సాక్షి, అమరావతి: భారత్–చైనా సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో శుక్రవారం నిర్వహించిన అఖిలపక్ష సమావేశంపై వక్రభాష్యాలు చెప్పే ప్రయత్నాల పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విచారం వ్యక్తం చేశారు. ఈ మేరకు శనివారం రాత్రి ట్వీట్ చేశారు. ‘ఇది మనం ఐక్యతను, మన సాయుధ దళాల పట్ల సంఘీభావాన్ని చాటాల్సిన సమయం. అంతేగానీ.. ఒకరి పట్ల మరొకరు వేలెత్తి చూపించుకోవడమో లేక తప్పులను ఎత్తి చూపించుకోవడమో చేసుకునే సమయం కాదు. అఖిలపక్ష సమావేశంలో ప్రధానమంత్రి, ఇతర మంత్రులు చాలా ఆమోద యోగ్యమైన, విశ్వసనీయమైన సమాధానాలు చెప్పారు. ఈ విషయమై జాతి యావత్తు ఏకతాటిపై నిలబడాలి. ఐక్యత బలాన్ని ఇస్తుంది. విభజన బలహీనతను ప్రదర్శిస్తుంది’ అని ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
ఐక్యతను, సాయుధ దళాల పట్ల సంఘీభావాన్ని చాటాల్సిన సమయమిది
Published Sun, Jun 21 2020 3:43 AM | Last Updated on Sun, Jun 21 2020 3:43 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment