సాక్షి, ఢిల్లీ: ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష సమావేశంలో ఆంధ్రప్రదేశ్ సమస్యలపై వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి గళమెత్తారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటుపై చర్యలు చేపట్టాలని, విశాఖలో జాతీయ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇంకా పలు సమస్యలను ఆయన లేవనెత్తారు. ‘భౌగోళిక ప్రాతిపదికన జల వనరులు కేటాయించాలి. దిశ చట్టానికి వెంటనే అనుమతులు ఇవ్వాలి. రేప్ ఘటనలకు పాల్పడే వారికి త్వరగా శిక్షలు పడేలా.. ఐపీసీ, సీఆర్‌పీసీలకు సవరణలు తీసుకురావాలని’’ ఆయన కోరారు. చదవండి: రాష్ట్రపతి ప్రసంగంలో విభజన హామీల ప్రస్తావన ఏదీ!
రైతుల సమస్యలను విజయసాయిరెడ్డి ప్రస్తావిస్తూ.. గిట్టుబాటు ధరకు చట్టబద్ధత కల్పించాలని కోరారు. ప్రత్యేక రైతు కమిషన్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. చట్టసభల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. విగ్రహాల ధ్వంసం వెనుక టీడీపీ నేతలున్నట్లు సీసీ ఫుటేజ్‌లో ఆధారాలు బయటపడ్డాయని, ఐపీసీ 295కు సవరణ తీసుకొచ్చి 20 ఏళ్ల జైలు శిక్ష విధించాలని ఎంపీ విజయసాయిరెడ్డి డిమాండ్ చేశారు. చదవండి: ఊసరవెల్లిని మించిపోయావయ్యా చంద్రం!
Comments
Please login to add a commentAdd a comment