తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో బీజేపీ పాత్రే కీలకం: కిషన్‌రెడ్డి
ఉపవాసదీక్ష విరమింపజేసిన కోదండరాం
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ ప్రజల ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ఆకాంక్షను నెరవేర్చడంలో బీజేపీ కీలకపాత్ర పోషించిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. సీమాంధ్ర ప్రాంతానికి ప్రత్యేక రాయితీలు, ప్రాజెక్టులు అందించడంలోనూ జాతీయపార్టీగా బీజేపీ సఫలమైందన్నారు.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ బిల్లు ఉభయసభల్లో పాస్‌కావాలని కోరుతూ ఢిల్లీలోని ఏపీభవన్‌లో కిషన్‌రెడ్డి సోమవారం నుంచి చేపట్టిన దీక్షను టీజేఏసీ చైర్మన్ కోదండరాం నిమ్మరసం తాగించి విరమింపజేశారు. అనంతరం ఏపీభవన్‌లోని వెంకటేశ్వరస్వామి విగ్రహం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన తరవాత విలేకర్లతో మాట్లాడారు. సమావేశంలో కోదండరాం, జేఏసీ నేతలు అద్దంకి దయాకర్, దేవిప్రసాద్, విఠల్, శ్రీనివాస్‌గౌడ్ పాల్గొన్నారు.