Cabinet decision
-
హైడ్రాకు పూర్తి స్వేచ్ఛ
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ విపత్తు నిర్వహణ– ఆస్తుల పర్యవేక్షణ, పరిరక్షణ సంస్థ (హైడ్రా)కు పూర్తిస్థాయి స్వేచ్ఛ కలి్పస్తూ రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) లోపల ఉన్న చెరువులు, కుంటలు, రిజర్వాయర్లలో, ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో, నాలాలపై ఉన్న అక్రమ కట్టడాల కూలి్చవేతల విషయంలో మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, రెవెన్యూ, నీటిపారుదల తదితర శాఖలకు ఉన్న విశేష అధికారాలను హైడ్రాకు ఇవ్వాలని నిర్ణయించింది.సంస్థకు చట్టబద్ధత కూడా కల్పించాలని నిర్ణయించింది. ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి అధ్యక్షతన శుక్రవారం సాయంత్రం సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. సుమారు మూడు గంటలకు పైగా జరిగిన ఈ భేటీలో పలు కీలక అంశాలపై విస్తృతంగా చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. అనంతరం మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సచివాలయంలో మీడియాకు వివరాలు వెల్లడించారు. ట్రిపుల్ ఆర్ దక్షిణ అలైన్‌మెంట్‌పై కమిటీ ‘ఓఆర్ఆర్కు లోపల ఉన్న కోర్ అర్బన్ రీజియన్‌లోని 24 పురపాలికలు, 51 గ్రామ పంచాయతీల పరిధిలో అన్ని శాఖలకు ఉన్న స్వేచ్ఛ(అధికారాలు)ను హైడ్రాకు కల్పించేలా నిబంధనలను సడలించాం. వివిధ విభాగాలకు చెందిన 169 మంది అధికారులు, 946 మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను డిప్యుటేషన్‌పై హైడ్రాలో నియమించాలని నిర్ణయం తీసుకున్నాం.రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్ఆర్ఆర్) దక్షిణ భాగం అలైన్మెంట్ ఖరారు చేసేందుకు ఆర్అండ్బీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో 12 మంది అధికారులతో కమిటీ ఏర్పాటు చేశాం. కమిటీ కనీ్వనర్‌గా ఆర్అండ్బీ ముఖ్య కార్యదర్శి, సభ్యులుగా పురపాలక, రెవెన్యూ శాఖల కార్యదర్శులు, ఐదారు జిల్లాల కలెక్టర్లు, ఆర్అండ్బీ, నేషనల్ హైవే ఆథారిటీ, జియోలాజికల్ విభాగాల అధికారులు ఉంటారు..’ అని పొంగులేటి తెలిపారు. 8 కొత్త వైద్య కళాశాలలకు 3 వేల పైచిలుకు పోస్టులు ‘హైదరాబాద్ నగరం కోఠిలోని మహిళా యూనివర్సిటీకి వీరనారి చాకలి ఐలమ్మ, పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీకి సురవరం ప్రతాప్‌రెడ్డి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేర్లను పెట్టాలని నిర్ణయించాం. ప్రస్తుతం అమల్లో ఉన్న పోలీసు ఆరోగ్య భద్రత పథకాన్ని ఎస్పీఎల్ కింద కూడా వర్తింపజేయాలని నిర్ణయించాం.తెలంగాణ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మనోహరాబాద్ మండలంలో మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్ ఏర్పాటుకు గాను 72 ఎకరాల భూమిని రెవెన్యూ శాఖ నుంచి పరిశ్రమల శాఖకు బదిలీ చేయాలని నిర్ణయించాం. అలాగే ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలంలో ఇండ్రస్టియల్ పార్క్ ఏర్పాటుకు 58 ఎకరాల భూమిని రెవెన్యూ నుంచి పరిశ్రమల శాఖకు బదిలీ చేయనున్నాం. ములుగు జిల్లా ఏటూరునాగారం ఫైర్ స్టేషన్‌కు 34 మంది సిబ్బందిని మంజూరు చేశాం. రాష్ట్రంలో కొత్తగా అనుమతి పొందిన 8 వైద్య కళాశాలలకు బోధన, బోధనేతర సిబ్బంది కలిపి మొత్తం 3 వేల పైచిలుకు పోస్టులను మంజూరు చేశాం. కొద్దిరోజుల్లో నోటిఫికేషన్ జారీ చేస్తాం. కోస్గికి ఇంజనీరింగ్ కాలేజీ, హకీంపేటకు జూనియర్ కళాశాల మంజూరు చేశాం. ఇందిరమ్మ ఇళ్ల పంపిణీపై తదుపరి మంత్రివర్గ సమావేశంలో నిర్ణయాలు తీసుకుంటాం..’ అని పొంగులేటి చెప్పారు. కాంగ్రెస్‌కు పేరొస్తుందనే ఎస్ఎల్బీసీపై నిర్లక్ష్యం: కోమటిరెడ్డి ‘కాంగ్రెస్ పారీ్టకి, తనకు పేరు వస్తుందనే అక్కసుతో కేసీఆర్ గత 10 ఏళ్లలో ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును నిర్లక్ష్యం చేశారు. నల్లగొండ జిల్లాలో రూ.6 వేల కోట్ల మిషన్ భగీరథ పనులు జరిగితే, రూ.4 వేల కోట్ల కుంభకోణం జరిగింది. నల్లగొండలో ఫ్లోరైడ్ తగ్గిందంటూ కేసీఆర్ అబద్ధాలు చెప్పారు. వాస్తవానికి ఫ్లోరైడ్ తీవ్రత పెరిగినట్టు కేంద్రం నివేదిక ఇచి్చంది..’ అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చెప్పారు.2027 నాటికి ఎస్ఎల్బీసీ, డిండి పూర్తి: ఉత్తమ్ ‘ఎస్ఎల్బీసీ సొరంగం ప్రాజెక్టు సవరించిన అంచనా వ్యయం రూ.4,637 కోట్లకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. నల్లగొండ జిల్లా ప్రజల చిరకాల వాంఛ అయిన ఎస్ఎల్బీసీ, డిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ప్రాజెక్టులను సత్వరం పూర్తి చేసి 2027 సెపె్టంబర్‌లోగా ప్రారంభిస్తాం. ఎస్ఎల్బీసీ సొరంగం రెండేళ్లలో పూర్తి చేయాలని నిర్మాణ సంస్థ జేపీ అసోసియేట్స్‌ను ఆదేశించాం.డిండి ప్రాజెక్టు కు పర్యావరణ అనుమతుల సాధనకు, మిగిలి న 5 శాతం పనుల పూర్తికి ఒక ప్రత్యేకాధికారిని నియమించాల్సిందిగా సీఎం సూచించారు. ఖరీఫ్‌లో సన్నాలను పండించిన రైతులకు క్వింటాల్‌కు రూ.500 బోనస్ చెల్లించాలని మంత్రి వర్గం నిర్ణయించింది. ఖరీఫ్‌లో రికార్డు స్థాయి లో 1.43 లక్షల మెట్రిక్ టన్నుల పంట రానుంది. వచ్చే నెలలో కొత్త తెల్లరేషన్ కార్డుల జారీని ప్రారంభిస్తాం. జనవరి నుంచి రేషన్‌కార్డులపై సన్నబియ్యం సరఫరా చేస్తాం.. అని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ తెలిపారు.బిల్లులు రావట్లేదు సార్ కేబినెట్ భేటీలో ఆసక్తికర చర్చ జరిగింది. నియోజకవర్గ అభివృద్ధి పనుల నిమిత్తం తాము మంజూరు చేసిన పనులకు సకాలంలో బిల్లులు విడుదల చేయడం లేదని పలువురు మంత్రులు..సీఎం రేవంత్ దృష్టికి తెచి్చనట్లు తెలిసింది. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి.. ఆయా బిల్లులు త్వరితగతిన విడుదల చేసేలా చర్యలు తీసుకోవాల్సిందిగా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. -
జయ జయహే తెలంగాణ!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఉద్యమానికి ఊపునిచ్చి, ఉత్తేజం రగిల్చిన ‘జయజయహే తెలంగాణ’ పాటను రాష్ట్ర గేయంగా గుర్తించాలని మంత్రివర్గం నిర్ణయించింది. దీనితోపాటు తెలంగాణ ఏర్పాటు కోసం జరిగిన సుదీర్ఘ ఉద్యమ ప్రస్థానం భావితరాలకు గుర్తుండేలా కీలక మార్పులు చేపట్టాలని తీర్మానించింది. తెలంగాణ ఆత్మ కనిపించేలా రాష్ట్ర చిహ్నం, తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పులు చేస్తామని ప్రకటించింది. ఈ మేరకు ఆదివారం సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన కేబినెట్ పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. దాదాపు నాలుగు గంటల పాటు జరిగిన ఈ భేటీలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ఇతర మంత్రులు, సీఎస్, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 25కుపైగా అంశాలపై చర్చించారు. వాహనాల రిజి్రస్టేషన్ నంబర్లలో రాష్ట్ర కోడ్‌గా ‘టీఎస్’కు బదులు ‘టీజీ’ని ఉపయోగించాలని నిర్ణయించారు. ఈ నెల ఎనిమిదో తేదీ నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను నిర్వహించేందుకు.. కాంగ్రెస్ సర్కారు ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో మరో రెండింటిని ఈ సమయంలోనే ప్రారంభించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అనంతరం సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు మీడియాకు వివరించారు. ఇందిరమ్మ రాజ్య ఫలాలు అందిస్తాం కాంగ్రెస్ పార్టీకి అధికారమిచ్చిన రాష్ట్ర ప్రజలకు ఇందిరమ్మ రాజ్య ఫలాలు అందిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు. ఈ నెల 8 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించినట్టు తెలిపారు. తొలిరోజున గవర్నర్ ప్రసంగిస్తారని, తర్వాతి రోజు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం ఉంటుందని తెలిపారు. మూడో రోజు బడ్జెట్ ప్రవేశపెడతామన్నారు. అసెంబ్లీ సమావేశాలు ఎన్నిరోజులు కొనసాగించేదీ బీఏసీ భేటీలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ‘‘తెలంగాణ రాష్ట్రం కోసం సుదీర్ఘ పోరాటం జరిగింది. అలాంటి పోరాటాన్ని కాదని రాచరిక పోకడలతో రూపొందించిన రాష్ట్ర చిహ్నాన్ని మారుస్తాం. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి కనిపించేలా చిహ్నాన్ని రూపొందిస్తాం. తెలంగాణ తల్లి రూపాన్ని కూడా తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలు కనిపించేలా మారుస్తాం. తెలంగాణ గేయంగా అందెశ్రీ రాసిన జయజయõహే తెలంగాణ పాట గుర్తించాలని మంత్రిమండలి నిర్ణయించింది..’’ అని పొంగులేటి తెలిపారు. త్వరలోనే కులగణన రాష్ట్రంలో బీసీలకు సంక్షేమ ఫలాలు పక్కాగా దక్కేలా కులగణన చేపట్టాలని కేబినెట్ నిర్ణయం తీసుకుందని మంత్రి పొంగులేటి చెప్పారు. ఇందుకు సంబంధించిన విధివిధానాలను అధికార యంత్రాంగం రూపొందిస్తోందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం గతంలో తెలంగాణ గెజిట్‌లో భాగంగా.. వాహనాల నంబర్ ప్లేట్లపై ‘టీజీ’ని నిర్దేశించిందని.. కానీ గత ప్రభుత్వం వారి పార్టీ ఆనవాళ్లు కనిపించేలా ‘టీఎస్’ను ఖరారు చేసిందని పేర్కొన్నారు. కేంద్ర గెజిట్ ప్రకారం టీఎస్‌కు బదులు టీజీగా మార్చాలని నిర్ణయించినట్టు వివరించారు. వీఆర్ఓల అంశంపై కేబినెట్ నిర్ణయం తీసుకోనప్పటికీ.. త్వరలోనే కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. అసెంబ్లీ సమావేశాల్లోనే మరో రెండు గ్యారంటీ హామీలను సీఎం చేతుల మీదుగా ప్రారంభించనున్నట్టు వెల్లడించారు. త్వరలోనే భారీగా ఉద్యోగాల భర్తీ.. రాష్ట్రంలోని 65 ఐటీఐలను ఏటీసీలుగా అప్‌గ్రేడ్ చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపిందని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. హైకోర్టు నిర్మాణం కోసం వంద ఎకరాల భూమి కేటాయింపునకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్టు చెప్పారు. త్వరలో వ్యవసాయాధికారి పోస్టుల భర్తీ చేపడతామన్నారు. గ్రూప్–1, ఇతర కేటగిరీల్లో ఉద్యోగ ఖాళీలను గుర్తించి, భర్తీ చేసే దిశగా కసరత్తు ముమ్మరంగా కొనసాగుతోందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్ ఉద్యోగాల భర్తీ కోసం అతి త్వరలో మెగా డీఎస్సీ నిర్వహిస్తామన్నారు. చక్కెర ఫ్యాక్టరీల పునరుద్ధరణపై నివేదిక ఇవ్వండి రాష్ట్రంలో మూతపడిన నిజాం చక్కెర కర్మాగారాల పునరుద్ధరణ అంశంపై వీలైనంత త్వరగా నివేదిక ఇవ్వాలని కేబినెట్ సబ్ కమిటీకి సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. ఆదివారం సచివాలయంలో సబ్ కమిటీతో ఈ అంశంపై సమీక్షించారు. బోధన్, ముత్యంపేటలలో మూతపడ్డ నిజాం షుగర్ ఫ్యాక్టరీలు చెల్లించాల్సిన పాత బకాయిలు, వాటి ఆర్థిక ఇబ్బందులు, ఆయా ప్రాంతాల్లోని చెరుకు రైతుల అవసరాలు, ప్రస్తుత పరిస్థితులపై సమగ్రంగా చర్చించారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ.. చక్కెర ఫ్యాక్టరీలను తెరిపించేందుకు అన్ని మార్గాలను అన్వేషించాలని, తగిన సూచనలను అందించాలని కమిటీని కోరారు. త్వరగా నివేదిక సిద్ధం చేస్తే.. మరోసారి సమావేశమై నిర్ణయం తీసుకుందామని సూచించారు. ఈ కమిటీ చైర్మన్, మంత్రి శ్రీధర్‌బాబు, ఇతర మంత్రులు దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు సుదర్శన్‌రెడ్డి, రోహిత్‌రావు, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, మాజీ ఎమ్మెల్యే ఎ.చంద్రశేఖర్, సంబంధిత శాఖల అధికారులు ఈ భేటీలో పాల్గొన్నారు. -
చెరుకు రైతులకు కేంద్రం శుభవార్త
సాక్షి, న్యూఢిల్లీ: చెరుకు రైతులకు కేంద్రం శుభవార్త చెప్పింది. క్వింటాలు చెరుకుకు 290 రూపాయల లాభదాయక ధర(ఫెయిర్ అండ్ రెమ్యునరేటివ్ ప్రైస్- ఎఫ్ఆర్పీ) ఇచ్చేందుకు కేంద్రం మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయంతో ఐదు కోట్ల మంది చెరుకు రైతులు, ఐదు కోట్ల మంది కూలీలకు ప్రయోజనం చేకూరనుంది. చెరుకు రైతులకు గ్యారంటీ ధర దక్కనుంది. అదే విధంగా.. దేశీయంగా చక్కెర ఉత్పత్తికి ప్రోత్సాహం అందనుంది. మిగులు చెరుకుతో ఇథనాల్ ఉత్పత్తి చేసే అవకాశం కలుగుతుంది. ఈ మేరకు.. కేంద్ర ఆహార, పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖా మంత్రి పీయూష్ గోయల్ మీడియాకు బుధవారం వివరాలు వెల్లడించారు. చదవండి: సీఎంపై అనుచిత వ్యాఖ్యలు.. కేంద్ర మంత్రి నారాయణ రాణె అరెస్ట్ -
కేబినెట్ నిర్ణయం
-
‘చమురు’ కేటాయింపు అధికారం మంత్రులకే
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ముడిచమురు, గ్యాస్ క్షేత్రాల లైసెన్సుల్ని కంపెనీలకు కేటాయించే అధికారాన్ని ఆర్థిక, పెట్రోలియం మంత్రిత్వశాఖలకు అప్పగిస్తూ ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇంతకాలం ఈ లైసెన్సులను జారీచేసే అధికారం కేబినెట్ కమిటీకే ఉండేది. ఎంపవర్డ్ కమిటీ ఆఫ్ సెక్రటరీస్(ఈసీఎస్) సిఫార్సుల మేరకు బిడ్డింగ్‌లో విజేతలుగా నిలిచిన సంస్థలకు బ్లాకుల్లో పెట్రోలియం, సహజవాయువు వెలికితీతకు ఆర్థిక, పెట్రోలియం శాఖ మంత్రులు లైసెన్సులు జారీచేస్తారని కేంద్రం తెలిపింది. కాంట్రాక్టును దక్కించుకున్న కంపెనీలు తమ వాటాల్లో కొంతమొత్తాన్ని ఇతర సంస్థలకు అమ్ముకునేందుకు ఇకపై అనుమతిస్తారు. -
ఈ ఏడాది 2 లక్షల ఇళ్లు
ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం కింద నిర్మించాలని కేబినెట్ నిర్ణయం * ఒంగోలు ట్రిపుల్ఐటీకి అబ్దుల్ కలాం పేరు * రిషితేశ్వరి కుటుంబానికి రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా, 500 గజాల స్థలం సాక్షి, విజయవాడ బ్యూరో: రాష్ట్రంలో ఇళ్ల నిర్మాణానికి పలు చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం కింద ఈ సంవత్సరం రూ. 5,500 కోట్లతో రెండు లక్షల ఇళ్లు నిర్మించాలని మంత్రివర్గం నిర్ణయించింది. కాలనీల్లో 1.50 లక్షల కొత్త ఇళ్లతో పాటు స్థలం ఉండి నిబంధనలకు అనుగుణంగా ఉన్న మరో 50 వేల ఇళ్లకు అనుమతివ్వాలని తీర్మానించింది. ఒక్కో ఇంటిని 279 చదరపు అడుగుల విస్తీర్ణంలో రూ. 2.75 లక్షలతో నిర్మించాలని నిర్ణయించింది. దీనిలో ఎస్సీ, ఎస్టీలకు రూ. 1.75 లక్షల సబ్సిడీ, లక్ష బ్యాంకు రుణం, ఇతరులకు 1.25 లక్షల సబ్సిడీ, 1.50 లక్షల బ్యాంకు రుణం ఇప్పించాలని నిర్ణయించింది. శుక్రవారం ఇక్కడ ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6.30 గంటల వరకూ మంత్రివర్గం భేటీ అయింది. ఆ వివరాలను మంత్రులు యనమల రామకృష్ణుడు, గంటా శ్రీనివాసరావు, దేవినేని ఉమ, ప్రత్తిపాటి పుల్లారావు, అచ్చెన్నాయుడులతో కలసి సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి మీడియాకు వివరించారు. ఆ వివరాలు... * గతంలో రాజీవ్ స్వగృహ కింద 2,898 ఇళ్లు కట్టాలని నిర్ణయించగా 882 ఇళ్లు మాత్రమే పూర్తయ్యాయి. మిగిలిన ఇళ్లను పూర్తి చేసే బాధ్యత స్విస్ చాలెంజ్ లేదా బహిరంగ టెండర్ల విధానంలో కాంట్రాక్టర్లకు అప్పగిస్తారు. * కేంద్ర గృహ నిర్మాణ విధానం ఖరారైన తర్వాత రాష్ట్రంలో ఉద్యోగులు, పేదల ఇళ్ల నిర్మాణంపై నిర్ణయం. * మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం జ్ఞాపకార్థం నాగార్జున యూనివర్సిటీలో కాంస్య విగ్రహం ఏర్పాటు. రాష్ట్రంలో ఇచ్చే ప్రతిభ అవార్డులను కలాం పేరుతో ఇవ్వడానికి నిర్ణయం. కొత్తగా ఒంగోలులో ఏర్పాటుచేసే ట్రిపుల్ ఐటీకి కలాం పేరు. * నాగార్జున వర్సిటీ విద్యార్థిని రిషితేశ్వరి మృతికి సంతాపం. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించి ఇకపై ఇలాంటి ఘటనలు జరక్కుండా పకడ్బందీ చర్యలు. ఆమె కుటుంబానికి రూ. 10 లక్షల ఎక్స్‌గ్రేషియా, రాజమండ్రిలో 500 చదరపు గజాల స్థలం. * నివర్సిటీలను ప్రక్షాళన చేసి అన్ని స్థాయిల్లో ర్యాగింగ్ నిరోధించడానికి చర్యలు. * 75 శాతం హాజరు లేని విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లు నిలిపివేత. వారు పరీక్షలు రాసేందుకు అనుమతి నిరాకరించేలా చర్యలు. యూనివర్సిటీల్లో రెండో కోర్సు చేసే విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ నిరాకరణ. వర్సిటీల్లో ల్యాండ్ బ్యాంక్ పరిరక్షణకు చర్యలు. అన్ని యూనివర్సిటీలకు సమర్థులైన వీసీలు. నాగార్జున వర్సిటీకి ప్రొఫెసర్ సింహాద్రి పేరు పరిశీలన. * హంద్రీ-నీవా, గాలేరు-నగరి, గుండ్లకమ్మ, పట్టిసీమ, పోలవరం కుడికాలువ, తోటపల్లి, వంశధార ప్రాజెక్టుల నిర్మాణానికి అత్యధిక ప్రాధాన్యత. * అనంతపురం జిల్లాల్లో ఉపాధి హామీ పథకం పని దినాలు 100 నుంచి 150కి పొడిగింపు. ఉల్లిపాయల ధర కేజీ రూ. 20కి మించకుండా చర్యలు. * అన్ని శాఖల్లో ఐటీని ఉపయోగించుకునేందుకు లక్ష ట్యాబ్‌ల కొనుగోలుకు నిర్ణయం. ఇప్పటికే 75,148 ట్యాబ్‌ల కొనుగోలు. * వచ్చే నెల పదో తేదీ నుంచి మీ భూమి, మీ ఇల్లు కార్యక్రమం ప్రారంభం. * మూడో విడత రుణమాఫీకి వచ్చిన 5.15 లక్షల ఫిర్యాదులు ఆగస్టు 15లోపు పరిష్కరించాలని, దానికోసం రూ. 835 కోట్లు విడుదలకు నిర్ణయం. -
‘మెట్రో’కు జపాన్ రుణం
2019 నాటికి విజయవాడ మెట్రో పూర్తి చేయాలని లక్ష్యం * అక్టోబర్ 22న రాజధాని ‘అమరావతి’కి శంకుస్థాపన * ప్రధాని మోదీతోపాటు జపాన్, సింగపూర్ల ప్రధానులకు ఆహ్వానం: కేబినెట్ నిర్ణయం సాక్షి, హైదరాబాద్: జపాన్ ఇంటర్నేషనల్ కోపరేషన్ సంస్థ(జైకా) రుణ సహకారం రూ.3,600 కోట్లతో విజయవాడలో మెట్రో రైలును పట్టాలెక్కించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తం రూ.6,823 కోట్ల అంచనాతో 2019 నాటికి మెట్రో రైలు ప్రాజెక్టును పూర్తి చేయాలని లక్ష్యం విధించుకుంది. కేంద్రం, ఏపీ ప్రభుత్వం చెరో రూ.866 కోట్లను దీనికోసం ఖర్చు చేయనున్నాయి. పునర్విభజన చట్టం 13వ షెడ్యూల్లో పేర్కొన్నవిధంగా విజయవాడ, విశాఖల్లో మెట్రో రైలు ప్రాజెక్టులు చేపట్టేందుకు కేంద్రం అనుమతించినందున ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్(డీఎంఆర్సీ) సలహాదారు శ్రీధరన్ రూపొందించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్)కు ఏపీ మంత్రిమండలి ఆమోదం తెలిపింది. మరోవైపు రాజధాని అమరావతికి అక్టోబర్ 22న శంకుస్థాపన చేయాలని నిర్ణయించింది. బుధవారం సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీ సుదీర్ఘంగా జరిగింది. దీంట్లో తీసుకున్న నిర్ణయాల్ని సమాచారమంత్రి పల్లె రఘునాథరెడ్డి మీడియాకు వెల్లడించారు. ్హవిజయవాడ మెట్రో ప్రాజెక్టులో రెండు కారిడార్లు, 25 స్టేషన్లు ఉంటాయి. ఏపీ రాజధాని అమరావతికి మెట్రో రైలు లింకుతో పండిట్ నెహ్రూ బస్టాండ్ నుంచి బందరు రోడ్డు మీదుగా పెనమలూరు వరకు 12.76 కి.మీ., 12 స్టేషన్లు మొదటి కారిడార్‌లో ఉంటాయి. దీని అంచనా వ్యయం రూ.2,558 కోట్లు. * రెండో కారిడార్ పండిట్ నెహ్రూ బస్టాండ్ నుంచి ఏలూరు రోడ్డు, ఎనికేపాడుల మీదుగా గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం వరకు 13.27 కి.మీ., 13 స్టేషన్లు ఉంటాయి. అంచనా వ్యయం రూ.రూ.3,148 కోట్లు. ఈ ప్రాజెక్టుకు 13.20 హెక్టార్లభూమి అవసరం. ్హగ్యాస్ ఆధారిత పవర్ ప్లాంట్ల పునరుద్ధరణకుగాను వ్యాట్ మినహాయింపునిస్తూ కేబినెట్ ఆమోదముద్ర వేసింది. అక్టోబర్ 22న అమరావతికి శంకుస్థాపన ఈ ఏడాది అక్టోబరు 22న చారిత్రాత్మక అమరావతి రాజధానికి శంకుస్థాపన చేసేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయించింది. ఈ శంకుస్థాపన కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు సింగపూర్, జపాన్ ప్రధానులను ఆహ్వానించాలని నిర్ణయం తీసుకుంది. మన భద్రతకు మన పోలీసులే కేబినెట్ నిర్ణయం!గవర్నర్ లక్ష్యంగా విమర్శలు ఎక్కుపెట్టాలని సూచన సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ సచివాలయం, మంత్రుల ఇళ్ల వద్ద భద్రతకు ఇక నుంచి ఏపీకి చెందిన పోలీసులనే వినియోగించాలని సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం నిర్ణయించింది. హైదరాబాద్‌లో ఏపీ పోలీసులు చాలా మంది పనిచేస్తున్నారని, ఇకనుంచి వారి సేవలను ఉపయోగించాలని తీర్మానించారు. బుధవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ‘ఓటుకు కోట్ల’ వ్యవహారంపై సుదీర్ఘంగా చర్చ సాగింది. ఈ కేసులో ఇరకాటంలో పడిన చంద్రబాబు ప్రధానంగా గవర్నర్ పాత్ర, తెలంగాణ పోలీసులు కల్పిస్తున్న భద్రత, తెలంగాణ ఏసీబీ, దానికున్న అధికారాలు, రాజకీయంగా ఎదురైన ఇబ్బందులు, విభజన చట్టంలోని సెక్షన్ 8 వంటి అంశాలను మంత్రివర్గ సమావేశంలో చర్చకు పెట్టినట్టు సమాచారం. గవర్నర్ విషయంలో కేంద్రానికి ఫిర్యాదు చేశామని, కేంద్రంలో మిత్రపక్షమైన బీజేపీ ప్రభుత్వం ఉన్నందున ఆ ప్రభుత్వాన్ని కాకుండా గవర్నర్ లక్ష్యంగా విమర్శలు ఎక్కుపెట్టాలని నిర్ణయించినట్టు తెలిసింది. నామినేటెడ్ ఎమ్మెల్యేకు లంచం ఇవ్వజూపిన కేసులో అరెస్టయిన రేవంత్‌రెడ్డితో పాటు నోటీసులు అందుకున్న సండ్ర వెంకటవీరయ్య, వేం నరేందర్‌రెడ్డి తెలంగాణకు చెందిన వారని, ఒకవేళ ఏసీబీ మనకు ఒక్క నోటీసు ఇచ్చినా అందుకు ప్రతిగా పది నోటీసులు ఇవ్వాలని సీఎం చెప్పినట్టు తెలిసింది. హైదరబాద్‌లో ఏపీ ఉపయోగించుకుంటున్న భవనాలకు ఆస్తి పన్ను చెల్లించాలంటూ గ్రేటర్ హైదరాబాద్ నగర పాలక సంస్థ నోటీసులు ఇచ్చిన అంశం చర్చకు వచ్చింది. ఒక రాష్ర్ట సీఎంగా ఉన్న తాను ఇల్లు నిర్మించుకునేందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా గ్రేటర్ హైదరాబాద్ నగరపాలక సంస్థ అధికారులకు దరఖాస్తు చేసుకుంటే ఇంత వరకూ మంజూరు చేయలేదని చెప్పినట్టు తెలిసింది. కాగా సీఎం చంద్రబాబు గురువారం పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. కర్ణాటక తరహా మద్యం విధానానికి గ్రీన్‌సిగ్నల్ * కొత్త విధానానికి బాబు పచ్చజెండా సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతం ఓటుకు నోట్లు వ్యవహారంలో పరువు పోగొట్టుకున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తమిళనాడు తరహా మద్యం విధానం తేవడానికి వెనకడుగువేసింది. దీంతో సీఎం చంద్రబాబు , కర్ణాటక తరహా మద్యం విధానానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. బుధవారం సచివాలయంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో నూతన మద్యం విధానం మార్గదర్శకాలకు ఆమోదం తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన 4,380 మద్యం దుకాణాల్లో 10 శాతం దుకాణాలను ప్రభుత్వమే నిర్వహించాలని, మిగతా వాటిని వేలంపాట, లాటరీ ద్వారా ప్రైవేట్ వారికి అప్పగించాలని నిర్ణయం తీసుకున్నారు. అలాగే తెలంగాణ సర్కారు చౌక మద్యం తీసుకు వస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో కూడా టెట్రా ప్యాకెట్లలో చౌక మద్యం అమ్మాలని నిర్ణయం తీసుకున్నారు. ఒక్కో ప్యాకెట్‌ను రూ. 30 నుంచి రూ. 40 అందుబాటులోకి తేవాలని నిర్ణయించారు. ప్రస్తుతం ఉన్న లెసైన్స్ ఫీజులను పెంచి, ప్రాంతాల ఆధారంగా వాటిని హేతుబద్ధీకరించనున్నారు. రాష్ట్రంలో డిమాండ్‌కు తగ్గ మద్యం ఉత్పత్తిని కూడా రాష్ట్రంలోనే చేయాలని సీఎం చంద్రబాబు సూచించారు. తెలంగాణ వాళ్లు తరిమేస్తే తీసుకోలేం! * విద్యుత్ ఉద్యోగులపై స్పష్టం చేసిన సీఎం * రెంటికీ చెడ్డ ట్రాన్స్‌కో ఉద్యోగుల పరిస్థితి సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం రిలీవ్ చేసిన ఏపీ విద్యుత్ ఉద్యోగుల విషయంలో సీఎం చంద్రబాబు ఏ మాత్రం సానుభూతి ప్రదర్శించలేదని తెలిసింది. సమస్య తీవ్రతను విద్యుత్ ఉన్నతాధికారులు బుధవారం ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వమే ఏదైనా చెయ్యాలని డిమాండ్ చేస్తున్నారని ట్రాన్స్‌కో సీఎండీ విజయానంద్, ఏపీ ఇంధన కార్యదర్శి అజయ్ జైన్లు సీఎంతో అన్నట్టు తెలిసింది. ‘వాళ్లను తీసుకొచ్చి ఎక్కడ పెట్టుకుంటాం? పవర్ సెక్టార్లో ఛాన్స్ ఇస్తే మిగతా శాఖల మాటేంటి? అక్కడా తరిమేస్తే వాళ్లనూ తీసుకుందామా? ఇలా అందరినీ తీసుకుంటే జీతాలు ఎక్కడి నుంచి తేవాలి? వాళ్ల తిప్పలు వాళ్లను పడమని చెప్పండి. కోర్టు ఆర్డర్‌ను ఎందుకు అమలు చేయరో టీఎస్ సర్కారును ప్రశ్నించమనండి. ఆందోళనలు చేయమనండి. ...’ అని అధికారులకు చంద్రబాబు గీతోపదేశం చేసినట్టు తెలిసింది. ఈ మాటను నేరుగా చెప్పలేక, విషయాన్ని ఏపీ జెన్కో వెబ్సైట్లో ఉంచారు. కాగా పరిస్థితిని వివరించేందుకు ఉద్యోగులు ఏపీ ట్రాన్స్‌కో సీఎండీని బుధవారం కలిసే ప్రయత్నంచేశారు. ఆయన మాట్లాడేందుకు ఇష్టపడటం లేదని సిబ్బంది చెప్పడంతో వారు వెనుదిరిగారు. జెన్కో సంస్థల్లో పనిచేస్తున్న సిబ్బంది పరిస్థితి మరీ దారుణంగా ఉంది. -
పరిశ్రమలకు భూములు
28 ఎకరాలు కేటాయిస్తూ కేబినెట్ నిర్ణయం 6న ఉదయం 8.49 నిమిషాలకు రాజధాని నిర్మాణానికి భూమిపూజ జిల్లా మంత్రుల సమక్షంలో ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలు సాక్షి ప్రతినిధి, గుంటూరు : జిల్లాలో పరిశ్రమల స్థాపనకు 28 ఎకరాలను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించనుంది. శుక్ర వారం రాష్ట్ర కేబినెట్ తీసుకున్న ముఖ్య నిర్ణయాల్లో పరిశ్రమలకు భూముల కేటాయింపు ఒకటి. జిల్లాలోని పలు ప్రాంతాల్లో పరిశ్రమల స్థాపనకు అవసరమైన భూమిని కేటాయించేందుకు అధికార యంత్రాంగం ఇప్పటికే కొన్ని ప్రాంతాలను గుర్తించింది. ముఖ్యంగా పల్నాడు, జిల్లాలోని పలు ఆటోనగర్‌ల్లో వివిధ రకాల పరిశ్రమల స్థాపనకు అనువైన భూములను గుర్తించింది. వీటిల్లో అనేక భూములను ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు గతంలో ప్రభుత్వం కేటాయించింది. అనేక మంది వివిధ కారణాలను చూపుతూ అక్కడ పరిశ్రమలు స్థాపించలేక పోయారు. వాటిని స్వాధీనం చేసుకోవాలని, అలాగే పల్నాడులోని ప్రభుత్వ భూములను ఈ పరిశ్రమలకు కేటాయించనున్నారు. వీటితోపాటు రాజధాని నిర్మాణానికి వచ్చేనెల 6వ తేదీన ఉదయం 8.49 నిమిషాలకు భూమిపూజ చేయాలని నిర్ణయం తీసుకుంది. అయితే భూమి పూజ ఎక్కడ చేయనున్నారో ప్రకటించలేదు. వివిధ ప్రభుత్వ శాఖల్లోని ఉద్యోగుల బదిలీలు జిల్లా మంత్రుల సమక్షంలో జిల్లా కలెక్టర్లు చేయాలని మంత్రివర్గం తీసుకున్న నిర్ణయం పట్ల మిశ్రమ స్పందన వ్యక్తం అవుతోంది. టీడీపీకి అనుకూలమైన ఉద్యోగులకు ఈ విధానంలో బదిలీలు జరిగే అవకాశం ఉంటుందని ఒక వర్గం అభిప్రాయపడుతుంటే, అవినీతికి అవకాశం లేకుండా పోతుందని మరో వర్గం పేర్కొంటుంది. జరూసలం వెళ్లే క్రైస్తవులకు ప్రయాణ ఖర్చులు ఇచ్చేందుకు ప్రత్యేకంగా నిధులు కేటాయించడం పట్ల ఆ వర్గాల నుంచి హర్షం వ్యక్తం అవుతోంది. -
ఎన్నాళ్లిలా?
