హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కరెంట్ కష్టాలు మొదలుకానున్నాయి. ఈ నెల 21నుంచి కరెంట్ కోతలు విధిస్తున్నట్టుగా టీఎస్ఎస్పీడీసీఎల్ నిర్ణయించింది. రోజుకు 4గంటలు చొప్పున కరెంట్ కోత విధించనున్నట్టు తెలంగాణ అధికారులు తెలిపారు. అయితే ఉదయం, సాయంత్రం వేళ్లల్లో ఈ కరెంట్ కోతలు ఉంటాయని టీఎస్ఎస్పీడీసీఎల్ అధికారులు తెలిపారు.