తెలంగాణ ప్రజలు ఆకాంక్ష, ఆత్మగౌరవం ప్రతిబింబించేలా కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకోవడం సంతోషకరమని మాజీ మంత్రి డీకే సమరసింహారెడ్డి అన్నారు.శుక్రవారం స్థానిక తన నివాసంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదన్నారు.
గద్వాల న్యూటౌన్, న్యూస్‌లైన్: తెలంగాణ ప్రజలు ఆకాంక్ష, ఆత్మగౌరవం ప్రతిబింబించేలా కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకోవడం సంతోషకరమని మాజీ మంత్రి డీకే సమరసింహారెడ్డి అన్నారు.శుక్రవారం స్థానిక తన నివాసంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదన్నారు. ఆర్టికల్-3 ప్రకారం ముందుగా రాష్ట్రపతి అనుమతితో బిల్లును ప్రవేశ పెట్టి...చివరకు రాష్ట్రపతి ఆమోద ముద్రపడిన తర్వాతే కలసాకారం అవుతుందన్నారు. ఈ ప్రక్రియ ఐదు దశల్లో ఉంటుందని, చివరి ప్రక్రియ జరిగే వరకు తెలంగాణ వాదులు అప్రమత్తంగా ఉండాలన్నారు.
బిల్లు ఆమోదముద్ర పొందిన తర్వాత రాష్ట్రంలో సెక్షన్-3 ప్రకారం సవరణలు తెచ్చిన తర్వాతే ప్రక్రియ పూర్తి అవుతుందన్నారు. తెలంగాణ కల సాకారం అవుతున్న వేళ ఈ ప్రాంత ప్రజలు సీమాంధ్రుల పట్ల ప్రేమపూర్వకంగా ఉండాలని కోరారు. ఆంధ్ర ఎన్‌జీఓలు రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తున్నారని, అశోక్‌బాబు తనను తాను కంట్రోల్ చేసుకోవాలని సూచించారు. కొంతమంది సీమాంధ్రులు జూరాల ప్రాజెక్టు ఎత్తున పెంచుతారని అసత్య ప్రచారం చేస్తున్నారని, సాంకేతికంగా ఇది సాధ్యం కాదన్నారు. సమావేశంలో టీడీపీ నేతలు వేణుగోపాల్, లత్తిపురం వెంకట్రామిరెడ్డి, ఇస్మాయిల్, కర్ణకుమార్, తదితరులు పాల్గొన్నారు.