protest Activities
-
వైద్యుల భద్రతపై కమిటీ
న్యూఢిల్లీ: కోల్‌కతాలో జూనియర్ డాక్టర్‌పై అత్యాచారం, హత్య.. తదనంతరం దేశవ్యాప్తంగా వైద్య సిబ్బంది ఆందోళన, నిరసన కార్యక్రమాల ఉధృతం అవుతుండడం, ఆసుపత్రల్లో వైద్య సేవలు నిలిచిపోతుండడంతో కేంద్ర ప్రభుత్వం దిగొచి్చంది. డాక్టర్లు, నర్సులు, ఇతర వైద్య సిబ్బందికి తగిన భద్రత కలి్పంచడానికి కట్టుబడి ఉన్నామని స్పష్టంచేసింది. వారి భద్రతకు ఎలాంటి చర్యలు చేపట్టాలన్న దానిపై సిఫార్సులు చేయడానికి ఒక కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది. రాష్ట్ర ప్రభుత్వాలు, వైద్య సంఘాలు, ఇతర భాగస్వామ్య పక్షాలన్నీ ఈ కమిటీకి సలహాలు సూచనలు ఇవ్వొచ్చని, అభిప్రాయాలు తెలియజేయవచ్చని వెల్లడించింది. వైద్య సిబ్బంది వెంటనే విధుల్లో చేరాలని, రోగులకు చికిత్స అందించాలని కేంద్ర ఆరోగ్య శాఖ విజ్ఞప్తి చేసింది. దేశవ్యాప్తంగా డెంగ్యూ కేసులు పెరిగిపోతున్న సమయంలో డాక్టర్లు అందుబాటులో వైద్య సేవలు నిలిపివేయడం సరైంది కాదని సూచించింది. ప్రధాని మోదీ జోక్యం చేసుకోవాలి: ఐఎంఏ కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటనను నిశితంగా పరిశీలిస్తున్నామని ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) తెలియజేసింది. అ న్ని రాష్ట్రాల్లోని తమ ప్రతినిధులతో చర్చించి, తమ నిర్ణయం వెల్లడిస్తామని స్పష్టంచేసింది. హాస్పిటల్స్‌ను సేఫ్ జోన్లుగా ప్రకటించాలని, తగిన భద్రతా ఏర్పాట్లు చేయాలని, వైద్య సిబ్బందిపై హింస జరగకుండా ఒక చట్టం తీసుకురావాలని ఐఎంఏ డిమాండ్ చేసింది. తమ డిమాండ్ల విషయలో ప్రధాని నరేంద్ర మోదీ జోక్యం చేసుకోవాలని కోరింది. రెండో రోజు విచారణకు హాజరైన సందీప్ ఘోష్ జూనియర్ డాక్టర్ పట్ల జరిగిన అమానవీయ ఘటనపై సీబీఐ దర్యాప్తు కొనసాగిస్తోంది. అనుమానితులను పిలిపించి ప్రశి్నస్తోంది. ఘాతకం జరిగిన ఆర్జీ కార్ మెడికల్ కాలేజీ, హాస్పిటల్ మాజీ ప్రిన్సిపాల్ డాక్టర్ సందీప్ ఘోష్ వరుసగా రెండో రోజు శనివారం కూడా సీబీఐ ఎదుట హారయ్యారు. సీబీఐ అధికారుల ప్రశ్నలకు సమాధానమిచ్చారు. జూనియర్ డాక్టర్ హత్య కేసులో అరెస్టయిన సంజయ్ రాయ్‌కి సైకలాజికల్ పరీక్షలు నిర్వహించాలని సీబీఐ అదికారులు నిర్ణయించారు. ఈ పరీక్షల కోసం ఢిల్లీ సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబోరేటరీ బృందం కోల్‌కతాకు చేరుకుంది. దేశవ్యాప్తంగా స్తంభించిన వైద్య సేవలు ఐఎంఏ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా వైద్యులు, వైద్య సిబ్బంది శనివారం రోడ్డెక్కారు. తమకు భద్రత కలి్పంచాలని, తమ డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నిరసన ప్రదర్శనలు చేపట్టారు. అత్యవసరం కాని ఇతర వైద్య సేవలను నిలిపివేశారు. ఢిల్లీ, పశి్చమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, పంజాబ్, మహారాష్ట్ర, హరియాణా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, ఒడి శా తదితర రాష్ట్రాల్లో ఆందోళన కార్యక్రమాలు జరిగాయి. ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో వైద్య సేవలు చాలావరకు నిలిచిపోయాయి. -
