సీమాంధ్ర సత్తా చాటుదాం | Simandhra movements are very serious look | Sakshi

సీమాంధ్ర సత్తా చాటుదాం

Published Wed, Aug 28 2013 5:50 AM | Last Updated on Tue, May 29 2018 11:47 AM

Simandhra movements are very serious look

కడప కార్పొరేషన్, న్యూస్‌లైన్: సీమాంధ్రవాసులు ఉద్యమాలను తీవ్రతరం చేసి తమ సత్తా ఏమిటో చూపాలని నాయీ బ్రాహ్మణ సేవా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.యానాదయ్య పిలుపునిచ్చారు. సమైక్యాంధ్రకు మద్దతుగా ఆంధ్రప్రదేశ్ నాయీ బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో మంగళవారం అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు.
 
 ఈ ప్రదర్శన డప్పు వాయిద్యాలతో ఐటీఐ సర్కిల్ నుంచి ప్రారంభమై కోటిరెడ్డి సర్కిల్, ఎన్టీఆర్ సర్కిల్, ఏడురోడ్ల కూడలి మీదుగా కలెక్టరేట్‌కు చేరింది. దీక్షలు చేస్తున్న వారికి నాయీ బ్రాహ్మణులు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా యానాదయ్య మాట్లాడుతూ సీమాంధ్రులు తమ బలాన్ని చూపాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. హైదరాబాద్‌లో సీమాంధ్ర ఉద్యోగులను తెలంగాణావాదులు భయబ్రాంతులకు గురి చేస్తున్నారని పేర్కొన్నారు.
 
 ముఖ్యమంత్రి, చంద్రబాబు, ఎంపీలు, మంత్రులు రాజీనామా చేసి రావాలని, లేకపోతే ప్రజలు క్షమించరని హెచ్చరించారు. సీమాంధ్రులు దంచుడు మొదలుపెడితే తెలంగాణా వాదులు తట్టుకోలేరన్నారు. ఈ కార్యక్రమంలో నాయీ బ్రాహ్మణ సంఘం నాయకులు నాగరాజు, చంద్రశేఖర్, మల్లేశ్వరయ్య, జి.సుబ్బరాయుడు, వెంకటసుబ్బయ్య, బాషా, శివ, మల్లికార్జున పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement