రాష్ట్ర ప్రభుత్వాలు, వైద్య సంఘాలు సలహాలు సూచనలు ఇవ్వొచ్చు
కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటన
న్యూఢిల్లీ: కోల్‌కతాలో జూనియర్ డాక్టర్‌పై అత్యాచారం, హత్య.. తదనంతరం దేశవ్యాప్తంగా వైద్య సిబ్బంది ఆందోళన, నిరసన కార్యక్రమాల ఉధృతం అవుతుండడం, ఆసుపత్రల్లో వైద్య సేవలు నిలిచిపోతుండడంతో కేంద్ర ప్రభుత్వం దిగొచి్చంది. డాక్టర్లు, నర్సులు, ఇతర వైద్య సిబ్బందికి తగిన భద్రత కలి్పంచడానికి కట్టుబడి ఉన్నామని స్పష్టంచేసింది. వారి భద్రతకు ఎలాంటి చర్యలు చేపట్టాలన్న దానిపై సిఫార్సులు చేయడానికి ఒక కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది.
ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది. రాష్ట్ర ప్రభుత్వాలు, వైద్య సంఘాలు, ఇతర భాగస్వామ్య పక్షాలన్నీ ఈ కమిటీకి సలహాలు సూచనలు ఇవ్వొచ్చని, అభిప్రాయాలు తెలియజేయవచ్చని వెల్లడించింది. వైద్య సిబ్బంది వెంటనే విధుల్లో చేరాలని, రోగులకు చికిత్స అందించాలని కేంద్ర ఆరోగ్య శాఖ విజ్ఞప్తి చేసింది. దేశవ్యాప్తంగా డెంగ్యూ కేసులు పెరిగిపోతున్న సమయంలో డాక్టర్లు అందుబాటులో వైద్య సేవలు నిలిపివేయడం సరైంది కాదని సూచించింది.
ప్రధాని మోదీ జోక్యం చేసుకోవాలి: ఐఎంఏ
కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటనను నిశితంగా పరిశీలిస్తున్నామని ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) తెలియజేసింది. అ న్ని రాష్ట్రాల్లోని తమ ప్రతినిధులతో చర్చించి, తమ నిర్ణయం వెల్లడిస్తామని స్పష్టంచేసింది. హాస్పిటల్స్‌ను సేఫ్ జోన్లుగా ప్రకటించాలని, తగిన భద్రతా ఏర్పాట్లు చేయాలని, వైద్య సిబ్బందిపై హింస జరగకుండా ఒక చట్టం తీసుకురావాలని ఐఎంఏ డిమాండ్ చేసింది. తమ డిమాండ్ల విషయలో ప్రధాని నరేంద్ర మోదీ జోక్యం చేసుకోవాలని కోరింది.
రెండో రోజు విచారణకు హాజరైన సందీప్ ఘోష్
జూనియర్ డాక్టర్ పట్ల జరిగిన అమానవీయ ఘటనపై సీబీఐ దర్యాప్తు కొనసాగిస్తోంది. అనుమానితులను పిలిపించి ప్రశి్నస్తోంది. ఘాతకం జరిగిన ఆర్‌జీ కార్ మెడికల్ కాలేజీ, హాస్పిటల్ మాజీ ప్రిన్సిపాల్ డాక్టర్ సందీప్ ఘోష్ వరుసగా రెండో రోజు శనివారం కూడా సీబీఐ ఎదుట హారయ్యారు. సీబీఐ అధికారుల ప్రశ్నలకు సమాధానమిచ్చారు. జూనియర్ డాక్టర్ హత్య కేసులో అరెస్టయిన సంజయ్ రాయ్‌కి సైకలాజికల్ పరీక్షలు నిర్వహించాలని సీబీఐ అదికారులు నిర్ణయించారు. ఈ పరీక్షల కోసం ఢిల్లీ సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబోరేటరీ బృందం కోల్‌కతాకు చేరుకుంది.
దేశవ్యాప్తంగా స్తంభించిన వైద్య సేవలు
ఐఎంఏ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా వైద్యులు, వైద్య సిబ్బంది శనివారం రోడ్డెక్కారు. తమకు భద్రత కలి్పంచాలని, తమ డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నిరసన ప్రదర్శనలు చేపట్టారు. అత్యవసరం కాని ఇతర వైద్య సేవలను నిలిపివేశారు. ఢిల్లీ, పశి్చమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, పంజాబ్, మహారాష్ట్ర, హరియాణా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, ఒడి శా తదితర రాష్ట్రాల్లో ఆందోళన కార్యక్రమాలు జరిగాయి. ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో వైద్య సేవలు చాలావరకు నిలిచిపోయాయి.
Comments
Please login to add a commentAdd a comment