కొత్త సంప్రదాయం.. నిరసనలకు ఒక రోజు
అమెరికాలోని ఫెయిర్‌ఫాక్స్ కౌంటీ పబ్లిక్ స్కూల్స్ యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. తమ విద్యార్థులు నిరసనలు, పౌర కార్యకలాపాల్లో పాల్గొనడానికి సంవత్సరానికి ఒకరోజు సెలవు ఇస్తున్నట్లు పేర్కొంది. ఈ పాఠశాల వర్జీనియాలోని అతి పెద్దదిగా పేరు గాంచింది. ఈ కొత్త విధానాన్ని ఫెయిర్‌ఫాక్స్ స్కూల్ బోర్డ్ సభ్యుడు ర్యాన్ మెక్ఎల్వీన్ ప్రవేశపెట్టినట్లు ది వాషింగ్టన్ పోస్ట్ తెలిపింది. మెక్ ఎల్వీన్ స్పందిస్తూ.. నిరసనలకు ఒకరోజు సెలవు ఇవ్వడం యుఎస్‌లోనే మొదటిసారి అని తెలిపారు. ఈ నిర్ణయంతో యూఎస్‌లోని మిగతా పాఠశాలలకు ప్రేరణ కలగవచ్చని తెలిపారు. ప్రస్తుతం విద్యార్థులు క్రియాశీలతతో వ్యవహరిస్తున్నారని అన్నారు. విద్యార్థులు సెలవు తీసుకోవడానికి తల్లిదండ్రులు, సంరక్షకులు అనుమతి ఇవ్వాలని అన్నారు. సెలవు తీసుకున్న కారణాన్ని వివరించడానికి విద్యార్థులు ఒక ఫారమ్‌ను నింపాలని మెక్ఎల్వీన్ తెలిపారు. విద్యార్థులకు అక్రిడేషన్ సమస్య ఉంటే సెలవు రోజులలో కూడా రావాలని జిల్లా మహిళా ప్రతినిధి లూసీ కాల్డ్వెల్ పేర్కొన్నారు. కాగా నిరసనల కోసం పాఠశాలలకు సెలవు ఇవ్వడం ఉదారవాద కారణాలకు అనుకూలంగా ఉంటుందని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ నియమాలను రాతపూర్వకంగా ఉంచుతామని కాల్డ్వెల్ తెలిపారు. మన భవిష్యత్తుకు భరోసా లేనప్పుడు పాఠశాలకు వెళ్లినా లాభం లేదని కాల్డ్వెల్ తెలిపారు. కాగా కొత్త విధానం ద్వారా వాతావరణ సమస్యల పరిష్కారం కోసం హాజరయ్యే విద్యార్థుల సంఖ్య మరింత పెరగనుందని తెలిపారు. ఏడు నుంచి 12 వ తరగతి చదివే విద్యార్థులు మార్చ్‌లకు హాజరు కావడం, రాజకీయ నాయకులతో సమావేశం నిర్వహించడం, పౌర కార్యకలాపాల కోసం సెలవును ఉపయోగించుకోవచ్చని లూసీ కాల్డ్వెల్ తెలిపారు. -
సీఏఏ: ఉక్కుపాదం మోపిన యూపీ ప్రభుత్వం
లక్నో : పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన నిరసన ప్రదర్శనల్లో హింసకు పాల్పడిన వ్యక్తుల ఫోటోలను ఉత్తరప్రదేశ్ పోలీసులు గురువారం విడుదల చేశారు. మవు జిల్లాలో నిందితుల పోస్టర్లతో పాటు వారిపై రివార్డు కూడా ప్రకటించారు. ఈ సందర్భంగా నిందితుల ఆచూకీ తెలిపిన వారి సమాచారం గోప్యంగా ఉంచుతామని పోలీసులు వెల్లడించారు. ఈ మేరకు నిందితుల ఫోటోలను వాట్సాప్, ఫేస్‌బుక్‌లలో షేర్ చేశారు. యూపీలో ఇప్పటివరకు జరిగిన హింసలో దాదాపు 17 మంది చనిపోయారని, 213 కేసులలో 925 మందిని అరెస్ట్ చేశామని యూపీ డీజీపీ కార్యాలయం తెలిపింది. మవు జిల్లాలో సోమవారం జరిగిన అల్లర్లలో పాల్గొన్న 110 మంది నిందితుల ఫోటోలతో కూడిన పోస్టర్‌ను పోలీసులు విడుదల చేశారు. నిందితుల వీడియోలు, ఫోటోలన్నీ సీసీ కెమెరాలు, మీడియా నుంచి సేకరించామని పోలీసులు తెలిపారు. మవు జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. ప్రజా ఆస్తులను ధ్వంసం చేసిన అంశంలో మూడు ఎఫ్ఐఆర్లు దాఖలు చేశామని, 21 మందిని అరెస్ట్ చేశామని వెల్లడించారు. కాన్పూర్ పోలీసులు శుక్ర, శనివారాలలో హింసకు పాల్పడిన 48 మంది నిందితులతో కూడిన పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ ఘటనలో ముగ్గురు చనిపోగా, 11 మంది గాయపడ్డారు. వీరిపై 17 ఎఫ్ఐఆర్లు నమోదు చేసి 24 మందిని అరెస్ట్ చేసినట్టు స్థానిక పోలీసు అధికారి వెల్లడించారు. ఫిరోజాబాద్‌లో శుక్రవారం జరిగిన అల్లర్లలో పాల్గొన్న 80 మంది నిందితుల ఫోటోలతో కూడిన పోస్టర్‌ను విడుదల చేశారు. బిజ్నూర్లో ముగ్గురు నిందితులపై 25వేల రివార్డు ప్రకటించగా, అల్లర్లలో ఇద్దరు చనిపోయారు. 146 మందిని అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. ఎస్పీ సంజీవ్ త్యాగి మాట్లాడుతూ.. విచారణలో మాజీ మున్సిపల్ చైర్మన్ జావేద్ అఫ్తాబ్, డా. ఫుర్ఖాన్ మెహర్బాన్, ఆదిల్లను గుర్తించాము. ఈ ముగ్గురిపై 25వేల రూపాయల రివార్డు ప్రకటించాము. ఈ ముగ్గురూ ప్రసుతం పరారీలో ఉన్నారు. డా. ఫుర్ఖాన్ బిజ్నూర్లో ఓ మదర్సా కూడా నడుపుతున్నాడని వివరించారు. గోరఖ్‌పూర్‌లో పోలీసులపై రాళ్లు రువ్విన ఘటనలో 16 మంది గాయపడ్డారు. ఈ నేపథ్యంలో 60 మంది నిందితుల ఫోటోలతో కూడిన పోస్టర్లను రిలీజ్ చేశారు. 33 మంది ఆస్తులను అటాచ్ చేస్తూ వారి ఇంటి గోడలపై నోటీసులు అంటించారు. ఈ విషయంపై పోలీస్ అధికారి జయదీప్ కుమార్ వర్మ మాట్లాడుతూ.. ఆ నోటీసులలో నిందితులు రెండు రోజుల్లో పోలీస్ స్టేషన్‌కు వచ్చి హాజరు కావాలని, లేకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నాం. అంతేకాకుండా అల్లర్లలో విధ్వంసానికి పాల్పడలేదని వారి దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే సమర్పించాలని కోరుతున్నామని వెల్లడించారు. మరోవైపు నిందితుల ఫోటోలతో కూడిన పోస్టర్లను విడుదల చేయడంపై సుప్రీంకోర్టు న్యాయవాది సరీం నవేద్ మాట్లాడుతూ.. పోలీసులు చట్టప్రకారమే వ్యవహరిస్తున్నారు. అయితే మైనర్ల విషయంలో చట్టాలు వేరేలా ఉంటాయి. నిబంధనల ప్రకారం మైనర్ల ఫోటోలను బహిరంగపరచకూడదు. ఈ విషయంలో పోలీసులు తగిన జాగ్రత్తలు తీసుకుంటారని ఆశిస్తున్నానని పేర్కొన్నారు. -
దేశం విడిచి వెళ్లాలంటూ జర్మన్ విద్యార్థికి ఆదేశం
సాక్షి, చెన్నై : పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన నిరసన ప్రదర్శనల్లో పాల్గొన్న ఓ జర్మన్ విద్యార్థిని అధికారులు దేశం నుంచి పంపించేశారు. అతని చర్య వీసా నిబంధనలను ఉల్లంఘిస్తోందని, దేశ బహిష్కరణ చేయకముందే దేశాన్ని విడిచి వెళ్లాలంటూ ఆ విద్యార్థికి ఇమ్మిగ్రేషన్ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. వివరాలు.. మద్రాస్ ఐఐటీలో భౌతికశాస్త్రంలో పీజీ చదువుతున్న జాకబ్ లిండెంతల్ అనే జర్మన్ విద్యార్థి గత వారం సీఏఏకు