Parliamentary meetings
-
కేసీఆర్ అధ్యక్షతన రేపు బీఆర్ఎస్ పార్లమెంటరీ సమావేశం
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 26వ తేదీన (శుక్రవారం) బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది. సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో మధ్యాహ్నం 12:30 గంటలకు ఈ భేటీ జరగనుంది. రానున్న పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో పార్టీకి చెందిన లోక్ సభ, రాజ్యసభ సభ్యులతో కేసీఆర్ సమావేశం కానున్నారు. పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం, పార్టీ వైఖరిపై చర్చించన్నారు. లోక్ సభ ఎన్నికలకు ముందు జరుగుతున్న చివరి సమావేశాలు కావడంతో కీలక బిల్లులు సహా ఇతర అంశాల్లో లేవనెత్తానాల్సిన అంశాలపై ఎంపీలకు అధినేత కేసీఆర్ దిశానిర్ధేశం చేయనున్నారు. ఈ సమావేశానికి లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు హాజరు కానున్నారు. చదవండి: TSPSC చైర్మన్‌గా మహేందర్‌రెడ్డి.. గవర్నర్ ఆమోదం -
అఖిలపక్షం: గళమెత్తిన విజయసాయిరెడ్డి
సాక్షి, ఢిల్లీ: ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష సమావేశంలో ఆంధ్రప్రదేశ్ సమస్యలపై వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి గళమెత్తారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటుపై చర్యలు చేపట్టాలని, విశాఖలో జాతీయ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇంకా పలు సమస్యలను ఆయన లేవనెత్తారు. ‘భౌగోళిక ప్రాతిపదికన జల వనరులు కేటాయించాలి. దిశ చట్టానికి వెంటనే అనుమతులు ఇవ్వాలి. రేప్ ఘటనలకు పాల్పడే వారికి త్వరగా శిక్షలు పడేలా.. ఐపీసీ, సీఆర్‌పీసీలకు సవరణలు తీసుకురావాలని’’ ఆయన కోరారు. చదవండి: రాష్ట్రపతి ప్రసంగంలో విభజన హామీల ప్రస్తావన ఏదీ! రైతుల సమస్యలను విజయసాయిరెడ్డి ప్రస్తావిస్తూ.. గిట్టుబాటు ధరకు చట్టబద్ధత కల్పించాలని కోరారు. ప్రత్యేక రైతు కమిషన్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. చట్టసభల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. విగ్రహాల ధ్వంసం వెనుక టీడీపీ నేతలున్నట్లు సీసీ ఫుటేజ్‌లో ఆధారాలు బయటపడ్డాయని, ఐపీసీ 295కు సవరణ తీసుకొచ్చి 20 ఏళ్ల జైలు శిక్ష విధించాలని ఎంపీ విజయసాయిరెడ్డి డిమాండ్ చేశారు. చదవండి: ఊసరవెల్లిని మించిపోయావయ్యా చంద్రం! -
రాజధాని అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలి
సాక్షి, అమరావతి : రాజధాని అమరావతిలో అక్రమాల నిగ్గు తేల్చడానికి సీబీఐ విచారణకు పార్లమెంట్లో పట్టుపట్టాలని వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో నిర్ణయించారు. ఇన్సైడర్ ట్రేడింగ్ మొదలు కావాల్సిన వారికి లబ్ధి కలిగించేలా గత చంద్రబాబు ప్రభుత్వం పలు నిర్ణయాలు తీసుకున్న విషయం విదితమే. మంత్రి వర్గ ఉపసంఘం చేపట్టిన అధ్యయనంలో ఈ అక్రమాలన్నీ బయటపడ్డాయి. ఆ వివరాలు ఇలా.. రాజధాని ప్రకటనకు ముందే రాజధాని ఎక్కడ ఉంటుందనే సమాచారాన్ని ప్రభుత్వ పెద్దలు లీక్ చేసి, తమ అనుయాయుల ద్వారా అక్కడ చాలా తక్కువ ధరకు భూములు కొనిపించారు. తెల్లకార్డు ఉన్న వారిని బినామీలుగా పెట్టి భూములు కొన్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో 4,069.94 ఎకరాలను రాజధాని ప్రకటనకు ముందే రహస్యంగా కొనుగోలు చేసినట్లు రిజిష్ట్రేషన్ రికార్డుల ద్వారా తేలింది. ఇది పక్కాగా ఇన్సైడర్ ట్రేడింగ్. ఈ వ్యవహారంలో అప్పటి సీఎం చంద్రబాబు, నారా లోకేష్‌కు దగ్గరి వ్యక్తి వేమూరి రవికుమార్, మాజీ మంత్రి పరిటాల సునీత, మాజీ ఎమ్మెల్యే జీవీఎస్ ఆంజనేయులు, లింగమనేని రమేష్, టీడీపీ నాయకులు పయ్యావుల కేశవ్, కంభంపాటి రామ్మోహనరావు, లంకా దినకర్, పుట్టా మహేష్‌యాదవ్, ధూళిపాళ నరేంద్ర తదితరులున్నారు. చంద్రబాబుకు దగ్గరి వ్యక్తి లింగమనేని రమేష్, మాజీ మంత్రులు పి. నారాయణ, ప్రత్తిపాటి పుల్లారావు, మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్, నారా లోకేష్, రావెల కిషోర్‌బాబు, కోడెల శివప్రసాదరావు, పల్లె రఘునాథ్‌రెడ్డి, ధూళిపాళ నరేంద్ర, పయ్యావుల కేశవ్, మురళీమోహన్, జీవీ ఆంజనేయులు బినామీ పేర్లతో రాజధాని, రాజధాని రీజియన్‌లో భూములు కొన్నారు. రాజధాని, రాజధాని రీజియన్ హద్దులను కూడా వారికి లబ్ధి కలిగేలా మార్చారు. తద్వారా బాలకృష్ణ దగ్గరి బంధువు ఎంఎస్పీ రామారావు, లింగమనేని రమేష్ భారీగా లబ్ధి పొందారు. కొందరు టీడీపీ నేతలు లంక, పోరంబోకు, ప్రభుత్వ భూములను తమవిగా చూపించి ప్లాట్లు పొందారు. రెవెన్యూ రికార్డులనూ తారుమారు చేశారు. ఐదు ప్రైవేటు సంస్థలకు 850 ఎకరాలను అతి తక్కువ ధరలకు కేటాయించారు. 900 ప్లాట్లను సంబంధికులకు కాకుండా వేరే వారికి రిజిస్టర్ చేశారు. ఎస్సీ, ఎస్టీ చట్టం–1989ని ఉల్లంఘించారు. ఫైబర్ గ్రిడ్ సీబీఐ విచారణ కోసం పార్లమెంట్లో ఒత్తిడి తేనున్న వైఎస్సార్సీపీ ఈవీఎం దొంగ వేమూరు హరికృష్ణ ద్వారా చంద్రబాబు, లోకేష్ అక్రమాలు రూ.2 వేల కోట్ల అవినీతి జరిగిందని తేల్చిన కేబినెట్ సబ్ కమిటీ సాక్షి, అమరావతి: ఫైబర్ గ్రిడ్ అక్రమాలను నిగ్గు తేల్చడానికి వేగంగా విచారణ జరిపించే విధంగా ఒత్తిడి తీసుకురావాలని వైఎస్సార్సీపీ ఎంపీలు నిర్ణయించారు. ఈవీఎం దొంగ వేమూరు హరికృష్ణను ముందు పెట్టి అప్పటి సీఎం చంద్రబాబు, నాటి ఐటీ మంత్రి లోకేష్ అక్రమాలకు పాల్పడ్డారని, ఈ కుంభకోణంలో రూ.2 వేల కోట్లకుపైగా అవినీతి జరిగిందని మంత్రివర్గ ఉప సంఘం ఇప్పటికే తేల్చింది. ఈ అంశాల్లో మరింత లోతుగా విచారణ చేయడానికి సీబీఐకి కేసు అప్పగించాలని మంత్రివర్గం సైతం తీర్మానించిన విషయం విదితమే. భారత్ నెట్ రెండో దశ పనులను టెండర్ షరతులను సడలించి.. నిబంధనలు ఉల్లంఘించి.. అర్హత లేని టెరా సాఫ్ట్వేర్ లిమిటెడ్ (వేమూరు హరికృష్ణకు చెందినది)కు పనులు అప్పగించారు. అందువల్ల అంచనా వ్యయం రూ.907.94 కోట్ల నుంచి రూ.1410 కోట్లకు పెరిగింది. బీబీఎన్ఎల్(భారత్ బ్రాడ్ బ్యాండ్ నెట్ వర్క్ లిమిటెడ్) నిర్ధారించిన దాని కంటే రూ.558.77 కోట్ల అధిక ధరలకు పనులు అప్పగించారు. వీటికి కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోలేదని మంత్రివర్గ ఉప సంఘం ఎత్తి చూపింది. తక్కువ ధరకు బిడ్ దాఖలు చేసిన(ఎల్–1) కంపెనీని కాదని.. అధిక ధరకు బిడ్ దాఖలు చేసిన టెరాసాఫ్ట్‌కు ఫైబర్ గ్రిడ్ దక్కేలా చక్రం తిప్పారు. రెండో దశ పనుల టెండర్లలో అప్పటి సీఎం చంద్రబాబు, నాటి ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ భారీ అక్రమాలకు పాల్పడ్డారు. సెట్ టాప్ బాక్స్‌ల టెండర్లలో 8 సంస్థలు పాల్గొంటే.. తక్కువ ధరకు కోట్ చేసిన సంస్థకు పనులు అప్పగించకుండా.. నాలుగు సంస్థలకు పనులు విభజించి, అప్పగించారు. కానీ.. సెట్ టాప్ బాక్స్‌లను కేవలం టెరాసాఫ్ట్ నుంచే కొనుగోలు చేసి, బిల్లులు చెల్లించారు. తీరా సెట్ టాప్ బాక్స్‌ల్లో నాణ్యత లేదని తేలింది. ఏపీఎస్ఎఫ్ఎల్ ద్వారా 13 జిల్లాల్లో పైబర్ గ్రిడ్ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ కోసం కాంట్రాక్టు సంస్థను ఎంపిక చేయడానికి టెండర్లు ఖరారు చేసే వరకు ఆ పనులను నెలకు రూ.2,44,01,865తో టెరా సాఫ్ట్‌కు అప్పగించారు. -
ప్రత్యేకహోదా ఇవ్వాలని పార్లమెంట్ సమావేశాల్లో కోరతాం
-
టీఆర్ఎస్ ‘పార్లమెంటరీ’ సమావేశాలు వాయిదా
సాక్షి, హైదరాబాద్: మార్చి 1 నుంచి జరగాల్సిన టీఆర్ఎస్ పార్టీ పార్లమెంటరీ నియోజకవర్గ స్థాయి సమావేశాలు వాయిదా పడ్డాయి. దేశ సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో సమావేశాలను వాయిదా వేయాలని నిర్ణయించినట్లు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌తో సంప్రదించిన తర్వా త కొత్త తేదీలను ప్రకటిస్తామని పేర్కొన్నారు. -
హక్కుల పరిరక్షణే చట్టసభల కర్తవ్యం
