సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్‌పై తెలంగాణ ప్రజలకు నమ్మకం లేదని టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ మహమూద్ అలీ అన్నారు. హైదరాబాద్‌లోని టీఆర్‌ఎస్ కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. తెలంగాణ ఇస్తే టీఆర్‌ఎస్‌ను విలీనం చేస్తామని 2009లో అన్నామని, ఆ తరువాత 1200 మంది యువకులు ఆత్మత్యాగాలకు పాల్పడ్డారని చెప్పారు. ఎన్నికలకు కేవలం రెండు నెలల ముందు తెలంగాణను ఇచ్చి టీఆర్‌ఎస్‌ను విలీనం చేయాలంటే ఎలా కుదురుతుందని ఆయన ప్రశ్నించారు. తెలంగాణకు ఎన్నో ఏళ్లుగా కాంగ్రెస్ అన్యాయం చేసిందన్నారు. పునర్నిర్మాణంలో టీఆర్‌ఎస్ లేకుంటే మరోసారి అదే అన్యాయం జరుగుతుందని మహమూద్ అలీ అభిప్రాయపడ్డారు.
తెలంగాణ ప్రజల అభీష్టం మేరకే కేసీఆర్ వ్యవహరిస్తారని చెప్పారు. ఆటో రిక్షా డ్రైవరు నుంచి ఐఏఎస్ అధికారి దాకా అందరూ టీఆర్‌ఎస్ విలీనం చేయవద్దని కోరుతున్నారని చెప్పారు. తెలంగాణకు, ముస్లిం మైనారిటీలకు అన్యా యం చేసిన కాంగ్రెస్ నేత షబ్బీర్‌అలీకి టీఆర్‌ఎస్‌ను విమర్శించే నైతికఅర్హత లేదన్నారు. తెలంగాణ గురించి, వక్ఫ్ ఆస్తుల గురించి షబ్బీర్ ఏనాడూ నోరు మెదపకుండా తెలంగాణ తెచ్చిన కేసీఆర్‌పై విమర్శలు చేయడం మంచిది కాదన్నారు. తెలంగాణలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
కాంగ్రెస్‌పై తెలంగాణ ప్రజలకు నమ్మకం లేదు: టీఆర్‌ఎస్
Published Fri, Mar 7 2014 1:31 AM | Last Updated on Sat, Sep 2 2017 4:25 AM
Advertisement