వ్యతిరేకంగా నిర్వహించిన నిరసన ప్రదర్శనలో పాల్గొన్నాడు. ఈ విషయం తెలుసుకొని జాకబ్‌ను విచారించిన ఇమ్మిగ్రేషన్ అధికారులు వీసా నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించినందుకు గాను సోమవారం అర్థరాత్రి కల్లా దేశం నుంచి వెళ్లిపోవాలంటూ ఆదేశాలు జారీ చేశారు. లేదంటే దేశ బహిష్కరణను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. దీంతో జాకబ్ చేసేది లేక సోమవారం మధ్యాహ్నం చెన్నై నుంచి బయలుదేరి అమ్‌స్టర్‌డామ్ నగరానికి చేరుకున్నారు. ఈ విషయంపై జాకబ్ స్పందిస్తూ.. నేను స్నేహితులతో చెపాక్, వల్లవర్ కొట్టంకు వెళ్లాను. అప్పటికి 144 సెక్షన్ విధించలేదు. సీఏఏపై ఎలాంటి అభిప్రాయాన్ని గానీ, వ్యతిరేకతను గానీ వ్యక్తం చేయలేదు. భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా ప్రవర్తించలేదని తెలిపాడు. అర్థాంతరంగా దేశం నుంచి వెళ్లగొట్టడంపై న్యాయ నిపుణులను సంప్రదించి తగిన నిర్ణయం తీసుకుంటానని జాకబ్ వెల్లడించాడు. ఈ పరిణామాలపై మద్రాస్ ఐఐటీని సంప్రదించగా, వారు ఇంకా స్పందించాల్సి ఉంది. -
పెట్టుబడిదారీ స్వర్గధామంలో చిచ్చు
ఆధునిక ప్రపంచంలో బడా ఆర్థిక శక్తులకు, నయా పెట్టుబడిదారీ విధానానికి అత్యంత పరమోదాహరణగా హాంకాంగ్ నిలుస్తుంది. ఈ రెండు ప్రభావాల ఫలితంగా 93 మంది బిలియనీర్లు ఉన్న ఈ మహానగరం (ప్రపంచంలో రెండో స్థానం)లోని ప్రజలు తీవ్రమైన ఆర్థిక అభద్రతతో ఇక్కట్లకు గురవుతున్నారు. పేరుమోసిన నల్ల మందు యుద్ధాల తర్వాత బ్రిటన్ 150 ఏళ్లకు పైగా హాంకాంగ్‌ని వలసగా మార్చుకుంది. 1997లో ఈ నగరంపై తన అధికారాన్ని వదులుకోవలసి వచ్చిన తరుణంలో, హాంకాంగ్‌ను స్వయం పాలనా ప్రాంతంగా మార్చడం ద్వారా 50 ఏళ్ల పాటు నగర రాజకీయ, ఆర్థిక వ్యవస్థలను మార్చకూడదనే షరతుతో బ్రిటన్ ఆమేరకు చైనాతో ఒప్పందం కుదుర్చుకుంది. బ్రిట¯Œ తో కుదిరిన ఒప్పందం ప్రకారం ఒక దేశం, రెండు వ్యవస్థలను కొనసాగించడం అంటే చైనా సామాజీకరించిన వ్యవస్థనుంచి విడివడి హాంకాంగ్‌లో అత్యంత తీవ్రస్థాయిలో పెట్టుబడిదారీవిధానం కొనసాగడమని అర్థం. హాంకాంగ్ శాసనసభలో 50 శాతం సీట్లను వ్యాపార వర్గాల ప్రయోజనాలకు కేటాయించారు. హాంకాంగ్‌లో తలదాచుకున్న తీవ్ర నేరçస్తులను తైవాన్, మకావు, చైనా తరలించడానికి న్యాయపరమైన యంత్రాంగాన్ని ఏర్పర్చడానికి 2019 ఫిబ్రవరిలో హాంకాంగ్ ప్రభుత్వం ఒక బిల్లును ప్రతిపాదించింది. హాంకాంగ్ వాసులు ప్రపంచ వ్యాప్తంగా 46 రకాల తీవ్ర నేరాలకు పాల్పడినప్పటికీ వారిపై ఎలాంటి చర్యలు చేపట్టలేకపోయిన నేపథ్యంలోనే చైనా ఈ నేరస్తుల తరలింపు బిల్లును తీసుకొచ్చింది. ఈ తరలింపు బిల్లుపై వీధుల్లో ప్రదర్శనలు తలపెట్టడానికి నెలల క్రితమే హాంకాంగ్‌లోని బిజినెస్ కమ్యూనిటీ ఈ బిల్లును వ్యతిరేకించింది. వైట్ కాలర్ నేరాలను ఈ తరలింపు బిల్లునుంచి మినహాయించాలని హాంకాంగ్‌లోని రెండు బడా బిజినెస్ అనుకూల పార్టీలు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చాయి. చైనా