
'ఎర్రబెల్లీ.. నీచ రాజకీయూలు మానుకో'
కొడకండ్ల: నీచమైన భాషతో దిగజారుడు విమర్శలు చేస్తున్న ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు నీచ రాజకీయాలు మానుకోవాలని డిప్యూటీ సీఎం కడి యం శ్రీహరి అన్నారు. వరంగల్ జిల్లా కొడకండ్ల మండలం వడ్డేకొత్తపెల్లిలో శుక్రవారం ఏర్పాటు చేసి న విలేకరుల సమావేశంలో ఎర్రబెల్లిపై కడియం నిప్పులు చెరిగారు. ‘నేను తెలంగాణ ఊసెత్తలేదని విమర్శించావు.. టీడీపీలో ఉన్నప్పుడు తెలంగాణ తీర్మానం చేయించింది.. రెండు కళ్ల సిద్ధాంతం, రెండు నాల్కల ధోరణి వద్దని చంద్రబాబుకు తాను చెప్పింది వాస్తవం కాదా, దీనికి ఎర్రబెల్లి ప్రత్యక్ష సాక్షి కాదా’ అని ప్రశ్నించారు.
చంద్రబాబు ద్వంద్వ వైఖరి నచ్చక, టీడీపీలో ఉండి ప్రజలను మోసం చేయవద్దనే ఉద్దేశంతోనే టీఆర్‌ఎస్‌లో చేరానని స్పష్టం చేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని 42 ఎంపీ స్థానాల్లో రికార్డు మెజారిటీ సాధించిన ఎంపీని, ఒక నియోజకవర్గంలో లక్షా వెయ్యి ఓట్ల మెజారిటీ సాధించిన ఎంపీని కూడా నేనేనని, ప్రజలకు తనపై ఉన్న విశ్వాసానికి ఇది నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.