►రుణమాఫీ అమలు చేయకుండా మూడు నెలలుగా నెట్టుకొస్తున్న బాబు ►కోటయ్య కమిటీ, రీషెడ్యూలు, కేబినెట్ నిర్ణయం, జీవో జారీ అంటూ కాలయాపన ►ఆర్బీఐ, నాబార్డు ఆదేశాలే బ్యాంకులకు శిరోధార్యం ►రాష్ట్ర ప్రభుత్వం తమకు ఆదేశాలు ఇవ్వజాలదంటున్న బ్యాంకర్లు ►యథావిధిగా రైతులకు నోటీసులు.. జప్తులు ►రుణమాఫీ అమలు కాకపోతే జిల్లాలో రైతుల నెత్తిన అదనంగా రూ.858.41 కోట్ల వడ్డీ భారం అనంతపురం : జనం ముందుకు వచ్చే ప్రతి సందర్భంలోనూ రుణమాఫీపై తమ ప్రభుత్వం ఏదో చేసేస్తోందన్న భ్రమను కల్గించే విధంగా చంద్రబాబు, ఆయన అనుంగు మంత్రులు వ్యవహరిస్తూ వస్తున్నారని ఇటీవలి పరిణామాలు పరిశీలిస్తే అర్థమవుతుంది. ఎన్నికల ముందేమో తన తొలి సంతకం రుణమాఫీ ఫైలుపైనేనని ప్రకటించారు. ప్రమాణ స్వీకారం రోజున నిజంగా ఆ ఫైలుపైనే సంతకం చేస్తారేమోనన్న భావన కలుగజేశారు. చివరకు విధివిధానాల కోసం ‘కోటయ్య కమిటీ’ నియామకం ఫైలుపై సంతకం చేశారు. ఆ కమిటీ నివేదిక పేరుతో కొద్ది రోజులు గడిపి.. జూన్ 30న రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశంలో రుణమాఫీ గురించి కాకుండా రీషెడ్యూల్‌పై మాట్లాడారు. జూలై 16, 17 తేదీల్లో చంద్రబాబు పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటించారు. ఈ పర్యటనకు రెండు, మూడు రోజుల ముందు నుంచి రుణాల రీషెడ్యూల్కు ఆర్బీఐ అంగీకరించిందన్న ప్రచారం ఓ ప్రణాళిక ప్రకారం జరిగింది. రీషెడ్యూల్ అయిపోయినట్లేనని, ప్రస్తుతానికైతే రైతులకు సమస్య తీరుతుందని, రీషెడ్యూలు చేసిన రుణాలను రాష్ట్ర ప్రభుత్వం దశలవారీగా చెల్లిస్తుందని... ఇలా చెప్పుకుంటూ పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనను ముగించారు. తర్వాత జూలై 24, 25 తేదీల్లో అనంతపురం జిల్లా పర్యటనకొచ్చారు. అంతకు మూడు రోజుల ముందు రూ.1.5 లక్షల వరకు వ్యవసాయ రుణాలు, రూ.లక్ష చొప్పున డ్వాక్రా రుణాల మాఫీకి కేబినెట్లో నిర్ణయం తీసుకున్నామని ప్రకటించారు. దీనివల్ల వ్యవసాయ రుణాలు తీసుకున్న రైతుల్లో దాదాపు 96 శాతం మందికి లబ్ధి చేకూరనుందంటూ ప్రచారం చేశారు. ఈ ప్రచారాల నేపథ్యంలోనే చంద్రబాబు అనంతపురం జిల్లా పర్యటన ముగిసింది. తర్వాత ఈ మూడు వారాల్లో రీషెడ్యూలు ప్రతిపాదనను రిజర్వు బ్యాంకు తిప్పికొట్టడంతో కథ మళ్లీ మొదటికొచ్చింది. కరువు, వరదల వల్ల పంటనష్టం జరిగితే మూడు నెలల్లోపే రీషెడ్యూలుకు ప్రతిపాదనలు పంపాల్సి ఉంటుందని, సాధారణ దిగుబడిలో 50 శాతం కన్నా తక్కువ ఉన్నప్పుడే రీషెడ్యూలు సాధ్యమవుతుందని ఆర్బీఐ స్పష్టం చేసింది. ‘మీరు ఎన్నికల్లో రుణమాఫీ హామీ ఇచ్చారు కాబట్టి.. మమ్మల్ని రీషెడ్యూలు చేయమంటే కుదరద’ని తేల్చి చెప్పింది. ఆగస్టు 15న జాతీయ జెండా ఎగరేసేందుకు చంద్రబాబు మళ్లీ ప్రజల ముందుకు రావాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో ఆగస్టు 14న ప్రభుత్వం రుణమాఫీపై ఒక జీవోను విడుదల చేసింది. మూడు వారాల క్రితం మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగానే ఈ జీవో విడుదలైంది. మళ్లీ ప్రభుత్వమూ, దాని వందిమాగధులు ‘అంతా అయిపోయింది. జీవో వచ్చేసింది. రూ.1.5 లక్షలోపు రుణాలన్నీ ఇక మాఫీ అయిపోయినట్లే’ అని ఊదరగొట్టాయి. ఈ ప్రచార పటాటోపం మధ్య బాబు జెండా ఆవిష్కరణ పూర్తి చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ చంద్రబాబు ప్రజల మధ్యకు వచ్చే ప్రతి సందర్భంలోనూ రుణమాఫీపై తామేదో చేస్తున్నట్లు భ్రమ కల్పిస్తూ రోజులు నెట్టుకొస్తున్నారని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. రుణమాఫీ కాకపోతే రైతు నెత్తిన రూ.858 కోట్ల వడ్డీ భారం జిల్లాలో 6.08 లక్షల మంది రైతులు రూ.3,093 కోట్ల పంట రుణాలను బ్యాంకులకు చెల్లించాల్సి ఉంది. 2.12 లక్షల మంది రైతులు చెల్లించాల్సిన బంగారు తాకట్టు రుణాల మొత్తం రూ.1,851 కోట్లు ఉంది. దాదాపుగా ఈ మొత్తమంతా రూ.1.5 లక్షల రుణ పరిమితికి లోపలే ఉంది. 69,709 స్వయం సహాయక సంఘాల రుణాలు రూ.1,264 కోట్లు, 5,537 చేనేత సహకార సంఘాల రుణాలు రూ.35.05 కోట్లు ఉన్నాయి. జిల్లాలో వ్యవసాయ, చేనేత, డ్వాక్రా రుణాలన్నీ కలిపి మొత్తం రూ.6,243 కోట్లు ఉన్నాయి. మామూలుగా అయితే ఈ రుణాలన్నింటికీ బ్యాంకులు 7 శాతం వడ్డీ వసూలు చేస్తాయి. నిర్ణీత కాల పరిమితిలోపు రుణం తీరిస్తే కేంద్ర ప్రభుత్వ ప్రోత్సాహకం కింద 4 శాతం వడ్డీ మాఫీతో పాటు మిగిలిన 3 శాతం(పావలా) వడ్డీని రాష్ట్ర ప్రభుత్వం భరించేది. చంద్రబాబు రుణమాఫీ హామీని నమ్మి రైతులు రుణాలను ఇప్పటికీ తిరిగి చెల్లించలేదు. ఈ కారణంగా ప్రస్తుతం 11.75 శాతం వడ్డీని బ్యాంకులు వసూలు చేయనున్నాయి. ఈ ఖరీఫ్ సీజన్ కూడా దాటితే (సెప్టెంబర్ తర్వాత) మరో 2 శాతం వడ్డీ పెరుగుతుంది. అప్పుడు రైతులు 13.75 శాతం వడ్డీ చెల్లించాల్సి వస్తుందని బ్యాంకర్లు స్పష్టం చేస్తున్నారు. ఈ లెక్కన రుణమాఫీ జరగకపోతే రైతులు అదనంగా వడ్డీ కింద రూ.858.41 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. బ్యాంకుల ముందు జీవో చెల్లని కాగితమే ప్రభుత్వం గురువారం రుణమాఫీపై జీవో విడుదల చేసిన నేపథ్యంలో ‘సాక్షి’ బ్యాంకర్లను కలిసి వివరణ కోరింది. బ్యాంకులను రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశించ జాలవని వారు స్పష్టం చేశారు. సహకార రంగంలోని బ్యాంకులకైతే నాబార్డ్, మిగతా బ్యాంకులకు ఆర్బీఐ ఆదేశాలు జారీ చేస్తాయని, వాటి ప్రకారమే బ్యాంకులు నడుచుకుంటాయని వారు స్పష్టం చేశారు. ‘రైతులు బ్యాంకుల వద్ద రుణం తీసుకున్నారు. ఇప్పుడు దాన్ని రైతులైనా చెల్లించాలి లేదా వారి తరఫున రాష్ట్ర ప్రభుత్వమైనా కట్టాలి. డబ్బు చెల్లించకుండా వట్టిమాటలు ఎన్ని చెప్పినా రుణాలు మాఫీకావు. ఆర్బీఐ సూచనల మేరకు రుణాల వసూళ్లకు సంబంధించి నోటీసుల జారీ, బంగారు, భూముల వేలం లాంటి చర్యలు ఉంటాయ’ని వారు స్పష్టం చేస్తున్నారు. -
తెలంగాణపై కేంద్ర కేబినెట్ నిర్ణయంలో మార్పు ఉండదు
హైదరాబాద్: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుపై కేంద్ర మంత్రి మండలి నిర్ణయంలో మార్పు లేదని కేంద్ర మంత్రి గులాంనబీ ఆజాద్ చెప్పారు. 2014లో రెండు రాష్ట్రాలు ఏర్పడతాయని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లు (తెలంగాణ బిల్లు)పై పార్లమెంటు ఉభయసభల్లో చర్చ జరగడం లేదని చెప్పారు. రాష్ట్ర విభజన విషయంలో శాసనసభ అభిప్రాయం చెప్పాలన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కొత్తపార్టీ పెట్టరని, ఆయన కాంగ్రెస్ వాదని చెప్పారు. -
బిల్లుకు ఆమోదంపై ఎవరేమన్నారు?
అసెంబ్లీలో ముక్తకంఠంతో వ్యతిరేకించాలి సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కేంద్రం సుముఖత ఊహించిందే. కేబినెట్ నిర్ణయం పెద్దగా ఆశ్చర్యపరచలేదు. రాజకీయ ప్రయోజనాల కోసమే రాష్ట్ర విభజనకు కాంగ్రెస్ నిర్ణయించుకుంది. జీవోఎం నివేదిక కేబినెట్ ముందుకు టేబుల్ ఐటంగా వచ్చినా వ్యతిరేకించలేని సీమాంధ్ర కేంద్ర మంత్రుల తీరే దురదృష్టకరం. జీవోఎం ఏం సిఫారసు చేసిందో చదివే అవకాశం కూడా లేకుండా హడావుడిగా టేబుల్ ఐటంగా ప్రవేశపెట్టడం సరికాదంటూ వ్యతిరేకించే ధైర్యం కూడా లేనివాళ్లు కేంద్ర మంత్రులుగా ఉండటం సీమాంధ్ర ప్రజలకు శాపంగా మారింది. వారి చేతగానితనం మరోసారి తేటతెల్లమైంది. ఇక భారమంతా సీమాంధ్ర ప్రాంత ఎమ్మెల్యేలదే. తెలంగాణ ముసాయిదా బిల్లు అసెంబ్లీకి వచ్చినప్పుడు వారు పార్టీలకతీతంగా ముక్తకంఠంతో వ్యతిరేకించాలి. అసెంబ్లీ అభిప్రాయానికి వ్యతిరేకంగా కేంద్రం నిర్ణయం ఉండటాన్ని రాష్ట్రపతి కచ్చితంగా ప్రశ్నిస్తారని అనుకుంటున్నాం. ఆయన సుప్రీంకోర్టు అభిప్రాయాన్ని తీసుకునే అవకాశం కూడా ఉంది. విభజన ప్రక్రియ నిలిచిపోవటానికి అసెంబ్లీ అభిప్రాయం కారణం అయ్యే అవకాశం ఉన్నందున ఎమ్మెల్యేలు వారి నియోజకవర్గ ప్రజల మనోభావాలకు తగ్గట్టుగా సమైక్య రాష్ట్రం కోసం అసెంబ్లీలో నినదించాలి. ఇలా మాట్లాడాలని మా వేదిక తరఫున ఎమ్మెల్యేల నుంచి అఫిడవిట్లు సేకరిస్తున్నాం. వారు కూడా సీమాంధ్ర కేంద్ర మంత్రుల్లా చేతులెత్తేస్తే ప్రజలే బుద్ధి చెబుతారు. -ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిరక్షణ వేదిక నేత జస్టిస్ లక్ష్మణరెడ్డి నేటి బంద్‌ను జయప్రదం చేయండి కేంద్ర మంత్రివర్గ దుర్మార్గపు నిర్ణయాన్ని నిరసిస్తూ ఈనెల 6న బంద్ పాటించాలని, ఇందులో అన్ని వర్గాల ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిరక్షణ వేదిక రాష్ట్ర కోఆర్డినేటర్ వి.లక్ష్మణరెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సీమాంధ్రలోని రాష్ట్ర ఎంపీలు, కేంద్ర మంత్రులు వెంటనే రాష్ట్రపతిని కలిసి కేంద్ర ప్రభుత్వానికి తమ మద్దతు ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించాలని డిమాండ్ చేశారు. అన్యాయం, అక్రమం, దుర్మార్గం కేంద్ర కేబినెట్ నిర్ణయం అన్యాయం, దుర్మార్గం. కాంగ్రెస్ తన రాజకీయ ప్రయోజనాల కోసమే ఈ నిర్ణయం తీసుకుంది. విభజన జరగకుండా తుదివరకు పోరాడుతాం. - సీవీ మోహన్‌రెడ్డి, సీమాంధ్ర న్యాయవాదుల జేఏసీ కన్వీనర్ ఇది బ్లాక్ డే ఇది బ్లాక్ డే. సీమాంధ్రుల భవిష్యత్తుకు గొడ్డలిపెట్టు. మెజారిటీ ప్రజల అభిప్రాయాన్ని, రాజ్యాంగ విలువను కాలరాశారు. ఆర్టికల్-3 దుర్వినియోగమయ్యే పరిస్థితికి ఇది నిదర్శనం. దీన్ని అడ్డుకునేందుకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి చేస్తున్న ప్రయత్నాలకు మా పూర్తి మద్దతు ఉంటుంది. జగన్ పిలుపుమేరకు శుక్రవారం నాటి బంద్‌కు మా సంపూర్ణ మద్దతు ఉంటుంది. - కె.వి.కృష్ణయ్య, సచివాలయ సీమాంధ్ర ఉద్యోగుల ఫోరం ప్రభుత్వాన్ని కాదని గవర్నర్ రక్షణ ఎలా కల్పిస్తారు? తెలంగాణ గవర్నర్, ఇద్దరు కేంద్ర అధికారులకు శాంతిభద్రతల బాధ్యతను అప్పగించడం ఎలా రక్షణ చర్యో అర్ధం కావడం లేదు. హైదరాబాద్‌లో ఉండే సీమాంధ్రుల రక్షణ కోసం కేంద్రం తీసుకున్న చర్యలు సరిగ్గా లేవు. తెలంగాణ ముఖ్యమంత్రిని, ఇక్కడి ప్రభుత్వాన్ని తోసిరాజని గవర్నర్ ఎలాంటి రక్షణ కల్పించగలరు. రాష్ట్ర ప్రభుత్వాన్ని పక్కన పెట్టి కేంద్రం సలహాలు,సూచనలు పాటించడం సాధ్యమవుతుందా? - ప్రొఫెసర్ కంచె ఐలయ్య -
కేబినెట్ నిర్ణయాన్ని స్వాగతించిన టి.నేతలు
-
కమీషన్ల కోసమే దుమ్ముగూడెం : వివేక్
ప్రాజెక్టు రద్దుకు వివేక్ డిమాండ్ సాక్షి, న్యూఢిల్లీ: కేబినెట్ ఆమోదం, కేంద్ర జల సంఘం అనుమతి లేకుండా, ప్రాజెక్టు వివరణాత్మక నివేదిక (డీపీఆర్) అందచేయకుండానే కాంట్రాక్టు కమీషన్ల కోసం దుమ్ముగూడెం ప్రాజెక్టును ప్రకటించారని, దానిని వెంటనే రద్దు చేయాలని పెద్దపల్లి ఎంపీ జి.వివేక్ డిమాండ్ చేశారు. తెలంగాణకు అన్యాయం చేస్తూ కమిషన్ల కోసమే సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఈ ప్రాజెక్టును ప్రకటించారని ఆయన ఆరోపించారు. ఢిల్లీలో గురువారం ఆయన ఈ మేరకు మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ వస్తుందని తెలిసి కూడా సీఎం కిరణ్ కాంట్రాక్టుల రూపంలో దండుకుంటున్నారని ఆరోపించారు. ప్రాజెక్టును తన సోదరుడికి కట్టబెట్టి, అడ్వాన్సు ఇచ్చి వాపసు తీసుకోవడానికి కిరణ్ చేస్తున్న ప్రయత్నాలను కేంద్రం గమనించాలన్నారు. సీమాంధ్ర ప్రజలను సీఎం కిరణ్, వైఎస్ఆర్సీపీ అధినేత వై.ఎస్. జగన్మోహన్రెడ్డి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తప్పుదారి పట్టిస్తున్నారని విమర్శించారు. తెలంగాణను అడ్డుకోవడం మాని సీమాంధ్రకు రాజధాని ఎక్కడ ఉండాలో? కేంద్ర విశ్వవిద్యాలయాలు, ఐఐటీలు ఎక్కడ ఉండాలో, ఇంకా ఏమేం కావాలో అఖిలపక్ష భేటీలో ప్రతిపాదనలు చేయాలని వారికి సూచించారు. మాజీ ఎంపీ వినోద్ మాట్లాడుతూ.. దేశంలో అత్యధిక చిన్నరాష్ట్రాలు ఇచ్చిన ప్రధాని ఇందిరాగాంధీయే అన్న విషయం సీఎం కిరణ్ తెలుసుకోవాలన్నారు. నాడు పంజాబ్ విభజనను వ్యతిరేకించిన ఆ రాష్ట్ర సీఎంను ఇందిర బర్తరఫ్ చేశారని, నేడు సీఎం కిరణ్‌ను కూడా బర్తరఫ్ చేయించి కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ విభజన పూర్తి చేయాలన్నారు. -
72 గంటల బంద్ తొలిరోజు సూపర్ సక్సెస్
-
ప్రజల ఆత్మగౌరవం ప్రతిబింబించింది
గద్వాల న్యూటౌన్, న్యూస్‌లైన్: తెలంగాణ ప్రజలు ఆకాంక్ష, ఆత్మగౌరవం ప్రతిబింబించేలా కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకోవడం సంతోషకరమని మాజీ మంత్రి డీకే సమరసింహారెడ్డి అన్నారు.శుక్రవారం స్థానిక తన నివాసంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదన్నారు. ఆర్టికల్-3 ప్రకారం ముందుగా రాష్ట్రపతి అనుమతితో బిల్లును ప్రవేశ పెట్టి...చివరకు రాష్ట్రపతి ఆమోద ముద్రపడిన తర్వాతే కలసాకారం అవుతుందన్నారు. ఈ ప్రక్రియ ఐదు దశల్లో ఉంటుందని, చివరి ప్రక్రియ జరిగే వరకు తెలంగాణ వాదులు అప్రమత్తంగా ఉండాలన్నారు. బిల్లు ఆమోదముద్ర పొందిన తర్వాత రాష్ట్రంలో సెక్షన్-3 ప్రకారం సవరణలు తెచ్చిన తర్వాతే ప్రక్రియ పూర్తి అవుతుందన్నారు. తెలంగాణ కల సాకారం అవుతున్న వేళ ఈ ప్రాంత ప్రజలు సీమాంధ్రుల పట్ల ప్రేమపూర్వకంగా ఉండాలని కోరారు. ఆంధ్ర ఎన్జీఓలు రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తున్నారని, అశోక్‌బాబు తనను తాను కంట్రోల్ చేసుకోవాలని సూచించారు. కొంతమంది సీమాంధ్రులు జూరాల ప్రాజెక్టు ఎత్తున పెంచుతారని అసత్య ప్రచారం చేస్తున్నారని, సాంకేతికంగా ఇది సాధ్యం కాదన్నారు. సమావేశంలో టీడీపీ నేతలు వేణుగోపాల్, లత్తిపురం వెంకట్రామిరెడ్డి, ఇస్మాయిల్, కర్ణకుమార్, తదితరులు పాల్గొన్నారు. -
దిగ్విజయ్ జోక్యంతో దిగివచ్చిన ఎస్.ఎం.కృష్ణ
సాక్షి, బెంగళూరు: కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్ సింగ్ జోక్యంతో మాజీ సీఎం ఎస్.ఎం.కృష్ణ ఎట్టకేలకు అలకపాన్పు నుంచి దిగివచ్చారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటున్న కృష్ణ ఇంటికి దిగ్విజయ్ గురువారం పీసీసీ అధ్యక్షుడు పరమేశ్వరను వెంటపెట్టుకుని వెళ్లారు. ఈ సందర్భంగా దిగ్విజయ్ వద్ద కృష్ణ తన అసంతృప్తిని వెళ్లగక్కినట్లు సమాచారం. మంత్రివర్గం కూర్పులో తన మాటకు విలువ ఇవ్వలేదని, ఎన్నికల సమయంలో తన సేవలను వినియోగించుకోవడం, ఆ తర్వాత విస్మరించడం మామూలైపోయిందని నిష్టూరాలాడినట్లు తెలిసింది. అయితే, దిగ్విజయ్ నచ్చజెప్పడంతో కృష్ణ శాంతించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.