
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ముడిచమురు, గ్యాస్ క్షేత్రాల లైసెన్సుల్ని కంపెనీలకు కేటాయించే అధికారాన్ని ఆర్థిక, పెట్రోలియం మంత్రిత్వశాఖలకు అప్పగిస్తూ ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇంతకాలం ఈ లైసెన్సులను జారీచేసే అధికారం కేబినెట్ కమిటీకే ఉండేది.
ఎంపవర్డ్ కమిటీ ఆఫ్ సెక్రటరీస్(ఈసీఎస్) సిఫార్సుల మేరకు బిడ్డింగ్‌లో విజేతలుగా నిలిచిన సంస్థలకు బ్లాకుల్లో పెట్రోలియం, సహజవాయువు వెలికితీతకు ఆర్థిక, పెట్రోలియం శాఖ మంత్రులు లైసెన్సులు జారీచేస్తారని కేంద్రం తెలిపింది. కాంట్రాక్టును దక్కించుకున్న కంపెనీలు తమ వాటాల్లో కొంతమొత్తాన్ని ఇతర సంస్థలకు అమ్ముకునేందుకు ఇకపై అనుమతిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment