
ఎర్రబెల్లీ... నీది ఏ ప్రాంతం..?: కడియం
దేవరుప్పుల(వరంగల్): తెలంగాణ ప్రజలు చీకట్లో మగ్గేలా ఇప్పటికీ కుట్రలు చేస్తున్న ఏపీ సీఎం చంద్రబాబు వంచన ఉన్న టీడీప శాసనసభాపక్ష నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు ఏ ప్రాంత బిడ్డో తేల్చుకోవాలని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అన్నారు. వరంగల్ జిల్లా దేవరుప్పుల మండల కేంద్రంలో కడియం సమక్షంలో కాంగ్రెస్‌కు చెందిన ప్రజాప్రతినిధులు టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ స్వపరిపాలన కోసం టీఆర్‌ఎస్ వైపు ప్రజలు ఆకర్షితులపుతున్నారన్నారు.
క్షేత్రస్థాయి శ్రేణులను చూసైనా ఎర్రబెల్లిలో మార్పు రాలేదని మండిపడ్డారు. బాబు మోచేతి నీళ్ల కోసం తహతహలాడే ఎర్రబెల్లి పునర్విభజన కింద రాష్ట్రానికి రావాల్సిన 1133 మెగావాట్ల విద్యుత్ సంగతి తేల్సుకుని... తెలంగాణ బిడ్డవో...చంద్రబాబు చెంచావో నిర్ణయించుకోవాలని వ్యాఖ్యానించారు.