
న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈ నెల 20వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 19న అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం గురువారం వెల్లడించింది.
పార్లమెంట్ సమావేశాల ప్రారంభానికి ముందు అఖిలపక్ష భేటీ నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. వర్షాకాల సమావేశాల కోసం అధికార, విపక్షాలు తమ వ్యూహాలు, అ్రస్తాలతో సన్నద్ధమవుతున్నాయి.