ప్రభుత్వం ఆర్థిక నేరాల ఆరోపణ చేస్తూ హాంకాంగ్‌లోని అంతర్జాతీయ వాణిజ్య సంస్థల ఎగ్జిక్యూటివ్‌లను అరెస్టు చేసినా, లేక వారిని హాంకాంగ్ నుంచి తరలించినా అంతర్జాతీయ వ్యాపార కార్యకలాపాల స్వర్గధామంగా హాంకాంగ్‌కు ఉన్న ప్రతిష్ఠ దెబ్బతింటుందని వీరి వాదన. సెంటర్ ఫర్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ ఎంటర్ప్రైజ్ అనుబంధ సంస్థ అయిన ఎన్ఈడీ.. ఈ బిల్లు ఆర్థిక స్వాతంత్య్రాన్ని దెబ్బతీస్తుందని, ఆరోపించడమే కాకుండా హాంకాంగ్‌లో చైనా వ్యతిరేక ఉద్యమానికి నేతృత్వం వహించింది. అమెరికా రాయబార కార్యాలయం ఈ ఉద్యమానికి పూర్తి మద్దతు ప్రకటించింది. దారినపోయేవారిపై, పోలీసులపై, మీడియాపై, ఎమర్జెన్సీ పనులు చేస్తున్న వారిపై హింసాత్మక దాడులకు ఉద్యమకారులు తలపెట్టడంతో జూలై 9న హాంకాంగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ కెర్రీ లామ్ ఈ తరలింపు బిల్లును సస్పెండ్ చేస్తున్న్టట్లు ప్రకటిం చారు. హాంకాంగ్‌లో అశాం తికి తరలింపు బిల్లు కంటే ఆర్థిక అభద్రతాభావమే ప్రధానకారణం. దశాబ్దాలుగా స్వేచ్ఛా మార్కెట్‌కు పగ్గాలు తెరిచి ప్రజలకు ఏ మేలూ చేయని తరహా విధానాల స్థానంలో మెజారిటీ ప్రజల ప్రయోజనాలు కాపాడే పాలనవైపుగా మారాలని హాంకాంగ్ వాసుల డిమాండ్. చైనాలో నయా ఉదారవాదం ఏ స్థాయికి చేరిందంటే 80 శాతం బ్యాంకులు బడా వాణిజ్యవర్గాలకు రుణాలు అందిస్తూ, కార్మికులకు అయ్యే వ్యయంపై కంపెనీలకే రాయితీలను అందిస్తున్నాయి. ఇలా రాయితీలివ్వడం అధర్మ వ్యాపారం అని అమెరికా వాదన. మరోవైపున పెట్టుబడిదారీ విధానానికి తనదైన ప్రత్యేక మార్గంలో తలుపులు తెరిచేసిన చైనాలో కార్మికులు వేలాది ప్రదర్శనలు, సమ్మెలు, ఆందోళనలు జరుగుతున్నట్లు నమోదవుతూనే ఉన్నాయి. ఈ ఆర్థిక సవాళ్లను, అసమానతల్ని, పర్యావరణ సమస్యలను చైనా ఎలా ఎదుర్కోనుంది అనేది దాని పాలనకు నిజమైన పరీక్షగా నిలుస్తోంది. బ్రిటన్, అమెరికా, పాశ్చాత్య శక్తులతో హాంకాంగ్‌పై చైనా కుదుర్చుకున్న ఒడంబడిక 2047లో ముగియనున్న నేపథ్యంలో హాంకాం గ్లో యథాతథ స్థితిని కొనసాగించాలని అంతర్జాతీయ వాణిజ్య శక్తులు ప్రయత్నిస్తున్నాయి. అమెరికన్ డాలర్‌కి, చైనా యువా¯Œ కు మధ్య జరుగుతున్న ఆర్థిక కుమ్ములాటే హాంకాంగ్ నేటి ఘర్షణలకు మూలబిందువుగా మారింది. నయా ఉదారవాదానికి చెందిన ఈ ఆర్థిక, రాజకీయ వ్యవస్థల ఘర్షణలు ఎలా తొలగిపోతాయి అనేది చైనా తన అంతర్గత వైరుధ్యాలను ఎలా పరిష్కరించుకోగలుగుతుంది అనే అంశంపైనే ఆధారపడి ఉంది. -కె. రాజశేఖరరాజు -
రుణమాఫీ కోసం కదంతొక్కిన వైఎస్సార్సీపీ
-
రుణమాఫీ కోసం కదంతొక్కిన వైఎస్సార్సీపీ