సాక్షి, న్యూఢిల్లీ : సమాజంలో అసమానతల్లేకుండా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా విధి విధానాలు రూపొందించి చట్టాలను అమలు చేయడమే చట్టసభల ప్రధాన కర్తవ్యమని అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి అన్నారు. సోమవారం ఢిల్లీలో లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ అధ్యక్షతన జరిగిన కామన్వెల్త్ పార్లమెంటరీ సమీక్షలో పలు రాష్ట్రాల అసెంబ్లీల స్పీకర్లు, మండలి చైర్మన్లు పాల్గొన్నారు. ప్రజల హక్కులను పరిరక్షించేందుకు సభలను నడపాలని మధుసూదనాచారి పేర్కొన్నారు. గత కామన్వెల్త్ పార్లమెంటరీ సమీక్షలో తీసుకున్న నిర్ణయాలు, వాటి అమలుపై సమావేశంలో చర్చించారు. తదుపరి సమావేశం జూన్ 2న ముంబైలో నిర్వహించనున్నట్లు తెలిపారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో రాష్ట్ర అసెంబ్లీ పనితీరు ప్రశంసనీయమని సుమిత్రా మహాజన్ కొనియాడినట్లు పేర్కొన్నారు. చట్టసభల్లో ఎదురవుతున్న సమస్యలు, ఇతర అంశాల పరిష్కారానికి ఇలాంటి సమావేశాలు ఉపయోగపడుతాయని మండలి చైర్మన్ స్వామిగౌడ్ అన్నారు. అన్ని రాష్ట్రాల స్పీకర్లు, మండలి చైర్మన్లతో ఎప్పటికప్పుడు వీడియో కాన్ఫరెన్స్‌లు నిర్వహించాలని కోరడంపై సుమిత్రా మహాజన్ సానుకూలంగా స్పందించారని చెప్పారు. సమాజంలోని అసమానతల తొలగింపునకు విశేష కృషి చేసి దేశానికి దశ, దిశ చూపిన మహనీయులు జ్యోతిబా పూలే, బీఆర్ అంబేడ్కర్ అని మధుసూదనాచారి, స్వామిగౌడ్ కొనియాడారు. తెలంగాణ పూలే బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జ్యోతిబా పూలే, అంబేడ్కర్ల జయంతి వేడుకలను ఢిల్లీలోని తెలంగాణ భవన్లో ఘనంగా నిర్వహించారు. -
విపక్షాలదే పై చేయి...
బీబీఎంపీ విభజన బిల్లు సెలెక్ట్ కమిటీ చేతికి సమావేశాల పేరుతో రూ. 3 కోట్లు ప్రజాధనం వృధా బెంగళూరు: బృహత్ బెంగళూరు మహా నగర పాలికె (బీబీఎంపీ) విభజన విషయంలో అధికార కాంగ్రెస్ పార్టీ కంటే విపక్షాలైన భారతీయ జనతా పార్టీ, జేడీఎస్లదే పై చేయిగా నిలించింది. ప్రత్యేక శాసన సభా సమావేశాలు ఏర్పాటు చేసి మరీ ‘విభజన’ కోసం సిద్ధరామయ్య ప్రభుత్వం పట్టుబట్టినా ప్రయోజనం లేకుండా పోయింది. ప్రత్యేక శాసనసభల్లో భాగంగా మూడోరోజైన సోమవారం కూడా శాసనపరిషత్‌లో బీబీఎంపీ విభజన కోసం ప్రవేశపెట్టిన ‘కర్ణాటక మున్సిపల్ కార్పొరేషన్ (కేఎంసీ) విభజన (సవరణ) బిల్లు-2015’ పై అధికార విపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొంది. ఉదయం నుంచి సాయంత్రం వరకూ అధికార, విపక్షాలు విభజన బిల్లు పై చర్చించాయి. మండలి విపక్ష నాయకుడు కే.ఎస్ ఈశ్వరప్ప మాట్లాడుతూ...‘బెంగళూరు నగరాన్ని విభజించడం వల్ల కన్నడిగుల మధ్య ప్రాంతీయ భేదాలు ఉత్పన్నమయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. అంతేకాకుండా విభజన ముసాయిదా బిల్లు పై అనేక అనుమానాలు ఉన్నాయి. దీనిపై మరింత అధ్యయనం జరగాల్సి ఉంది. అందువల్ల బిల్లును సెలెక్ట్ కమిటీకు అప్పగించాల్సిందే’ అని పట్టుబట్టారు. ఇందుకు జేడీఎస్ సభ్యులు కూడా తమ మద్దతును తెలిపారు. అయితే అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు మాత్రం విభజన బిల్లు అనుమతి కోసం పట్టుబట్టారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య విపక్షాలకు ఎన్నిసార్లు సర్ధిచెప్పడానికి ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో సాయంత్రం 6.15 గంటలకు విభజన బిల్లును సెలెక్ట్ కమిటీకు అప్పగిస్తూ మండలి అధ్యక్షుడు శంకరమూర్తి నిర్ణయం తీసుకున్నారు. మూడు నెలల ఆగాల్సిందే... శాసనసభలో ఆమోదం పొందిన ఏదేని ముసాయిదా బిల్లు శాసనమండలికి ఆమోదం కోసం వచ్చిన తర్వాత ఆ బిల్లు పై మరింత అధ్యయనం కోసం సెక్షన్ 116ను అనుసరించి సెలెక్ట్ కమిటీకు అప్పగించే అధికారం శాసనమండలి అధ్యక్షుడికి ఉంది. ఈ నేపథ్యంలో విపక్ష సభ్యుల డిమాండ్ మేరకు బీబీఎంపీ విభజన ముసాయిదా బిల్లు సెలెక్ట్ కమిటీ చేతికి అప్పగిస్తూ అధ్యక్షస్థానంలో ఉన్న శంకరమూర్తి నిర్ణయం తీసుకున్నారు. కాగా, ప్రస్తుతం మండలిలో ఉన్న అధికార విపక్ష సభ్యుల సంఖ్యాబలాన్ని అనుసరించి సెలెక్ట్ కమిటీలోనూ విపక్షానిదే పై చేయిగా కనిపిస్తోంది. ఇరుపక్షాల ప్రస్తుత బలాబలాను అనుసరించి బీజేపీ,కాంగ్రెస్ పార్టీకు చెందిన చెరి నలుగురు సభ్యులు, జేడీఎస్‌కు చెందిన ఒక ఎమ్మెల్సీను సెలెక్ట్ కమిటీ సభ్యులుగా ఉండే అవకాశం ఉంది. ఈ కమిటీకు రాష్ట్ర న్యాయ,పార్లమెంటు వ్యవహారాల శాఖ మంత్రి, లేదా ముఖ్యమంత్రి అధ్యక్షుడిగా వ్యవహరించనున్నారు. ఈ కమిటీ మూడు నెలల్లోపు తన నివేదికను మండలిలో ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. ఒకవేళ నివేదికను మండలి ముందు తీసుకురాలేకపోతే ముసాయిదా బిల్లు తిరిగి శాసనసభకు వెళ్లి అక్కడ నేరుగా ఆమోదం పొంది అనుమతి కోసం గవర్నర్‌కు వద్దకు వెళ్లనుంది. సెలెక్ట్ కమిటీలో విపక్షాల సంఖ్యాబలమే ఎక్కువ... మండలిలోని మొత్తం సభ్యులు 75 అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు 28 బీజేపీ పార్టీ ఎమ్మెల్సీలు 30 జేడీఎస్ ఎమ్మెల్సీలు 12 స్వతంత్రులు 4 చైర్మన్ 1 ప్రభుత్వ మొండిపట్టుకు రూ.3 కోట్లు వృధా అధికార కాంగ్రెస్ ప్రభుత్వ మొండి వైఖరి వల్ల మూడు కోట్ల రూపాయల ప్రజాధనం వృధా అయ్యిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బీబీఎంపీ విభజన బిల్లు అమోదం కోసమే మూడు రోజుల పాటు ప్రత్యేక శాసనసభ సమావేశాలు నిర్వహించారు. ప్రజాప్రతినిధుల జీతభత్యాలు, విద్యుత్, భద్రతా తదితర విషయాలన్నీ పరిగణనలోకి తీసుకుంటే రాష్ట్రంలో ఒక్క రోజు చట్టసభలు నిర్వహించడానికి రూ.1 కోటి ఖర్చవుతోంది. దీంతో మూడు రోజులకు గాను దాదాపు మూడు కోట్ల రూపాయలు ఖర్చయినా విభజన బిల్లు చట్టసభల్లో పూర్తిస్థాయిగా ఆమోదం పొందకపోవడంతో దాదాపు రూ.3 కోట్లు ఖర్చయినట్లు ఆ పార్టీ నాయకులే పేర్కొంటున్నారు.