అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించనున్నారు. విపక్ష సభ్యులు అడ్డుకోవడంతో ప్రస్తుత పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఇప్పటివరకు సజావుగా సాగని విషయం తెలిసిందే. లలిత్‌మోదీ వివాదం, వ్యాపమ్ కుంభకోణాల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ కేంద్రమంత్రులు, ముఖ్యమంత్రులను తొలగించాలని పట్టుపడుతూ విపక్షాలు లోక్‌సభను స్తంభింపజేయడం విదితమే. ఈ నేపథ్యంలో సమావేశాలు సజావుగా సాగేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అన్ని రాజకీయ పక్షాలతో చర్చించేందుకుగాను స్పీకర్ ఈ అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. మంగళవారం మాజీ రాష్ట్రపతి కలాంకు నివాళి అనంతరం వాయిదా పడిన లోక్‌సభ గురువారం సమావేశం కానుంది. నేడు స్మోకింగ్ రూం పునఃప్రారంభం! ధూమపాన ప్రియులైన ఎంపీలు పార్లమెంట్ భవనంలోనూ పొగ తాగేందుకు మళ్లీ వీలు కానుంది. పార్లమెంట్ భవనంలోని చరిత్రాత్మక సెంట్రల్ హాల్‌కు పక్కన పునరుద్ధరించిన స్మోకింగ్ రూంను నేడు(గురువారం) ప్రారంభించనున్నారు. వర్షాకాల సమావేశాల ప్రారంభం సందర్భంగా జూలై 21 నుంచి ఈ గదిని స్టెనోగ్రాఫర్ల కోసం లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ కేటాయించారు. అయితే, తమకు స్మోకింగ్ రూంను కేటాయించాలంటూ సమావేశాల ప్రారంభం రోజే అధికార, ప్రతిపక్ష సభ్యులు పలువురు స్పీకర్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు. అది సెంట్రల్ హాల్‌కు సంబంధించిన గది అని, దానిని ఎంపీల అవసరాలకే వినియోగించాలని కోరారు. దీంతో స్టెనోగ్రాఫర్లకు మూడో అంతస్తులోని గదిని స్పీకర్ కేటాయించారు. కాగా, 2004లో పార్లమెంట్ హౌస్, సెంట్రల్ హాల్, లాబీలను నో స్మోకింగ్ జోన్‌గా ప్రకటించారు. అప్పుడే ఎంపీలు పొగతాగేందుకు ప్రత్యేక గదిని కేటాయించారు.