►పూర్తి స్థాయిలో అమలుకు రైతులు, డ్వాక్రా మహిళల డిమాండ్ ►చంద్రబాబు నిర్ణయాలకు నిరసనగా దిష్టిబొమ్మల దహనం ►ఆందోళనలను అడ్డుకునేందుకు పోలీసుల ఓవరాక్షన్ ►తెనాలిలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల దౌర్జన్యం సాక్షి ప్రతినిధి, గుంటూరు : రుణమాఫీపై రాష్ట్ర ఫ్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా గురువారం జిల్లాలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు జరిగాయి. వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు ఆ పార్టీ కార్యకర్తలు, నాయకులు ‘నరకాసుర వధ’ పేరిట ముఖ్యమంత్రి చంద్రబాబు దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఎన్నికల సమయంలో రైతులు, డ్వాక్రా మహిళలకు ఇచ్చిన రుణమాఫీ హామీలను పూర్తిగా అమలు చేయాలని, లేనిపక్షంలో ప్రజలకు క్షమాపణ చెప్పి పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు. బాబు వైఖరిని వ్యతిరేకిస్తూ పార్టీ కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున నినదించారు. సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ‘నరకాసుర వధ’ కార్యక్రమానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించింది. నియోజకవర్గాల్లోని మారుమూల ప్రాంతాల్లో పెద్ద ఎత్తున జరిగిన ఈ ఆందోళనలు నిలిపివేసేందుకు అటు పోలీసులు, ఇటు టీడీపీ కార్యకర్తలు విఫలయత్నాలు చేశారు. చంద్రబాబు దిష్టిబొమ్మలను దహనం చేయకుండా వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై పోలీసులు తమ జులుం ప్రదర్శించారు. నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేస్తామని బెదిరించారు. ప్రతిపక్ష పార్టీ గొంతునొక్కే ప్రయత్నాలను అటు పోలీసులు, ఇటు అధికార పార్టీ నాయకులు పూర్తి స్థాయిలో చేపట్టారు. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్, ఎమ్మెల్యేలు ఆళ్ల రామ కృష్ణారెడ్డి, కోన రఘుపతి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డిలు తమ నియోజకవర్గాల్లో ఆందోళన కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహించారు. ఆచరణ సాధ్యం కాని హామీలను ఇచ్చి చంద్రబాబు ప్రజలను మోసం చేశారని, ఆయన హామీలు నమ్మి రైతులు, డ్వాక్రా మహిళలు అనేక ఇబ్బందులు పడుతున్నారనీ ఎమ్మెల్యేలు ఆందోళన వ్యక్తం చేశారు. తెనాలి నియోజకవర్గ ఇన్చార్జి అన్నాబత్తుని శివకుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఆందోళన కార్యక్రమాన్ని నిలువరించేందుకు టీడీపీ కార్యకర్తలు దౌర్జన్యానికి దిగారు. వారిని అడ్డుకోవాల్సిన పోలీసులు అధికార పార్టీకి మద్దతుగా నిలిచి ఆందోళనను విఫలం చేసేందుకు తమ వంతు సహకారం అందించారు. రేపల్లె నియోజకవర్గంలో మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ, వేమూరు నియోజకవర్గ సమన్వయకర్త మేరుగ నాగార్జున, గురజాల నియోజకవర్గంలో జంగా కృష్ణమూర్తి, తాడికొండ నియోజకవర్గంలో క్రిస్టినాలు ఆందోళన కార్యక్రమాలను నిర్వహించగా, మిగిలిన నియోజకవర్గాల్లో పార్టీ మండల స్థాయి నాయకులు పాల్గొన్నారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో మైనార్టీ నాయకుడు చాంద్‌బాషా ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం జరిగింది.